వినూత్న ఆలోచన తో ముందుకు దూసుకెళ్తున్న “ట్విస్ట్” మూవీ !!

వినూత్న ఆలోచన తో ముందుకు దూసుకెళ్తున్న “ట్విస్ట్” మూవీ !!

వినూత్న ఆలోచన తో ముందుకు దూసుకెళ్తున్న “ట్విస్ట్” మూవీ !!
రాయల్ ఫిలిమ్స్ బ్యానర్ పై మనూ రాయల్ మధుప్రియ హీరోహీరోయిన్లుగా వెంకట్ దర్శకత్వంలో నిర్మాత సి. రంగ నాయకులు నిర్మించిన చిత్రం “ట్విస్ట్” పోస్టర్ లాంచ్ చేయడం జరిగినది.
 
 అయితే సినీ పరిశ్రమలో మునుపెన్నడూ లేని విధంగా హైదరాబాద్ సిటీ ఆటో యూనియన్ ప్రెసిడెంట్స్, లీడర్స్ చేతుల మీదుగా పోస్టర్ విడుదల జరగడం విశేషం.
 
 ఈ సందర్భంగా ఆటో యూనియన్ లీడర్స్ మాట్లాడుతూ ఇలా మాతో రిలీజ్ చేసిన మొట్టమొదటి సినిమా ఇదే అని, సినిమా బృందానికి మా సహకారం, ట్విస్ట్ సినిమాకి మా  ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటాయని సినిమా విడుదలకు ఎదురు చూస్తున్నామని తెలిపారు.
 
 ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ పోస్టర్ ను ఇలా ఆటో యూనియన్ వారిచే రిలీజ్ చేయడం ఆనందమని సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందని ప్రతి ఒక్కరు సినిమా చూసి ఆదరించాలని కోరారు.
 
 ఈ వినూత్న ప్రచార శైలిని ఎంచుకున్న ట్విస్ట్ సినిమా బృందాన్ని చిత్ర పరిశ్రమ అభినందించడం గమనార్హం.