వరుణ్ తేజ్ పుట్టిన‌రోజు సందర్భంగా ‘ఎఫ్ 3’ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల!!

వరుణ్ తేజ్ పుట్టిన‌రోజు సందర్భంగా ‘ఎఫ్ 3’ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల!!

వరుణ్ తేజ్ పుట్టిన‌రోజు సందర్భంగా ‘ఎఫ్ 3’ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ !!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి సమ్మర్ సోగ్గాళ్లుగా వేసవికి మూడు రెట్ల వినోదాన్ని ఇచ్చేందుకు ఎఫ్ 3 సినిమాతో రాబోతోన్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ నిర్మిస్తున్నారు.

వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఎఫ్ 3 టీం నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వరుణ్ సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమా అంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతుందని ఇది వరకే తెలిపింది చిత్రయూనిట్. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లోనూ వరుణ్ తేజ్ చేతిలో కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి.

వేసవి సందర్భంగా ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఇది వరకు ఏప్రిల్ 29న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ దాని కంటే ఒక రోజు ముందే అంటే ఏప్రిల్ 28న సినిమాను రిలీజ్ చేయబోతోన్నారు.

2019 సంక్రాంతి విన్నర్‌గా ఎఫ్ 2 నిలిచింది. ఇక ఎఫ్ 3 అయితే సమ్మర్‌లో వినోద విందు చేసేందుకు రాబోతోంది. సినిమా మీద అంచనాలు, పాజిటివ్ బజ్‌కు తగ్గట్టే అంచనాలను మించి ఉండబోతోంది.

నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ వంటి వారితో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మూడో హీరోయిన్‌గా ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ కనిపించబోతోన్నారు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను  రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా,  తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు

సాంకేతిక బృందం

డైరెక్టర్: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: శిరీష్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి
సంగీత : దేవీ శ్రీ ప్రసాద్
కెమెరామెన్: సాయి శ్రీరామ్
ఆర్ట్: ఏఎస్ ప్రకాష్
ఎడిటింగ్: తమ్మిరాజు
స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: ఎస్ కృష్ణ
అడిషనల్ స్క్రీన్ ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్

 
Team F3 Wishes Varun Tej On His Birthday With A Brand New Poster !!

Victory Venkatesh and Mega Prince Varun Tej are coming together as Summer Soggallu to offer triple the fun in blockbuster maker Anil Ravipudi’s most awaited fun-filled entertainer F3 produced on grand scale by Tollywood’s leading production house Sri Venkateswara Creations. While Dil Raju presents, Shirish is producing the movie.

Team F3 wishes Varun Tej on his birthday with a brand-new poster. Varun Tej threw a delightful dance pose. Captured at the perfect instant, Varun Tej looks quite contented here. As the story revolves around cash, we can observe currency notes in the poster. Varun Tej too holds a 2000 note on his hand.

F3 will be hitting the screens during summer season on April 28th. They advanced the release date by a day, as they earlier announced to release the movie on April 29th.

F2 became a Sankranthi winner in 2019 and F3 is set to create laughing riot in theatres for the summer in 2022. The makers hope to deliver much bigger hit, as the film is carrying extreme positive buzz in film and trade circles and there is huge anticipation from commoners as well.

The presence of Nata Kireeti Rajendra Prasad, Sunil and others promise additional entertainment. Tamannaah Bhatia and Mehreen Pirzada play fun and glamorous roles in the movie and Sonal Chauhan is the latest addition. Sonal is roped in as third female lead, and she adds more glamor to the film.

Rockstar Devi Sri Prasad who provided chartbuster album for F2 is readying a superhit album for F3. Sai Sriram cranks the camera, while Tammiraju is the editor. Harshith Reddy is the co-producer.

Cast: Venkatesh, Varun Tej, Tamannaah Bhatia, Mehreen Pirzada, Rajendra Prasad, Sunil, Sonal Chauhan etc.

Technical Crew:
Director: Anil Ravipudi
Presenter: Dil Raju
Producer: Shirish
Banner: Sri Venkateswara Creations
Co-Producer: Harshith Reddy
Music: Devi Sri Prasad
DOP: Sai Sriram
Art: AS Prakash
Editing: Tammiraju
Script Coordinator: S Krishna
Additional Screenplay: Adi Narayana, Nara Praveen