Rayalaseema love story movie review 3/5

Rayalaseema love story movie review 3/5

 

 

       

`రాయలసీమ లవ్ స్టోరీ ` రివ్యూ

నటీ నటులు :
వెంకట్ ( హీరో )
హృశాలి ( హీరోయిన్ )
పావని ( హీరోయిన్ )
నాగినీడు
జీవా
పృథ్వీ
రఘు
మిర్చి మాధవి
జబర్దస్త్ రాజమౌళి
గెటప్ శ్రీను
జబర్దస్త్ చంద్ర
తాగుబోతు రమేష్
భద్రం
తదితరులు
సాంకేతిక వర్గం :
బ్యానర్ A 1 ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్
సాంకేతిక నిపుణులు:
సంగీతం : శ్రీ సాయి యేలేందర్
ఛాయాగ్రహణం : రామ్ మహేందర్
ఎడిటర్ : వినోద్ అద్వైత్
ఆర్ట్ డైరెక్టర్ : రమేష్
ప్రొడక్షన్ డిజైనర్ : ఎస్ . వలి
నిర్మాతలు : రాయల్ చిన్నా – నాగరాజు
కథ , స్క్రీన్ ప్లే , మాటలు , దర్శకత్వం : రామ్ రణధీర్

రేటింగ్ : 3/5
పంచలింగాల బ్రదర్స్ నిర్మించిన చిత్రం `రాయలసీమ లవ్ స్టొరీ`. ఈ చిత్రం ద్వారా రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం అయ్యారు. రిలీజ్ కు ముందే ఈ సినిమా టైటిల్ పట్ల పలు కాంట్రవర్సీ లకు గురైంది . అయినప్పటికీ అన్ని వివాదాలను దాటుకుని ఈ ఫ్రైడే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుకునే ప్రయత్నం చేద్దాం.

స్టోరీ విషయానికి వస్తే…
ఎస్ ఐ ట్రైనింగ్ కోసం `రాయలసీమ` కు చెందిన చెందిన కృష్ణ ( హీరో వెంకట్ ) హైదరాబాద్ వస్తాడు. తన మిత్రుడు శృంగారం ( నల్ల వేణు) తో కలిసి ఒక ఇంట్లో రెంట్ కి దిగుతాడు. అయితే ఇంటి రెంట్ కట్టకపోవడంతో ఓనర్ వాళ్ళను ఇల్లు ఖాళీ చేయిస్తాడు. అదే సమయంలో డాక్టర్ పల్లవి ఇంట్లో కృష్ణ , శృంగారం ఇద్దరకు షెల్టర్ ఇస్తుంది. పల్లవి ఇంటి ఎదురుగా ఉండే రాధ ( హృశాలి) ని చూసి లవ్ లో పడతాడు కృష్ణ. రాధ కూడా కృష్ణ ని ప్రేమిస్తుంది. అయితే విచిత్రంగా రాధ కి మరొకరితో నిచ్చితార్ధం జరుగుతుంది. దాంతో పద్మ లాగే రాధ కూడా నన్ను మోసం చేసిందని కుమిలిపోతుంటాడు కృష్ణ. అసలు పద్మ ఎవరు ? కృష్ణ ప్రేమించింది ఎవరిని ? చివరిగా వీరిద్దరూ కలిసారా లేదా అన్నది సినిమా స్టోరీ .

ప్లస్ పాయింట్స్ :
హీరో పెరఫార్మెన్స్
హృశాలి అందం -అభినయం
మ్యూజిక్
డైరెక్షన్
డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్

ఆర్టిస్ట్స్ పెరఫార్మెన్స్ :
వెంకట్ కు హీరో గా ఇది ఫస్ట్ ఫిలిం అయినా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలా నటించాడు . ముఖ్యంగా ఎమోషనల్ , రొమాంటిక్ సీన్స్ అద్భుతంగా చేసాడు. ఈ సినిమాతో తనకు మంచి ఆఫర్స్ రావడం ఖాయం. అలాగే పావని , హృశాలి గ్లామర్ పరంగా యూత్ ని రెచ్చగొట్టేలా చేసారు. లిప్ లాక్ లతో వెంకట్ , హృశాలి యూత్ ని ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వి , మిర్చి మాధవి , నల్లవేణు , జబర్దస్త్ బ్యాచ్ కొమరం , గెటప్ శ్రీను , రాజమౌళి , నాగినీడు ఎప్పటిలాగే తమ పాత్రలతో మెప్పించారు.

విశ్లేషణ :
డైరెక్టర్ టాలెంట్ ఏంటో ఫస్ట్ సినిమాతో నే ప్రూవ్ చేసుకున్నారు. యూత్ ని టార్గెట్ చేసి తీసిన ఈ సినిమా వారిని ఆకట్టుకోవడం లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక పంచలింగాల బ్రదర్స్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. యూత్ కి అండర్ కరెంటు గా మెసేజ్ ఇస్తూనే వాళ్లకు కావాల్సిన మసాలా అక్కడక్కడా దట్టించాడు. డైలాగ్స్ కూడా యూత్ ఫుల్ గా ఉన్నాయి. ఇక ఇందులో ఉన్న నాలుగు సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి . తీయడం కూడా కనువిందు కలిగించేలా తీశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాల బాగా కుదిరింది .

ఫైనల్ గా చెప్పాలంటే :
`రాయలసీమ లవ్ స్టోరీ ` టైటిల్ చూడగానే సినిమా ఏంటో తెలిసి పోతుంది. ఇటీవల కాలం లో వస్తోన్న సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంట్టుంది . అక్కడక్కడా బోల్డ్ గా ఉన్నా కూడా స్టోరీ కి తగ్గట్టుగా ఆ మాత్రం ఉంటేనే డైరెక్టర్ చెప్పాలనుకున్న అంశం ప్రజల్లోకి వెళుతుంది. మంచి మ్యూజిక్. సినిమాటోగ్రఫీ, ఆర్టిస్ట్స్ పెరఫార్మెన్సెస్ , డైరెక్షన్ ఇవ్వని రెండున్నర గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. సో డోంట్ మిస్ రాయలసీమ లవ్ స్టోరీ.