న్యూ ఇయ‌ర్‌… న్యూ ప్రాజెక్ట్‌

న్యూ ఇయ‌ర్‌… న్యూ ప్రాజెక్ట్‌

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌క‌… అక్కినేని వారి కోడలు… న‌టి స‌మంత కొత్త సంవ‌త్స‌రంలో… కొత్త పాత్ర‌లో న‌టించ‌నుంది. హీరో శ‌ర్వానంద్ స‌ర‌స‌న జాను సినిమాలో న‌టించిన త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లో స‌మంత క‌నిపించ‌లేదు. కానీ సోష‌ల్ మీడియాలో ప్రేక్ష‌కుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ల‌క‌రిస్తూనే ఉంది. అంతే కాకుండా ఆహా ఓటీటీలో సామ్‌జామ్ అనే ప్రోగ్రాంలో వ్యాఖ్యాత‌గా కొన‌సాగుతోంది.
గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న కొత్త చిత్రం శాకుంత‌లంలో స‌మంత లీడ్‌రోల్ పోషిస్తున్న‌ట్లు సినిమా బృందం ప్ర‌క‌టించింది. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఈ చిత్రం మోష‌న్ పిక్చ‌ర్‌ను మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో స‌మంత పాత్ర‌పేరును అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. గుణ టీమ్‌వ‌ర్క్స్ పతాకంపై నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర‌నికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. శాకుంత‌లం చిత్రం పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌ర‌న్నీ విష‌యాల‌ను చిత్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.