కొంచెం అల‌స‌ట‌గా ఉంద‌ని టెస్ట్ చేయించా : ర‌కుల్‌

కొంచెం అల‌స‌ట‌గా ఉంద‌ని టెస్ట్ చేయించా : ర‌కుల్‌

ర‌కూల్ ప్రీత్ సింగ్ కు ఇటీవ‌లే క‌రోనా పాజిటివ్ వ‌చ్చ‌ని సంగ‌తి తెలిసిందే. సినిమా షూటింగ్ ల్లో బిజీగా ఉండ‌టం వ‌ల్ల కొంత అల‌స‌టగా ఉంద‌ని ముందుగా భావించాను. కానీ ఎందుకైనా మంచిద‌ని క‌రోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధార‌న అయ్యింది. దీంతో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయాను. క్వారంటైన స‌మ‌యంలో హెల్తీఫుడ్ తీసున్నాను. మెడిసిన్ ఎక్కువ‌గా తీసుకోలేదు. అరోగ్యంగానే ఉన్నాను. అంతా మంచే జ‌రుగుతుంద‌ని భావించాను. ఇలా ఉండ‌టం వ‌ల్లే తొంద‌ర‌గా కోలుకోగ‌లిగాను అని ర‌కూల్ మీడియాతో పంచుకున్నారు. ఇటీవ‌లే ర‌కుల్ క‌రోనా టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వ‌చ్చింది.