Actress Vithika Sheru and Rapper Noel Sean Naturals Family Salon Grand Launch at Santoshnagar

Actress Vithika Sheru and  Rapper Noel Sean Naturals Family Salon Grand Launch at Santoshnagar

Actor & Rapper Noel Sean & Actress Vithika Sheru Naturals Family Salon Grand Launch at Santoshnagar

Hyderabad : Naturals Family Salon & Spa a pan-india brand in hair & Skin care service industry , has launched its Andhra Pradesh and Telangana state 727th franchise family salon at Santosh Nagar, Hyd.

The Salon was Inaugurated by Actor & Rapper Noel Sean & Actress Vithika Sheru Beauty salons and spas play an important role in lending that glamorous touch to every one life style said Actress Vithika Sheru .

 

అందాల నటి వితికా షేరు మరియు నోయల్ సేన సంతోష్ నగర్ న్యాచురల్ ఫ్యామిలీ సెలూన్ ని ప్రారంభించారు.

 

హైదరాబాద్, సంతోష్ నగర్ వద్ద న్యాచురల్స్ ఫ్యామిలీ సెలూన్‌ తమ నూతన బ్రాంచ్‌‌ను ఆదివారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి నటీనటులైన వితికా షేరు, నోయల్‌తో పాటు పలువురు మోడల్స్ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో నటి వితికా షేరు మాట్లాడుతూ.. బ్యూటీ రంగానికి ఇప్పుడు చాలా ప్రాధాన్యత పెరిగిందని.. ప్రతి ఒక్కరూ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. న్యాచురల్స్ ఫ్యామిలీ సెలూన్‌తో తనకీ అనుబంధం ఉందని.. చాలా ఫంక్షన్స్‌కి ఇందులోనే రెడీ అయి వెళతానని తెలిపారు. న్యాచురల్స్ వారి సర్వీస్ చాలా బాగుంటుందని కూడా ఆమె పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో న్యాచురల్స్ ఫౌండర్ వీణ, కో ఫౌండర్ సి కె కుమారవేల్ మరియు సిఓఓ ఆపరేషన్ హెడ్ అరవింద్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా న్యాచురల్స్ ఫ్యామిలీ సలోన్ & స్పా నిర్వాహకులు ఫణి చౌదరి మాట్లాడుతూ.. మేము న్యాచురల్ ఫ్యామిలీ సెలూన్‌ని కేవలం ప్రజలు కనిపించే విధానంలో మార్పు తీసుకురావటానికి మాత్రమే కాదు.. జీవితం పట్ల వారి దృక్పథంలో కూడా మేం మార్పులు తీసుకురానున్నామని తెలిపారు. ఇందులో ప్రత్యేకమైన గ్రూమింగ్ సేవలని సెలెబ్రిటిలు మరియు స్టార్లకి సర్వం సిద్ధం చేయటంతో పాటుగా చిక్ మరియు ట్రెండ్ హెయిర్ కేర్, స్కిన్, బాడీ కేర్ సేవలని విస్తరించడం జరిగిందని పేర్కొన్నారు.