`దృశ్యం2` సినిమా తెలుగులో నాకు మంచి గుర్తింపుతెస్తుంది – న‌టి సూజ వ‌రుణీ

`దృశ్యం2` సినిమా తెలుగులో నాకు మంచి గుర్తింపుతెస్తుంది –  న‌టి సూజ వ‌రుణీ

`దృశ్యం2` సినిమా తెలుగులో నాకు మంచి గుర్తింపుతెస్తుంది –  న‌టి సూజ వ‌రుణీ

న‌టి సూజ వ‌రుణీ పాపులర్ రియాలిటీ షో త‌మిళ బిగ్‌బాస్‌తో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. ఈ షోతో పాటు శ‌శికుమార్ కిడారి, ఇరవుక్కు ఆయిరమ్ కంగల్, అరుణ్ విజయ్ కుత్రమ్23 లాంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన చిత్రాల్లో ఆమె న‌ట‌న‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం మలయాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం దృశ్యంని విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తోన్న విష‌యం తెలిసిందే..జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ప్ర‌తిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది సూజ వ‌రుణీ.

న‌టి సూజ వ‌రుణీ మాట్లాడుతూ – “నేను దృశ్యం మొదటి భాగాన్ని అన్ని భాషలలో చూశాను. అలాగే  రెండవ భాగం మలయాళంలో చూసి దర్శకుడు జీతు జోసెఫ్ అంత అద్భుత‌మైన స్క్రిప్ట్‌ను ఎలా రాశాడా అని ఆశ్చర్యపోయాను. అలాంటి సినిమాలో నేను ఎందుకు భాగం కాలేక‌పోయాను అని బాధ‌ ప‌డ్డాను. కాని దృశ్యం 2 తెలుగు రీమేక్‌లో పాత్ర కోసం నన్ను ఎంచుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అది కూడా ప్ర‌ఖ్యాత సురేష్‌ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌ న‌న్నుసంప్ర‌దించిన‌ప్పుడు నా క‌ల నెర‌వేరినట్లు అనిపించింది. వెంకటేష్ సర్, మీనా మామ్, నదియా మామ్ మరియు తెలుగు పరిశ్రమలోని అనేక మంది సీనియర్ ఆర్టిస్టుల‌తో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం చాలా ఆనందంగా ఉంది. నేను వారి నుండి చాలా నేర్చుకుంటాను. అలాగే, జీతు జోసెఫ్ సార్‌తో కలిసి పనిచేయడం ఒక గిఫ్ట్‌ . చాలా కూల్‌గా ఉంటూ నటీనటుల మంచి ప్ర‌ద‌ర్శ‌న రాబ‌ట్టుకుంటారు. ఈ సినిమా నాకు ప్ర‌తిరోజు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. స‌రైన స‌మ‌యంలో ఈ అవ‌కాశం వ‌చ్చినందుకు హ్యాపీగా ఉంది“ అన్నారు.

`Drishyam2` gives me a good recognition in Telugu

 
Actress Suja Varunee became the talk of the town after her stint with the popular reality show, Bigg Boss. She was also a part of many critically-acclaimed films including Sasikumar’s Kidaari, Iravukku Aayiram Kangal and Arun Vijay’s Kuttram 23 in which she garnered good response for her performance. Now, it looks like, the actress is on cloud nine as she has bagged the most-prestigious Drushyam 2, the Telugu remake of blockbuster Malayalam film, Drishyam 2.

An excited Suja Varunee says, “I have watched the first part of Drishyam in all languages and also the second part in Malayalam on OTT.. I was amazed at how the director was able to conceive such a script and was wondering why I didn’t get such scripts to perform. It was a dream come true for me when I was approached to be part of the Telugu remake of the movie and that too for a reputed production house.”

She adds, “I am extremely happy to be sharing screen space with the Venkatesh sir, Meena maam, Nadhiya maam and many other senior artistes in Telugu industry as I will get to learn a lot from them. Also, working with Jeethu Joseph sir is a gift of sorts. He is very cool as a director and at the same time knows what to get from his actors. To me, everyday is a learning and Drishyam 2 came at the right time.”

Directed by Jeethu Joseph, the Telugu version of Drishyam 2 was launched in Hyderabad on March 1. The first part of the Telugu remake, featuring Venkatesh Daggubati, Meena and Nadhiya, released in 2014. The film was directed by Sripriya and it did well at the box office. 

Suja’s presence in Drishyam 2 remake will be one of the highlights.

Mohanlal’s Drishyam 2 released on Amazon Prime Video on February 19 and it has been garnering great response from both audience as well as critics.