మ‌ర‌ణం మూవీ రివ్యూ!!

మ‌ర‌ణం మూవీ రివ్యూ!!

 

 

 

మ‌ర‌ణం మూవీ రివ్యూ!!

దర్శకత్వం : సాగ‌ర్ శైలేష్
నిర్మాత: బి రేణుక
కెమెరా : కెవి వరం
ఎడిటర్ & VFX: నరేన్
సంగీతం: మనోజ్ కుమార్
SFX: షఫీ fx
తారాగణం: శ్రీ రాపాక,  సాగ‌ర్ శైలేష్,  హృతికా సింగ్, ప్రార్థన, మాధురి చిగురు, మమత భాస్కర్, సందీప్ కడిమె, హరీష్ తదితరులు.
విడుదల : 6 – 8 – 2021
రేటింగ్ : 3.25/ 5

సాగ‌ర్ శైలేష్ ,శ్రీ రాపాక, మాధురి ప్రధాన పాత్రల్లో వీర్‌ సాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మరణం’. ‘కర్మ పేస్‌’ అనేది ఉపశీర్షిక. బి. రేణుక సమర్పణలో ఓషియన్‌ ఫిలిం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్‌ కథతో తెరకెక్కింది.ఆత్మలను బంధిస్తే… కథాంశంతో హారర్‌ చిత్రాలకి బిన్నంగా సరికొత్త కథ, కథనంతో, అద్భుతమైన విజువల్స్‌తో, గొప్ప సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిన చిత్రం ‘మరణం’. మరి ఇందులో మరణం ఎవరికీ, వల్ల ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే !

స్టోరి విష‌యానికొస్తేః

ఈ కథలో హీరో ( సాగ‌ర్ శైలేష్  ) డెమనాలజిస్ట్‌ (ఆత్మలను బంధించే శాస్త్రవేత్త)గా కనిపిస్తాడు. ఓ ఇంట్లో ఆత్మ ఉందని తెలుసుకున్న హీరో దాన్ని బంధించే ప్రయత్నం చేస్తుంటాడు. ఆర్‌జివి నేకెడ్ ఫేమ్ శ్రీ రాపాక ప్రధాన పాత్ర ( హీరోయిన్ ) కు దెయ్యం పడుతుంది … దాన్ని వదలగొట్టి బందించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు సాగర్ ఆ క్రమంలో అక్కడ ఎదురైనా సమస్యలు ఏమిటి ? అసలు నిజంగా ఆత్మలను బంధించే శక్తి అతనికి ఉందా ? లాంటి ఎన్నో సందేహాలకు సమాధానం కావాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే .

నటీనటుల హావ‌భావాలుః

ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ శ్రీ రాపాక. సంచలన దర్శకుడు ఆర్‌జివి నేకెడ్ సినిమాతో దుమారం రేపిన శ్రీ రాపాక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆమె గ్లామర్ తో పాటు నటనతో ఆకట్టుకుంది. ముక్యంగా అందాలు అరబోయడంతో శ్రీ రాపాకకు సాటి ఎవరు రారు. ఆమె అందాలు కుర్రకారుకు మతిపోయేలా ఉన్నాయి. ఇక దెయ్యం పట్టిన అమ్మాయిగా అద్భుతంగా నటించింది. అన్ని రకాల ఎమోషన్స్ ని బాగా పండించింది. హీరో వీర్‌ సాగర్‌ డెమనాలజిస్ట్‌ (ఆత్మలను బంధించే శాస్త్రవేత్త)గా ఆకట్టుకునే పాత్రలో నటించి సూపర్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా ఆత్మలను బంధించే విషయంలో అయన నటన బాగుంది. అలాగే హృతికా సింగ్, ప్రార్థన హుపారికర్, మాధురి చిగురు, మమత భాస్కర్, సందీప్ కడిమె, హరీష్ KHM, సతీష్ సరిపల్లి మరియు ఇతరులు వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః

ఈ సినిమా విషయంలో ముందుగా చెప్పుకోవలసింది కెమెరా మెన్ కెవి వరం గురించి. ఇలాంటి సినిమాలకు కెమెరా పనితనం ముఖ్యం . ఈ విషయంలో కెవి వరం చక్కటి ప్రతిభ కనబరిచాడు. ముక్యంగా చాలా సన్నివేశాల్లో కథతో పాటు కెమెరా ట్రావెల్ అయ్యింది. దాంతో పాటు ఎడిటింగ్ అందించిన నరేన్ వర్క్ బాగుంది .. కాకపోతే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగా బోర్ కొట్టిస్తాయి, అలాంటి విషయాలపై కాస్త ఫోకస్ పెట్టి కత్తెరకు పనిచెబితే బాగుండేది. ఈ సినిమాకు సంగీతం కూడా మరో ప్రధాన హైలెట్ అని చెప్పాలి. హర్రర్ సినిమా కాబట్టి మ్యూజిక్ , ముక్యంగా ఆర్ ఆర్ కు ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఈ విషయంలో మనోజ్ కుమార్ అందించిన ఆర్ ఆర్ సినిమాకు ప్రధాన హైలెట్ గా నిలిచింది. ఇక దర్శకుడు సాగ‌ర్ శైలేష్  గురించి చెప్పాలంటే .. సరికొత్త కథ, కథనంతో, అద్భుతమైన విజువల్స్‌తో, గొప్ప సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో ఒక హారర్‌ చిత్రం వస్తే ఎలా ఉంటుందంటే అది కచ్చితంగా ఈ సినిమా అని చెప్పుకోవచ్చు. దర్శకుడిగా కొన్ని విషయాలపై ఇంకాస్త ఫోకస్ పెట్టాల్సింది. హీరోగా తన పాత్రకు సరైన న్యాయం చేసాడు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. బి రేణుక కథకు కావలసిన విధంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.

ఫైన‌ల్ గా చెప్పాలంటేః

సరికొత్త కథ, కథనంతో, అద్భుతమైన విజువల్స్‌తో, గొప్ప సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో మంచి సినిమా వస్తే తప్పకుండా ఆదరిస్తున్నారు. ఆ కోవలో ఈ ‘మరణం’ సినిమా కూడా ఉంటుంది అని చెప్పాలి. థ్రిల్లర్ సినిమాలు చూసే వీక్షకులను నిమగ్నం చేయడానికి ఈ కథనం ఆసక్తికరంగా సాగింది. మెలోడ్రామాటిక్‌గా ఉన్నప్పటికీ కథలో కొన్ని మలుపులు ప్రేక్షకులకు షాక్ ఇస్తాయి . అయితే పెద్దగా ఆసక్తి చూపని డైలాగ్స్, అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు తప్పితే సినిమా అంతా చాలా టెన్షన్ పెట్టెల సాగుతుంది. రెండు గంట‌లు థ్రిల్ ఫీల‌వ్వాలంటే మ‌ర‌ణం హ్యాపీగా చూడొచ్చు. సో డోంట్ మిస్ దిస్ వీక్ మ‌ర‌ణం.