`శ‌త‌ఘ్ని` మూవీ రివ్యూ!!

`శ‌త‌ఘ్ని` మూవీ రివ్యూ!!

 

`శ‌త‌ఘ్ని` మూవీ రివ్యూ!!

బ్యానర్: వాట్ నెక్స్ట్ పిక్చర్స్
నిర్మాత: అభిరాం రెడ్డి దాసరి
దర్శకుడు: ఎల్.వి.శివ
సంగీతం: హర్ష ప్రవీణ్
ఛాయాగ్రహణం: ఎం.డి. రఫీ
ఎడిటర్: క్రాంతి
డి.ఐ & కలరింగ్: కళ్యాణ్
వి.ఎఫ్.ఎక్స్: డి. లోకేష్ చౌదరి
నటీనటులు : దాసరి అభిరామ్ రెడ్డి, స్వాతి మండల్, సుబ్బారావు & కిషోర్, వైజాగ్ ధనరాజ్, కళ్యాణ్ కృష్ణ, సన్నీ, తదితరులు..
విడుదల : 19-11-2021
రేటింగ్ : 3.25/5

2010లో ఆంధ్రా తీర ప్రాంతంలో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రూపొందిన చిత్రం `శ‌త‌ఘ్ని`. టీజ‌ర్, ట్రైల‌ర్ తో ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకున్న ఈ చిత్రం ఈ నెల 19న విడుదలైంది. మ‌రి ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆకట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

స్టోరిలోకి వెళితే…
హీరో శివ (అభిరామ్ రెడ్డి దాసరి) టాక్సీ డ్రైవర్. బార్ లో త‌ప్ప తాగి వాళ్ల‌ను ఇంటిలో దించే వ‌ర్క్ చేస్తుంటాడు. అతనికి బుజ్జమ్మ తో డీప్ లవ్ ఉంటుంది. బజ్జమ్మ ( స్వాతి మండల్) హీరో శివ అంటే ప్రాణంగా ప్రేమిస్తుంది. బుజ్జమ్మా అంటే కూడా శివకు ప్రాణం. తనను ఎవరేమి అన్నా సహించడు. వీరి జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ డబ్బులు గుంజే గ్యాంగ్ దాని వెనక పెద్ద మాఫియా ఉంటుంది. ఈ గ్యాంగ్ చేతిలో బజ్జమ్మా పడుతుంది. బూజ్జమ్మ హిట్ ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో బుజ్జమా జీవితం అందకారంలోకి వెళ్ళిపోతుంది. ఆ తరువాత బుజ్జమ్మ కనిపించకుండా పోతుంది. బుజ్జమ్మ్మ కనిపించక పోవడంతో శివ ఆమెను వెదుకుతుంటే అసలు విషయం తెలియడంతో ఆ గ్యాంగ్ నీ అంతం చేయాలన్న పంతంతో బయలుదేరతాడు. మరి బజ్జమ్మ్మ ఎక్కడికి వెళ్లింది ? అసలు బుజ్జమ్మ్మా ను ఎవరు కిడ్నాప్ చేశారు? అన్నది మిగతా కథ.

ఆర్టిస్ట్స్ హావ‌భావాలుః
హీరో శివ పాత్రలో అభిరామ్ నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో బాగా చేశాడు. అలాగే డాన్సులు, ఫైట్స్ లో కూడా అదరగొట్టాడు. ఇక హీరోయిన్ స్వాతి మండల్‌ మంచి నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె గ్లామర్, నటన ప్రధాన హైలెట్ గా నిలిచాయి. ఇక మిగతా పాత్రల్లో.. కేరాఫ్‌ కంచరలపాలేం ఫేమ్‌ సుబ్బరావు, కిషోర్‌, వైజాగ్ ధనరాజ్, కళ్యాణ్ కృష్ణ, సన్నీ, కరుణ్ కాంత్, కోలా మహేష్ తదితరులు వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా
హైదరాబాదీ మూవీస్ ఫేమ్ గుల్లు దాదా ఇందులో చాలా కీలకమైన పాత్రలో కనిపించాడు. బజ్జమ్మ్మా ‘ఆ పేరంటే నాకు ఇష్టం, ఆ పిల్లంటే నాకు ప్రాణం’అనే డైలాగ్‌ ఆకట్టుకుంది.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన ఎం.డి. రఫీ కెమెరా పనితనం బాగుంది. చాలా సన్నివేశాలు అందంగా చూపించాడు. ఆ తరువాత ఈ సినిమాకు మరో హైలెట్ మ్యూజిక్. హర్ష ప్రవీణ్ అందించిన పాటలు బాగున్నాయి. ఆర్ ఆర్ కూడా పరవాలేదు. ఇక క్రాంతి అందించిన ఎడిటింగ్ విషయంలో ఇంకొన్ని సన్నివేశాల విషయంలో కత్తెరకు పని చెప్పల్సి ఉంది. కొన్ని సీన్స్ బోరింగ్ గా అనిపిస్తాయి, వాటిని ట్రిమ్ చేస్తే బాగుండేది. ఇక దర్శకుడు శివ ఓ రీయలిస్టిక్ అంశాన్ని బెస్ చేసుకుని తీసిన సినిమా ఇది. చాలా సన్నివేశాలను రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా కథను నడిపే విధానం బాగుంది. దర్శకుడు ఎంచుకున్న కథను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశాడు.నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ లో కి వెళితే…

యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘ఫ్రాడ్ స్టోరీ బై బ్యాడ్ పీపుల్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన ఈ టెక్నాలజీ వాడుకొని మోసాలకు పాల్పడుతున్న కొందరు యువకుల కథను ఆసక్తికరంగా మలిచాడు దర్శకుడు. లవ్, ఎమోషన్ లతో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో అభిరామ్ నటన, స్వాతి మందల్ నటన, గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఇక మ్యూజిక్, ఫోటోగ్రఫి ఆకట్టుకుంది. అయితే ఎడిటింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. దర్శకుడు ఎంచుకున్న కథ, దాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చక్కగా చేశాడు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రాలు న‌చ్చే వారికి ఈ సినిమా చాలా న‌చ్చుతుంది.