దివంగ‌త‌ గాన గంధ‌ర్వుడు బాలు గారితో క‌లిసి ఓ భ‌క్తి పాట పాడ‌టం నా అదృష్టం- సింగ‌ర్ స్వాతి రెడ్డి (యు.కె)

దివంగ‌త‌ గాన గంధ‌ర్వుడు బాలు గారితో క‌లిసి ఓ భ‌క్తి పాట పాడ‌టం నా అదృష్టం- సింగ‌ర్ స్వాతి రెడ్డి (యు.కె)

                       

 

 

                        దివంగ‌త‌ గాన గంధ‌ర్వుడు బాలు గారితో క‌లిసి ఓ భ‌క్తి పాట పాడ‌టం నా అదృష్టం-
                        వారు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం మ‌న దుర‌దృష్టం – సింగ‌ర్ స్వాతి రెడ్డి (యు.కె)

శ్రీ త్రిదండి చిన జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మం పై సింగ‌ర్ స్వాతి రెడ్డి (యు.కె) ఓ వీడియో ఆల్బ‌మ్ ని రూపొందించారు. మూడు పాట‌ల‌తో రూపొందిన ఈ ఆల్బ‌మ్ లో ఎస్‌.పి.బాలు , సింగ‌ర్ స్వాతి రెడ్డి  `ఈ భాగ్య న‌గ‌రి లో భ‌ద్ర‌గిరి` అనే ఓ పాట‌ను సంయుక్తంగా ఆల‌పించారు. ఈ వీడియో ఆల్బ‌మ్ ఇటీవ‌ల శ్రీ త్రిదండి స్వామి వారు స్వ‌యంగా వారి చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌డం విశేషం. అది మాత్ర‌మే కాకుండా ఈ పాట‌లు నిత్యం హైద‌రాబాద్ లోని శంషాబాద్ స‌మీపంలోని చిన‌జీయ‌ర్ స్వామివారి ఆశ్ర‌మంలో  ప్లే చేస్తుండ‌టం మ‌రో విశేషం. ఇప్ప‌టికే స్వాతిరెడ్డి యుకే యూట్యూబ్ ఛాన‌లో లో విడుద‌లైన ఈ పాట శ్రోత‌ల‌ను అలరిస్తోంది. అన్న‌మ‌య్య చిత్రంలోని పాట‌ల్లా ఎంతో మ‌ధురంగా ఉందంటూ విన్న ప్ర‌తి ఒక్క‌రూ అభినందిస్తున్నారు. ముఖ్యంగా బాలు గారు ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా ఆఖ‌రి భ‌క్తి పాట‌ను అద్భుతంగా పాడారు….అంత గొప్ప సింగ‌ర్ తో క‌లిసి స్వాతి రెడ్డి  కూడా ఎంతో హృద్యంగా పాడారు అన‌డంతో అతిశ‌యోక్తి లేదు. ఇటీవ‌ల భీమ్స్ సిసిరోలియో రాసి స్వ‌ర‌ప‌రిచిన `ఎళ్లిపోతావురా మ‌నిషి ` పాట‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి రెడ్డి మ‌రో మంచి ప్ర‌త‌య్నం చేసిందంటూ విన్న ప్ర‌తి ఒక్క‌రూ మెచ్చుకుంటున్నారు.
సింగ‌ర్ స్వాతి రెడ్డి మాట్లాడుతూ…“బాలు గారితో గొంతు క‌ల‌ప‌డం నా పూర్వ జ‌న్మ సుకృతం. వారు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం బాధాకరం. ఈ పాట నాకు ఎప్ప‌టికీ గుర్తుండిపోయే మ‌ధురానుభూతి “ అన్నారు.

ఈ పాట‌ల విష‌యంలో త‌మ పూర్తి స‌హ‌కారాన్ని అందించిన `JETUK.ORG `వారికి ధ‌న్య‌వాదాలు.

నిర్మాత‌లుః న‌రేంద్ర రెడ్డి, నాగోల్ బాల్ రెడ్డి
సాహిత్యంః కేదార్ నాథ్.పి
సంగీతంః ప‌వ‌న్
ఎడిట‌ర్ః రామ‌కృష్ణ ఎమ్‌