అక్టోబర్ 8న ‘జీ 5’లో ‘రాజ రాజ చోర’ విడుదల !!

అక్టోబర్ 8న  ‘జీ 5’లో ‘రాజ రాజ చోర’ విడుదల !!

అక్టోబర్ 8న  ‘జీ 5’లో ‘రాజ రాజ చోర’ విడుదల
‘జీ 5’ ఓటీటీ ఉండగా వినోదానికి లోటు ఉండదనేది వీక్షకులు చెప్పేమాట! తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ… పలు భారతీయ భాషల్లో, వివిధ జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్‌–టు–డిజిటల్‌ రిలీజ్‌ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తూ 24/7 వినోదాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ‘అలాంటి సిత్రాలు’ను డైరెక్ట్ డిజిటల్ చేసిన ‘జీ 5’ ఓటీటీ వేదిక… విజయదశమి కానుకగా వినోదాల విందు అందివ్వడానికి సిద్ధమైంది.

ప్రామిసింగ్ స్టార్ శ్రీ విష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. కరోనా సెకండ్ వేవ్ తర్వాత… ఆగస్టు 19న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులను నవ్వించడంతో పాటు మంచి సందేశం ఇచ్చింది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని ‘జీ 5’ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నారు.

హసిత్ గోలి దర్శకుడిగా పరిచయమైన ‘రాజ రాజ చోర’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించింది. దొంగ గా శ్రీ విష్ణు… అతని భార్యగా సునైన, ప్రేయసిగా మేఘా ఆకాష్, ఇతర పాత్రల్లో రవి బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్, గంగవ్వ, తనికెళ్ల భరణి తదితరుల నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. వివేక్ సాగర్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దసరాకు ఓటీటీలో ఇంటిల్లిపాది కలిసి చూస్తూ నవ్వుకునే సినిమా ‘రాజ రాజ చోర’ అవుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

విజయదశమి తర్వాత… ఈ నెల 22న ‘హెడ్స్ అండ్ టేల్స్’ సినిమాను ‘జీ 5’ విడుదల చేయనుంది.

 

ZEE5 to stream ‘Raja Raja Chora’ on 8th October  

‘Sree Vishnu-starrer is an acclaimed box-office hit set to entertain ZEE5 viewers*

Hyderabad, 7th October 2021: It’s the unanimous opinion of viewers that there is no dearth of entertainment when ZEE5 is around. The streaming platform has entertained the audience across languages with a wide range of offers, be it web series, originals, or direct-to-digital releases. After bringing out movies like ‘Alanti Sitralu’ very recently, ZEE5 is all set to release the fun drama ‘Raja Raja Chora’ as a post-theatrical digital release.

ZEE5 is all set to stream the super hit movie on 8th October. The streaming platform will bring the crime comedy to its patrons on the eve of the festival.

When it was released in theatres, the film garnered encouraging box-office collections and overwhelming critical acclaim. As a robber named Bhaskar, Sree Vishnu’s performance was praised by everyone. Sunaina and Megha Akash were joined by able performers like Ravi Babu, Srikanth Iyyengar, Ajay Ghosh, Gangavva, and Tanikella Bharani.

Directed by debutant Hasith Goli, the film’s music is by Vivek Sagar.

Later this month, ZEE5 will also release ‘Heads & Tales’, a Telugu-language drama to be streamed from October 22. 

 
Mana Chorudu mahatyalu telusukonutaku siddanga vundavalenu ani prajalandariki manavi. Just 2️⃣4️⃣ hours to witness the greatness of #RajaRajaChora Watch #RajaRajaChoraOnZEE5, premieres tomorrow exclusively on #ZEE5 #ZEE5Exclusive #PremieresTomorrow
@sreevishnuoffl @akash_megha @TheSunainaa @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @hasithgoli @kirthi_chowdary @peoplemediafcy @AAArtsOfficial @zeetelugu