పాన్ ఇండియా మూవీ `మైఖేల్`లో వరుణ్ సందేశ్

పాన్ ఇండియా మూవీ `మైఖేల్`లో వరుణ్ సందేశ్

సందీప్ కిషన్, విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీ `మైఖేల్`లో వరుణ్ సందేశ్

మైఖేల్ చిత్రం గురించి న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బంది గురించి  నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించిన‌ప్ప‌టినుంచీ చిత్రంపై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. వారంతా ఈ సినిమాలో ప‌నిచేయ‌డం పట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.

హ్యాండ్సమ్,  టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో టైటిల్ రోల్ పోషిస్తుండగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మ‌రోసా రి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకునే పాత్ర‌ను పోషిస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా, సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తోంది. అదేవిధంగా ప్ర‌తిభ‌గ‌ల న‌టీమ‌ణుల్లో ఒకరైన వరలక్ష్మి శరత్‌కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌డం విశేషం.

ఇప్పుడు, ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం వరుణ్ సందేశ్‌ను చిత్ర బృందం స్వాగతించింది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ నుండి నిష్క్రమించిన తర్వాత వరుణ్ సందేశ్ అంగీక‌రించిన  మొదటి పెద్ద ప్రాజెక్ట్ ఇది.

మైఖేల్ చిత్రం షూటింగ్ తాజా షెడ్యూల్ ఈరోజు నుండి హైదరాబాద్‌ లో ప్రారంభమైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహిస్తుండగా, మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పితో కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

మైఖేల్ చిత్రం భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పకులు.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సిబ్బంది వివరాలు తర్వాత వెల్లడికానున్నాయి.

తారాగణం: సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, దివ్యాంశ కౌశిక్, వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ తదితరులు

సాంకేతిక సిబ్బంది:

దర్శకుడు: రంజిత్ జయకోడి

నిర్మాతలు: భరత్ చౌదరి మరియు పుస్కూర్ రామ్ మోహన్ రావు

సమర్పకుడు: నారాయణ్ దాస్ కె నారంగ్

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, కరణ్ సి ప్రొడక్షన్స్ LLP

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శివ చెర్రీ

PRO: వంశీ-శేఖర్

Varun Sandesh On Board For Sundeep Kishan, Vijay Sethupathi, Ranjit Jeyakodi, Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP’s Pan India Film Michael

Just with the announcement of prominent cast of Michael, the team is generating enough buzz. In fact, every actor or technician associated with the movie enjoy such fame.

Handsome and talented star Sundeep Kishan is playing the title role in this massive action entertainer, while Makkal Selvan Vijay Sethupathi will be seen in a special action role.

Star director Gautham Vasudev Menon is playing an antagonist, while Divyansha Kaushik is essaying the heroine opposite Sundeep Kishan. Varalaxmi Sarathkumar who is one of the most sought-after actresses is also part of the project.

Now, the team welcomes Varun Sandesh on board for an important role in the movie. This is the first big project signed by the actor, after his exit from the popular reality show Bigg Boss.

The new shooting schedule of Michael has commenced from today in Hyderabad. Ranjit Jeyakodi is directing this Pan India film to be released in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages, while the most happening Production House Sree Venkateswara Cinemas LLP in association with Karan C Productions LLP is mounting it on a massive scale.

Michael is a joint production venture of Bharath Chowdary and Puskur Ram Mohan Rao. Narayan Das K Narang is the presenter.

The film’s other cast and crew will be revealed later.

Cast: Sundeep Kishan, Vijay Sethupathi, Gautham Menon, Divyansha Kaushik, Varalaxmi Sarathkumar, Varun Sandesh and others

Technical Crew:
Director: Ranjit Jeyakodi
Producers: Bharath Chowdary and Puskur Ram Mohan Rao
Presenter: Narayan Das K Narang
Banners: Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP
Executive producer : Siva Cherry
PRO: Vamsi-Shekar