`చెక్ పోస్ట్` రివ్యూ!!

`చెక్ పోస్ట్` రివ్యూ!!

 

`చెక్ పోస్ట్` రివ్యూ!!

దర్శకత్వం :
రవి కిషోర్
నిర్మాత :
గూడెల యెల్లజీ
సంగీతం:
వినోద్ యాజమాన్య
సినిమాటోగ్రఫీ:
శివ కుమార్ దేవరకొండ
తారాగణం:
మాస్టర్ మహేంద్రన్,
షగ్న,
కాలకేయ ప్రభాకర్,
ఉమా మహేశ్వరరావు, తదితరులు…
విడుదల : 01-10-2021
రేటింగ్ : 3 .25/5

ప్ర‌జంట్ రియ‌లిస్టిక్ క‌థాంశాల‌తో సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. అలాంటి వాటిని తీసేందుకు ద‌ర్శ‌క నిర్మాత‌లు, చూసేందుకు ఆడియ‌న్స్ ఇష్ట‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల కాలంటో రియ‌లిస్టిక్ క‌థాంశ‌ల‌తో వ‌చ్చిన సినిమాలు చాలా వ‌రకు విజ‌యం సాధించాయి. అదే కోవలో వచ్చిన మరో బిన్నమైన చిత్రం చెక్ పోస్ట్ 1995. ఇటీవ‌ల విడుద‌లై ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

స్టోరి విష‌యానికొస్తే…
అనంతగిరి అనే చిన్న విలేజ్‌లో జ‌రిగే క‌థ ఇది. కథ మొత్తం నాలుగు ప్రధాన పాత్రలు రాజు, గోవింద
రావు, అంజయ్య మరియు S. I రెడ్డి చుట్టూ తిరుగుతుంది. అనంతగిరిలో ఒక జీప్ డ్రైవర్ అయిన రాజు ( మాస్టర్ మహేంద్ర ) రెగ్యులర్ గా పక్క ఊరికి, అనంత గిరికి మధ్య జీప్ నడిపిస్తూ ఉంటాడు. ఇలా సాఫీగా జీవితం సాగిపోతున్న క్ర‌మంలో అనంత గిరి గ్రామం దగ్గర చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తారు. అక్కడకు విధులపై వచ్చిన S.I రెడ్డిని చూస్తాడు, ఆ ఎస్సై నీ చూడగానే అతడి జీవితంలో జరిగిన సంఘటనలు కళ్లముందు తిరుగుతాయి. ఆ ఎస్సై అంటే చంపేయాలన్నంత కోపంగా ఉంటాడు రాజు. అసలు రాజుకు ఆ ఎస్సై అంటే ఎందుకు అంత క‌సి, కోపం ..అస‌లు రాజు జీవితంలో జరిగింది ఏమిటి అన్నది మిగతా స్టోరి.

ఆర్టిస్ట్స్ ప‌ర్పార్మెన్స్ః
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన మాస్టర్ మహేంద్ర హీరోగా నటించిన చిత్రమిది. సినిమాలో రాజు పాత్రలో జీప్ డ్రైవర్ గా బాగా సెట్ అయ్యాడు. ముఖ్యంగా అతని బాడీ లాంగ్వేజ్ బాగుంది. బాల నటుడిగా ఎన్నో రకాల పాత్రల్లో మెప్పించాడు కాబట్టి ఈ సినిమాలో హీరోగా అతని నటన హైలైట్. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా చేశాడు. ఇక హీరోయిన్ షగ్న పాత్ర బాగుంది. చాలా సీన్స్ లో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకుంది. రొమాన్స్, కామెడీ, ఎమోషనల్ అంశాల్లో బాగా చేసింది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర ఎస్సై రెడీ గా నటించిన కాలకేయా ప్రభాకర్ ది. అవినీతి పోలీస్ ఆఫీస‌ర్ గా బాగా చేశాడు. మరో ముఖ్యమైన పాత్ర లో న‌టించిన ఉమా మహేశ్వర రావు ఎమోషనల్ పాత్రలో ఆకట్టుకున్నాడు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
క్లైమాక్స్ లోని ఎమోషనల్ కంటెంట్ ను దర్శకుడు బాగా తెరకెక్కించారు. వినోద్ యాజమాన్య అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. శివ కుమార్ దేవర కొండ సినిమాలోని సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. సినిమా మూడ్ కి తగ్గట్టుగా సినిమాటోగ్రఫి బాగుంది. ఇక ఎడిటింగ్ కూడా ప‌ర్వాలేదు. అయితే కొన్ని అనవసర సన్నివేశాలు తొలగిస్తే బాగుండేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
దర్శకుడు రవి కిషోర్ ఈ సినిమాలో నాలుగు క్యారెక్టర్స్ నీ హైలెట్ గా తీసుకుని జర్నీలో కొన్ని బలమైన ఎమోషన్స్ జోడించి మంచి ఫీల్ రాబట్టినప్పటికీ. మొయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగినా కూడా ఆకట్టుకునేలా ఉంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను ఇంటెన్స్ తో తీసుకెళ్ళాడు.

ఫైన‌ల్ గా చెప్పాలంటే…
చెక్ పోస్ట్ చుట్టూ ప్రజల జీవితాల నేపథ్యంలో సాగిన కథ ఇది. ఓ అవినీతి అధికారి ఆగడాలు, అక్కడి ప్రజల సమస్యల నేపథ్యం కళ్ళకు కట్టినట్టు చూపించారు. టైటిల్ ప్రకారం చెక్ పోస్ట్ 1995 సినిమా అప్పటి మూడ్ నీ క్రియేట్ చేశాడు దర్శకుడు మాస్టర్ మహేంద్రన్, షగ్న, కాలకేయ ప్రభాకర్, ఉమా మహేశ్వరరావు ఈ సినిమాలో అయా పాత్రలో ఆకట్టుకున్నారు. ప్రధాన పాత్రల మధ్య ఉన్న ఎమోషనల్ కంటెంట్ కూడా ఇంకా బాగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది. ఉన్నంత‌లో ద‌ర్శ‌కుడు సినిమాను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు అన‌డంలో సందేహం లేదు. సో డోంట్ మిస్ దిస్ వీక్…అంద‌రూ హ్యాపీగా వెళ్లి సినిమా చూడొచ్చు.