ఉమెన్స్ డే మిర్చి స్పెషల్ – షీ వ్యాక్సీన్ !!

ఉమెన్స్ డే మిర్చి స్పెషల్ – షీ వ్యాక్సీన్ !!

ఉమెన్స్ డే మిర్చి స్పెషల్ – షీ వ్యాక్సీన్ !!

 
స్త్రీమూర్తి-సర్వశక్తివంతమైన వ్యాక్సిన్
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా 98.3 మిర్చి ‘షీ వ్యాక్సీన్’ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రేడియో స్టేషన్స్ లో నిన్నటి రోజంతా జరిగిన అన్ని కార్యక్రమాలను మొత్తం మహిళా ఆర్జేలే నిర్వహించడం విశేషం. రోజువారీ జీవితంలో మనం ఎదుర్కోనే ప్రతి సమస్యకు ఒక్కటే పరిష్కారం “ఆమె”.. అంటే ఒక మహిళ మాత్రమే! యుగయుగాలగా, తరతరలుగా ఈ సమాజం కోసం “స్త్రీ శక్తి” ఒక ఇమ్యూనిటీగా పని చేస్తోంది. ఆమే మన పరిపూర్ణమైన జీవితానికి ఒక “వ్యాక్సీన్” అనే ఆలోచనతో ఈ కాన్సెప్ట్ రూపొందించారు. మంగళవారం రోజంతా ఉత్సాహంగా సాగిన మిర్చి రేడియో కార్యక్రమాలన్నింటిలో… లోకల్ “షీ-హీరోస్”ని వెతికి పట్టుకొని, వారి ఇన్స్పైరింగ్ స్టోరీలను ఆర్జేలు మిర్చి శ్రోతలతో పంచుకున్నారు. వివిధ రంగాల్లో విజయాలు సాధించిన అనేకమంది అసాధారణ స్త్రీమూర్తులను శ్రోతలకు పరిచయం చేశారు. రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు, ‘షీ వ్యాక్సీన్’ ఎలా పని చేస్తుందో వినోదాత్మకంగా వివరించడం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది.
“వేరియంట్ ఏదైనా – ఒక్కటే వ్యాక్సీన్
సమస్య ఏదైనా – ఒక్కటే… షీ వ్యాక్సీన్”
ఒక మహిళ జీవితంలో ఉండే భయాలు, బాధ్యతలు, సెలబ్రేషన్స్, ప్రేమ, అనుబంధాలు… ఇలా ప్రతి ఒక్క విషయం మీద వుమెన్ ఆర్జేలు మాట్లాడారు. హైదరాబాద్, వరంగల్ స్టేషన్స్ నుండి ఆర్జే అమృత, ఆర్జే భార్గవి, ఆర్జే స్వాతి, ఆర్జే శ్వేత రోజంతా కార్యక్రమాలు నిర్వహించగా… వైజాగ్, విజయవాడ స్టేషన్స్ నుంచి ఆర్జే అనుశ్రీ, ఆర్జే ఇందూ, ఆర్జే కావ్యశ్రీ తమదైన శైలిలో శ్రోతలలో స్ఫూర్తిని నింపారు. సీఆర్పీఎఫ్ లో పని చేసే తెగువ కల మగువ మొదలుకుని… పది రూపాయలకు 5 ఇడ్లీలు అమ్మే ఒక మహిళాసేవామూర్తి వరకు పలువురు అద్వితీయ మహిళా స్ఫూర్తిప్రదాతలను శ్రోతలకు పరిచయం చేశారు!!