న‌రేన్ హీరోగా ఇంట‌ర్ డ్యూస్ అవుతోన్న `ఊరికి ఉత్త‌రాన‌` మోష‌న్ పోస్ట‌ర్!!

న‌రేన్ హీరోగా ఇంట‌ర్ డ్యూస్ అవుతోన్న `ఊరికి ఉత్త‌రాన‌` మోష‌న్ పోస్ట‌ర్!!

 

 

న‌రేన్ హీరోగా ఇంట‌ర్ డ్యూస్ అవుతోన్న `ఊరికి ఉత్త‌రాన‌` మోష‌న్ పోస్ట‌ర్!!        
       

 ప్ర‌ముఖ నిర్మాత  `దిల్` రాజు, కోన‌వెంక‌ట్ , వేణు శ్రీరామ ల వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసి, ఆ అనుభ‌వంతో స‌తీష్ ప‌రమ‌వేద ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం `ఊరికి ఉత్త‌రాన‌`. ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా  న‌రేన్ హీరోగా ఇంట‌ర్ డ్యూస్  అవుతుతుండ‌గా దీపాలి హీరోయిన్ గా న‌టిస్తోంది.  వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య , హుస్సేన్ నాయ‌క్ నిర్మాత‌లు. వ‌రంగ‌ల్ లో జ‌రిగిన ఓ య‌థార్థ సంఘ‌ట‌నకు ఈ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం   ప్ర‌స్తుతం  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్  కార్య‌క్ర‌మాలు ముగించుకుని విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేశారు చిత్ర యూనిట్.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ…“ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది ప్రముఖుల వ‌ద్ద ఎన్నో సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన స‌తీష్ ప‌ర‌మ‌వేద ఓ మంచి క‌థ‌తో `ఊరికి ఉత్త‌రాన‌` చిత్రాన్ని   అంద‌రికీ న‌చ్చేలా  తెర‌కెక్కించారు. న‌రేన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. త‌న‌కు ఇది తొలి సినిమా అయిన‌ప్ప‌టికీ ఎంతో అనుభ‌వం ఉన్న న‌టుడిలా ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచాడు.  అలాగే  పెద్ద  హీరోల చిత్రాల‌కు  ప‌ని చేస్తోన్న  భీమ్స్ సిసిరోలియో, సురేష్ బొబ్బిలి మ్యూజిక్ మా సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది.   త్వ‌ర‌లో మా చిత్రానికి సంబంధించిన టీజ‌ర్  ప్ర‌ముఖ స‌మ‌క్షంలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

    రామరాజు, మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి, ఫణి, జగదీష్ లు ప్రధాన పాత్రల్లో  న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః శ్రీకాంత్ అరుపుల‌; ఎడిట‌ర్ః కార్తిక శ్రీనివాస్‌; స‌ంగీతంః భీమ్స్ సిసిరోలియో- సురేష్ బొబ్బిలి;  సాహిత్యంః సురేష్ గంగుల‌, పూర్ణాచారి;  నిర్మాత‌లుః వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య‌, హుస్సేన్ నాయ‌క్‌; ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః స‌తీష్ ప‌ర‌మ‌వేద‌.