త్రిష, సూర్య వంగల, అవినాష్ కొల్ల, సోని లివ్ వెబ్ సిరీస్ ‘బృందా’ లాంఛనంగా ప్రారంభం !!

త్రిష, సూర్య వంగల, అవినాష్ కొల్ల, సోని లివ్ వెబ్ సిరీస్ ‘బృందా’ లాంఛనంగా ప్రారంభం !!

త్రిష, సూర్య వంగల, అవినాష్ కొల్ల, సోని లివ్ వెబ్ సిరీస్ ‘బృందా’ లాంఛనంగా ప్రారంభం !!

ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లకు టాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. తన ప్రతిభతో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. అవినాష్ కొల్ల ఇప్పుడు తన సోదరుడు అశోక్ కొల్లతో కలిసి కొత్త ప్రొడక్షన్ కంపెనీ అండ్ స్టోరీస్ (&Stories)ను ప్రారంభించారు.

సోనీ లివ్ ఓటీటీ ఫ్లాట్ ఫాంతో కలిసి తమ మొదటి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. త్రిష హీరోయిన్‌గా బృందా అనే టైటిల్‌తో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతోన్నారు. త్రిష కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సరైన కథ కోసం వేచి చూస్తున్నారు. తనకు నచ్చిన స్క్రిప్ట్ దొరకడంతో ఇలా ఓటీటీ బాట పట్టేశారు.

దసరా సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలను నేడు నిర్వహించారు.

సోనీ లివ్ మొట్టమొదటిసారిగా ఓ తెలుగు వెబ్ సిరీస్‌ను చేస్తోంది. అది కూడా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రాబోతోన్న అద్భుతమైన కథతో సోనీ లివ్ రాబోతోంది. సూర్య వంగల ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. శక్తికాంత్ కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. దినేష్ కే బాబు కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

జై కృష్ణ ఈ వెబ్ సిరీస్‌కు మాటలు అందిస్తున్నారు. పద్మావతి మల్లాదితో కలిసి సూర్య వంగల స్క్రీన్ ప్లే రాసుకున్నారు. శశాంక్ వెన్నెలకంటి స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు.

సాయి కుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవింద్ర విజయ్, ఆనంద్ సామి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు.

నటీనటులు : త్రిష, సాయి కుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవింద్ర విజయ్, ఆనంద్ సామి తదితరులు

సాంకేతిక బృందం
రచయిత, దర్శకుడు : సూర్య వంగల
నిర్మాతలు : అవినాష్ కొల్ల, ఆశిష్ కొల్ల
ప్రొడక్షన్ కంపెనీ  : అండ్ స్టోరీస్ (&Stories)
స్క్రీన్ ప్లే : సూర్య వంగల, పద్మావతి మల్లాది
సంగీతం : శక్తి కాంత్ కార్తీక్
కెమెరామెన్ : దినేష్ కే బాబు
ప్రొడక్షన్ డిజైన్ : అవినాష్ కొల్ల
మాటలు : జై కృష్ణ
స్క్రిప్ట్ కన్సల్టెంట్ : శశాంక్ వెన్నెలకంటి
కాస్ట్యూమ్ డిజైనర్ : రజినీ

 
Trisha Krishnan, Surya Vangala, Avinash Kolla, SonyLIV’s Webseries ‘Brinda’ Launched With Pooja Ceremony

Leading Production Designer Avinash Kolla has made a name for himself in the Telugu Film Industry with his remarkable talent. Avinash Kolla, in association with his brother Ashish Kolla, is now set to begin a new innings by floating a new production house ‘&Stories’.

Kolla’s maiden Production venture is a webseries for Leading OTT Platform, SonyLIV. Titled Brinda, the webseries stars Trisha Krishnan in the lead role. Trisha who was looking for right script for her OTT debut has liked the script and has given her nod.

The film has been launched with pooja ceremony, on the auspicious occasion of Dussehra.

The First ever Telugu webseries of SonyLIV is a Crime Investigation. A newcomer Surya Vangala is writing and directing the webseries, with Shakti Kanth Karthick composing music and Dinesh K Babu cranking the camera. Avinash Kolla is also the production designer for the film.

Jay Krishna provides dialogues, while Surya Vangala has penned screenplay along with Padmavathi Malladi. Shashank Vennelakanti is the script consultant.

Sai Kumar, Amani, Indrajith Sukumaran, Ravindra Vijay, and Anand Saami will be seen in other crucial roles.

Cast: Trisha, Sai Kumar, Amani, Indrajith Sukumaran, Ravindra Vijay, Anand Saami and others

Technical Crew:
Written & Directed: Surya Vangala
Producers: Avinash Kolla, Ashish Kolla
Production House: &Stories
Screenplay: Surya Vangala & Padmavathi Malladi
Music Director: Shakti Kanth Karthick
Department of Photography: Dinesh K Babu
Production Design: Avinash Kolla
Dialogue writer: Jay Krishna
Script Consultant: Shashank Vennelakanti
Costume Designer: Rajini