సమంత, శంతరుబన్ జ్ఞానశేఖరన్ కాంబినేషన్ లో డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్ నెంబర్ 30 ప్రకటన.

సమంత, శంతరుబన్ జ్ఞానశేఖరన్ కాంబినేషన్ లో డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్ నెంబర్ 30 ప్రకటన.

సమంత, శంతరుబన్ జ్ఞానశేఖరన్ కాంబినేషన్ లో డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్ నెంబర్ 30 ప్రకటన 

కార్తీ ఖైదీ, శర్వానంద్ ఒకే ఒక జీవితం వంటి చిత్రాలతో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ నుంచి రాబోతోన్న కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు. ప్రొడక్షన్ నంబర్ 30గా రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ క్వీన్ సమంత నటిస్తున్నారు. ఈ సినిమాతో శంతనురుబన్ జ్ఞానశేఖరన్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను ద్విభాషచిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇదొక విభిన్న ప్రేమ కథ చిత్రం. సమంత పక్కన నటించే హీరోను త్వరలోనే మేకర్లు ప్రకటించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సమంతను చూస్తే ఎంతో బాధలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సమంత రచయితగా కనిపించబోతోన్నారు.

ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది.

Samantha, Shantaruban Gnanasekharan, Dream Warrior Pictures Production No 30 Announced

The committed producers of Khaidi and upcoming Sharwanand’s film Oke Oka Jeevitham, Dream Warrior Pictures, announced their prestigious production No 30 with South queen Samantha. This film will be directed by debutant Shantaruban Gnanasekharan.

The yet to be titled film is a Telugu-Tamil bilingual and it’s a breezy and different love story. The makers will announce the male actor to play opposite Samantha soon.

SR Prakash Babu and SR Prabhu will be producing the film. Other cast and crew will be revealed soon. The regular shoot of the movie commences soon.