బీఎస్ఎస్‌9 సెట్లో గ్రాండ్‌గా జ‌రిగిన వి.వి.వినాయ‌క్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

బీఎస్ఎస్‌9 సెట్లో గ్రాండ్‌గా జ‌రిగిన  వి.వి.వినాయ‌క్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌

బీఎస్ఎస్‌9 సెట్లో గ్రాండ్‌గా జ‌రిగిన  వి.వి.వినాయ‌క్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ 

హ్యాపీనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, స్టార్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న‌  ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. స‌క్సెస్‌ఫుల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతుంది. ఈ రోజు ద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా బీఎస్ఎస్‌9 సెట్లో వి వి వినాయ‌క్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ నిర్మాత‌, వైజాగ్ ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ముఖ్య అతిథిగా హాజ‌రై వి.వి వినాయ‌క్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ పాల్గొన్నారు.

నటీన‌టులు:
బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, సాహిల్ వైద్‌, అమిత్ నాయ‌ర్‌, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్‌, స్వ‌ప్నిల్‌, అశిష్ సింగ్‌, మ‌హ్మ‌ద్ మోనాజిర్‌, అరుషిక దే, వేదిక‌, జాస‌న్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: వి.వి.వినాయ‌క్‌
క‌థ‌: కె.వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్‌
స‌మ‌ర్ప‌ణ‌: డా.జ‌యంతిలాల్ గ‌డ‌
నిర్మాత‌లు: ధ‌వ‌ల్ జ‌యంతి లాల్ గ‌డ‌, అక్ష‌య్ జ‌యంతిలాల్ గ‌డ‌
బ్యాన‌ర్స్‌: పెన్ మ‌రుద‌ర్ సినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, పెన్ స్టూడియోస్
సినిమాటోగ్ర‌ఫీ: నాజిర్ అలీ షఫీ
స్టంట్స్‌: అన‌ల్ అర‌సు
మ్యూజిక్‌: త‌నిష్క్ బ‌గ్చి
డైలాగ్స్‌: మయూర్ పూరి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సునీల్ బాబు
ఆర్ట్‌: శ్రీను
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: అర్చా మెహ‌తా
అసోసియేట్ డైరెక్ట‌ర్‌: స‌ఫ్ద‌ర్ అబ్బాస్‌