‘సర్వం సిద్దం’ చిత్రం నవంబర్ 26న విడుదల !!

‘సర్వం సిద్దం’ చిత్రం నవంబర్ 26న విడుదల !!

‘సర్వం సిద్దం’ చిత్రం నవంబర్ 26న విడుదల !!

ఫన్, ప్రస్ట్రేషన్ సమ్మిళితంగా వెరైటీ ట్రీట్ మెంట్ తో, ఆద్యంతం నవ్వులవర్షం కురిపించేలా రూపొందించిన “సర్వం సిద్దం” చిత్రాన్ని నవంబర్ 26, 2021న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత శ్రీమతి శ్రీలత వెంకట్ తెలియజేశారు. గడచిన రెండున్నరేళ్ళలో ఇంతగా తమను నవ్వించిన చిత్రం మరేమీ లేదని సెన్సార్ అధికారులు, లేచి నిల్చుని చప్పట్లతో అభినందించిన కామెడీ చిత్రం ఇదనీ ఆమె తెలిపారు. ఈ చిత్రం అన్నివయసుల ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందనీ, పూర్తి కుటుబం మొత్తం కలిసికూర్చుని ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చూనని ఆమె పేర్కొన్నారు.

అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో రూపొందించిన ఈ సర్వం సిద్దం (నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత) చిత్రంలో గోవింద్ రాజ్, మందార్, పూజ, అనుపమ పట్నాయక్, కిరణ్ మాడసాని, త్రిశాంక్, అభిషేక్, రామ్ రోమియో, లావణ్య, సంతోష్, సిహెచ్ సిద్దేశ్వర్, యస్వంత్, వెంకటేష్, చరణ్, ఫరీనా, శిరీష, అర్జున్, మధుశ్రీ తదితరులు నటించారు.

సినీ రంగ ప్రముఖులు ప్రముఖ దర్శకులు శ్రీ అనిల్ రావిపూడి, నటులు అల్లరి నరేష్, సీనియర్ దర్శకులు శ్రీ రేలంగి నరసిమ్హా రావు, నిర్మాత శ్రీ బెల్లకోండ శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత శ్రీ సి.కళ్యాణ్, దర్శకులు శ్రీ వి.ఎన్ ఆదిత్య, శ్రీ అమ్మ రాజశేఖర్ లాంటి వారందరూ చిత్రం లోని కామెడీ మాంచి వెరైటీగా, ప్రేక్షకులు కోరుకునే స్థాయిలో ఉంది, ఇలాంటి చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తుందనీ, చిత్రాన్ని భారీగానే విడుదలచేయాలని సలహా ఇచ్చారనీ, చిత్ర టీజర్ మరియు ట్రైలర్ తమనెంతో ఆకట్టుకున్నాయని వారు పేర్కొన్నారని సినెటేరియా సీఈవో వెంకట్ బులెమోని తెలియజేశారు. కాగా త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్ ను విడుదలచేయనున్నామనీ, నవంబర్ 14న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి, నవంబర్ 26న ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు మరియు కర్ణాటకలలో విడుదలచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఒక రెండు ఓటీటీ ప్లాట్ ఫాం ల వాళ్ళు, నేరుగా ఓటీటీ విడుదలకు ఆసక్తి కనబరచినా, సినీ పెద్దల సూచనలమేరకు ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదలచేయడానికి నిర్ణయించుకున్నామని ఆయన తెలియజేశారు. అందుకు తగ్గట్లుగానే, సినిమా మాల్స్ లలో ఉంచిన తమ చిత్ర స్టాండీలు, పోస్టర్లను ఎందరో ప్రేక్షకులు ఫోటోలు తీసుకుంటున్నారనీ, కొందరు మా స్టాండీలముందు నిల్చుని సెల్ఫీలు తీసుకుంటున్నారనీ, మా చిత్ర పోస్టర్లు ఆద్యంతం ప్రేక్షకులను ఆకర్శిస్తున్నాయనీ, ఆ రెస్పాన్స్ చూసిన తమకు మరింత నమ్మకం వచ్చిందని ఆయన వివరించారు.

ఈ “సర్వం సిద్దం” చిత్రానికి డివోపి: బొబ్బిలి సంతోష్ రెడ్డి, మ్యూజిక్: డేవిడ్ జి, ఎడిటర్: కిరణ్ రెడ్డి యం, నిర్మాత: శ్రీలత బి. వెంకట్, రచన-దర్శకత్వం: అతిమళ్ల రాబిన్ నాయుడు.

పై సమాచారాన్ని తమ అమూల్యమైన దిన పత్రికలో ప్రచురించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

కృత్జతలు

వెంకట్ బులెమోని
సీఈవో, సినెటేరియా మీడియా వర్క్స్