అమేజాన్‌ ప్రైమ్ లో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ‌ `ప‌వ‌ర్ ప్లే` !!

అమేజాన్‌ ప్రైమ్ లో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ‌ `ప‌వ‌ర్ ప్లే` !!

అమేజాన్‌ ప్రైమ్ లో మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్ ల‌ `ప‌వ‌ర్ ప్లే`

యంగ్ హీరో రాజ్ త‌రుణ్, కొండా విజ‌య్ కుమార్‌ల‌ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన మూవీ `పవర్ ప్లే`. శ్రీ‌మ‌తి ప‌ద్మ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌న‌మాలి క్రియేష‌న్స్ ప్రై.లి ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఈ చిత్రాన్ని మ‌హిద‌ర్‌, దేవేష్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్ప‌టికే థియేట‌ర్ల‌లో విడుద‌లై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం రీసెంట్‌గా అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌లై మంచి రెస్పాన్స్ తో హైయెస్ట్ వ్యూస్ ద‌క్కించుకుంటోంది. ఈ సంద‌ర్భంగా..

హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ – “మా ప‌వ‌ర్ ప్లే సినిమాకు థియేట‌ర్‌ల‌లో రిలీజైన‌ప్ప‌డు ఎలాంటి అప్రిసియేష‌న్ వ‌చ్చిందో ఇప్పుడు  అమేజాన్‌లో కూడా అలాంటి అప్రిసియేష‌న్ వ‌స్తోంది. చాలా మంది ఫ్రెండ్స్‌, స‌న్నిహితులు, ఇండ‌స్ట్రీ వ‌ర్గాల వారు ఫోన్ చేసి మంచి థ్రిల్ల‌ర్ సినిమా చూశాం అని అభినందిస్తున్నారు“ అన్నారు.

ద‌ర్శ‌కుడు విజ‌య్‌కుమార్ కొండా మాట్లాడుతూ  – “ నా జోన‌ర్‌లో కాకుండా ఒక డిఫ‌రెంట్ జోన‌ర్‌లో చేసిన `ప‌వ‌ర్ ప్లే` సినిమాకు ఓటీటీలో మంచి  రీచ్ వస్తున్నందుకు చాలా సంతృప్తిగా ఉంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌బ్జెక్ట్స్‌తో పాటు భ‌విష్య‌త్తులో డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఈ విజ‌యం మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది“ అన్నారు

నిర్మాత దేవేష్ మాట్లాడుతూ  –  “థియేట‌ర్‌ల‌లో విడుద‌లై మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన‌ప్ప‌టికీ అమేజాన్‌లో కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తున్నందుకు సంతోషంగా ఉంది. మా చిత్రంలోని  హైలెట్ పాయింట్స్ అన్ని రిసీవ్ చేసుకున్న ఆడియ‌న్స్‌కి థ్యాంక్స్“ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి మాట్లాడుతూ  –  “ఓటీటీలో మా సినిమాను ఆదరిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్ ఇంగ్లే, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, కేద‌రి శంక‌ర్‌, టిల్లు వేణు, భూపాల్‌, అప్పాజీ, ర‌వివ‌ర్మ‌, సంధ్య‌ జ‌న‌క్ త‌దిత‌రులు న‌టించిన‌ ఈ చిత్రానికి
క‌థ‌-మాట‌లు: న‌ంధ్యాల ర‌వి,
సినిమాటోగ్ర‌ఫి: ఐ. ఆండ్రూ,
సంగీతం: సురేష్ బొబ్బిలి‌,
ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి,
ఆర్ట్‌: శివ‌,
ఫైట్స్‌: `రియ‌ల్` స‌తీష్‌,
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బి.వి సుబ్బారావు,
కో- డైరెక్ట‌ర్: వేణు కురపాటి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: పా‌ల‌ప‌ర్తి అనంత్ సాయి,
స‌మ‌ర్ప‌ణ‌: శ్రీ‌మ‌తి ప‌ద్మ‌,
నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌,
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా.

 
Raj Tarun – Konda Vijaykumar’s ‘Power Play’ Is Garnering Very Good Response In Amazon Prime
Latest film in Young Hero Raj Tarun and Director Konda Vijay Kumar‘s successful combination is ‘Power Play’. This film is Presented by Smt Padma Produced by Mahidhar, Devesh under Vanamalee Creations Pvt Ltd as their Production No – 1. The film was recently released in theatres and acquired positive response for its thrilling content. Now, ‘Power Play’ is streaming in Amazon Prime and is recieving very good response with highest viewing count.  On this occasion..

Young Hero Raj Tarun said, ” Our ‘Power Play’ is getting very good appreciation from Amazon Prime similar to its theatrical release . I am recieving phone calls from friends, Industry people saying that they have watched a very good thriller.  ”
Director Vijay Kumar Konda said, ” I am very happy that ‘Power Play’ is getting very good reach in OTT too. I did this film in a new genre for me. This film gave me very good boost for me for doing different films in future along with Entertainment subjects. ”

Producer Devesh said, ” I am glad that ‘Power Play’ is getting amazing response in Amazon too after its theatrical release.  Thanks to the audience for enjoying the highlight points of the film and for a very good reception of the film ”

Executive Producer Palaparthi Ananth Sai said, ” Thanks to each and everyone for appreciating our film in OTT”

Raj Tarun, Hemal Ingle, Poorna, Madhunandan, Ajay, Kota Srinivas Rao, Raja Ravindra, Dhanraj, Kedari Shankar, Tillu Venu, Bhupal, Appaji, Ravi Varma, Sandya Janak and Others

Story & Dialogues: Nandyala Ravi
Cinematography: I Andrew
Music: Suresh Bobbili
Editing: Praveen Pudi
Art: Siva  
Fights: Real Satish
Production Controller: B.V.Subbarao
Co-Director: Venu Kurapati
Executive Producer: Palaparthi Ananth Sai
Presented by: Smt.Padma
Produced by: Mahidhar – Devesh
Screenplay-Direction: Vijay Kumar Konda