కొత్త ట్రెండ్‌కు శ్రీ‌కారం, స‌రికొత్త వ‌ర్క్ ప్లేస్ ఫిలింనగర్ లో ప్రారంభం !!!

కొత్త ట్రెండ్‌కు శ్రీ‌కారం, స‌రికొత్త వ‌ర్క్ ప్లేస్ ఫిలింనగర్ లో ప్రారంభం !!!

కొత్త ట్రెండ్‌కు శ్రీ‌కారం, స‌రికొత్త వ‌ర్క్ ప్లేస్ ఫిలింనగర్ లో ప్రారంభం !!!
 
●ప్రారంభ వేడుక‌ల్లో పాల్గొన్న సినీ, టీవీ ప్ర‌ముఖులు
‌● క‌ల‌ర్‌ఫుల్‌గా సాగిన ఈవెంట్
●కార్యక్రమంలో పాల్గొన్న బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్‌, సోహెల్‌, జోర్ధార్ సుజాత‌, వ‌‌ర్త‌మాన న‌టి కల్పిక గణేష్‌, త‌రుణి  సింగ్‌ తదితరులు.
 
మారుతున్న కాలానికి అనుగుణంగా యువ‌త ఆలోచ‌న, న‌డ‌వ‌డిక కూడా మారుతున్న‌ది.  పోటీ ప్ర‌పంచంతో వేగంగా పోటీప‌డుతూ కొంగొత్త ఆలోచ‌న‌ల‌తో అడుగులు వేస్తున్నారు నేటి యువ‌త‌. ఫ్యాష‌న్ రంగంలో వ‌స్తున్న అనేక మార్పుల‌ను ఒంట‌ప‌ట్టించుకొని స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు చేస్తున్నారు. అలాంటి ఆలోచ‌న‌నే ఆచ‌ర‌ణ‌లో పెట్టారు శ్రీ‌కాంత్‌రెడ్డి బ‌సాడి, మేక‌ప్ కృష్ణ‌వేణి, సాహిత్‌, మౌనాలు. ముగ్గురు క‌లిసి ఒకే వ‌ర్క్‌ప్లేస్‌లో మూడు ర‌కాల వ్యాపారాల‌ను మొద‌లుపెట్టి కొత్త ట్రెండ్‌కు శ్రీ‌కారం చుట్టారు. విజ‌న్ ఐ ఫొటోగ్ర‌ఫీ, హైలో డిజైన్‌, నెయిల్స్ అండ్ మేక‌ప్ బై కృష్ణ‌వేణి మూడు క‌లిపి ఒకే చోట పెట్ట‌డం కొత్తర‌కం ఆలోచ‌న‌ల‌కు ఆజ్యం పోసిన‌ట్టు ఉన్న‌ద‌ని తార‌లు చెప్పుకొచ్చారు. శ‌నివారం ఫిలింన‌గ‌ర్‌లో ప్రారంభ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా జరిగింది. యంగ్ హీరో ఆదిత్ అరుణ్, నటుడు ఖయ్యుమ్, బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్‌, సోహెల్‌, జోర్ధార్ సుజాత‌, వ‌‌ర్త‌మాన న‌టి కల్పిక గణేష్‌, త‌రుణి  సింగ్‌, దివ్యపాండేల‌తో పాటు టీవీ, సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరో ఆదిత్ అరుణ్, రాహుల్ సిప్లిగంజ్‌, సోహెల్‌ మాట్లాడుతూ…
విజ‌న్ ఐ ఫొటోగ్ర‌ఫీ ను ప్రారంభిస్తున్న (శ్రీకాంత్ రెడ్డి బాసాడి) హైలో డిజైన్‌ ను ప్రారంభిస్తున్న (సాహిత్, మౌన) నెయిల్స్ అండ్ మేక‌ప్ బై కృష్ణ‌వేణి వీరందరూ కలిసి స్టార్ట్ చేసిన ఈ వెంచర్స్ బిగ్ సక్సెస్ అయ్యి కొత్త బ్రాంచెస్ స్టార్ట్ చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.