బేబితో ఎంజాయ్ మెంట్ బాగుంటుంద‌ట‌!!

 బేబితో ఎంజాయ్ మెంట్ బాగుంటుంద‌ట‌!!
 
 బేబితో ఎంజాయ్ మెంట్ బాగుంటుంద‌ట‌!!
 
నాగార్జున సినిమాలోని ఈ పాట అంద‌రికీ గుర్తుకుండే ఉంటుంది. ఇప్పుడు అంద‌రూ ఇదే పాట పాడుతున్నారు. ఎందుకంటారా? స‌మంత నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `ఓ బేబి` సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ సినిమా టీజ‌ర్ ఈ రోజు విడుద‌లైంది.  టీజ‌ర్ లో స‌మంత ను చూసిన వాళ్లు ఓ బేబి నీ మీద బెంగ ప‌డ్డా అంటూ పాడుకుంటున్నారు. సినిమా సినిమాకు త‌న గ్లామ‌ర్ తో ప‌ర్ఫార్మెన్స్ తో ఆక‌ట్టుకుంటోంది అక్కినేని స‌మంత‌. ఇక ఓ బేబి టీజ‌ర్ చూసాక స‌మంత ఓల్డ్ లేడీ క్యార‌క్ట‌ర్ చేసిన‌ట్లు అర్థ‌మవుతోంది. అనుకోకుండా ఆమె పాతికేళ్ల భామ‌గా మారిపోతుంద‌ట‌. ఆ త‌ర్వాత త‌న కోరిక‌ల‌న్నీ నెర‌వేర్చ‌కుంటుంద‌ట‌. అది ఎలా సాధ్య‌మైంది? ఏంటి ? అన్న‌దే చిత్ర క‌థాంశ‌మ‌ట‌. ఇక ఈ రోజు విడుద‌లైన టీజ‌ర్ సినిమా పై ఇంట్ర‌స్ట్ పెంచింది. సినిమా త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. కొరియ‌న్ సినిమా `మిస్ గ్రానీ` కిది రీమేక్. ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్ ఫిలింస్ మ‌రో సంస్థ‌తో క‌లిసి నిర్మిస్తోంది.  ఇందులో నాగ‌శౌర్య ఒక ఇంట్ర‌స్టింగ్ క్యార‌క్ట‌ర్ చేస్తున్నాడు. మ‌రి `నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు “ బ‌అంటూ ఎండ్ అయింది సినిమా టీజ‌ర్. మ‌రి సినిమా ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.