‘‘దేవర సాంటా 2020’’ – చిన్న పిల్లలకు క్రిస్టమస్ గిఫ్ట్ లు పంపిన హీరో విజయ్ దేవరకొండ

‘‘దేవర సాంటా 2020’’ – చిన్న పిల్లలకు క్రిస్టమస్ గిఫ్ట్ లు పంపిన హీరో విజయ్ దేవరకొండ

‘‘దేవర సాంటా 2020’’ – చిన్న పిల్లలకు క్రిస్టమస్ గిఫ్ట్ లు పంపిన హీరో
విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ సౌత్ ఇండియన్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రతి సంవత్సరం ‘‘దేవర
సాంటా’’ పేరుతో అందరికీ క్రిస్టమస్ గిఫ్ట్ లు పంపిస్తున్న సంగతి
తెలిసింది.. 2017 నుండి వరుసగా విజయ్ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ గా
నిర్వహిస్తున్నాడు. ఈ సంవత్సరం హైదరాబాద్ లోని 600 మంది చిన్న పిల్లలకు
చాక్లెట్స్,తన రౌడీ వేర్ ద్వారా బట్టలు పంపిణీ చేశారు. ప్రతి ఏటా నేరుగా
అభిమానుల దగ్గరికి వెళ్లి కలిసే విజయ్ ఇప్పుడు కరోనా కారణంగా తన టీమ్ చేత
గిఫ్టులు పంపి వీడియో కాల్ ద్వారా పిల్లలతో మాట్లాడాడు.దానికి సంబంధించిన
వీడియో ను విజయ్ తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు.చిన్న పిల్లలతో
విజయ్ మాట్లాడిన విజువల్స్ ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

600 మందితోనే ఆగకుండా ఇంకో 1000 మంది చిన్న పిల్లలకు తన ప్రేమను
పంచాలనుకుంటున్నాడు.దీనికోసం హ్యాష్ ట్యాగ్ దేవరసాంటా (#Deverasanta) అని
ట్విట్టర్ ,ఇన్ స్టా గ్రామ్ లలో పోస్ట్ చేసి అడ్రస్ పెడితే వాళ్ల ఇంటికి
గిఫ్ట్ లు పంపిస్తానని వీడియో ద్వారా విజయ్ తెలిపాడు.