ఆనంద్ దేవ‌ర‌కొండ – కేవీ గుహ‌న్ -వెంక‌ట్ త‌లారి `హైవే` షూటింగ్ పూర్తి !!

ఆనంద్ దేవ‌ర‌కొండ – కేవీ గుహ‌న్ -వెంక‌ట్ త‌లారి `హైవే` షూటింగ్ పూర్తి !!

ఆనంద్ దేవ‌ర‌కొండ – కేవీ గుహ‌న్ – వెంక‌ట్ త‌లారి `హైవే` షూటింగ్ పూర్తి !!
 
తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో షూటింగ్ జ‌రుపుకున్న హైవే టీమ్ 
 
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ `హైవే`. మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. తొలి చిత్రం ‘చుట్టాలబ్బాయి’ ఘనవిజయం సాధించి ఇండస్ట్రీలో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిర్మాత‌ వెంకట్‌ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్యాచీ టైటిల్‌తో పాటు డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగా అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి. వాటికి ధీటుగా మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపారు చిత్ర యూనిట్‌. తాజాగా హైవే షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని తెలుపుతూ విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, ద‌ర్శ‌కుడు గుహ‌న్‌, నిర్మాత వెంక‌ట్ త‌లారి, హీరోయిన్ మాన‌స రాధాకృష్ణ‌న్ షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని సింబాలిక్ గా చూపిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా. 
 
చిత్ర నిర్మాత వెంకట్‌ తలారి మాట్లాడుతూ – ‘‘శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ బేనర్‌పై ఒక డిఫ‌రెంట్ క్రై మ్‌ థ్రిల్లర్‌ గా  ‘హైవే’ మూవీ రూపొందుతోంది. 118 వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన గుహ‌న్ గారు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆనంద్ దేవ‌ర‌కొండ‌, మాన‌స రాధాకృష్ణన్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. మా సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి పాజిటివ్ వైబ్స్ నెల‌కొని ఉన్నాయి. ఈ రోజు హైవే మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో షూటింగ్ జ‌రిపాం. ఈ సినిమాలో కొంత మంది ప్ర‌ముఖ న‌టీన‌టులు యాక్ట్ చేశారు వారి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం“ అన్నారు. 
 
చిత్ర దర్శకుడు కేవీ గుహన్‌ మాట్లాడుతూ – ‘‘‘హైవే’ నేపథ్యంలో సాగే ఒక సైకో క్రై మ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ప్ర‌తిక్ష‌ణం ట్విస్టులు ట‌ర్నుల‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ప్ర‌స్తుతం హైవే షూటింగ్‌ పూర్త‌య్యింది. త్వ‌ర‌లో కొన్ని క్రేజీ అప్‌డేట్స్‌తో మీ ముందుకు వ‌స్తాం“ అన్నారు. 
 
తారాగణం: ఆనంద్‌ దేవరకొండ, మానస రాధాకృష్ణన్‌
 
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫి, దర్శకత్వం: కె వి గుహన్‌
నిర్మాత: వెంకట్‌ తలారి
బేనర్‌: శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌
సంగీతం: సైమన్‌ కె. కింగ్‌