VB Entertainments Telugu Film & Tv Dairy Launch

VB Entertainments Telugu Film & Tv Dairy Launch
VB Entertainments Telugu Film & Tv Dairy Launch
వైభవంగా విబి ఎంటర్ టైన్మెంట్స్ సినీ టివి డైరి లాంచ్         
 
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ  2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ఎంటర్ టైన్మెంట్ విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబందించిన సినిమా తారల డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించారు. పలువురు సినీ నటీనటుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మా అసోసియేషన్ ప్రసిడెంట్ నరేష్, ఎపి ఎఫ్ డిసి ప్రసిడెంట్, నిర్మాత అంబికా కృష్ణా, దర్శకుడు వీరు పోట్ల, ఐజి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. 2019 కి సంబందించిన డైరీని అంబికా కృష్ణా, నరేష్ లు ఆవిష్కరించారు.
 
ఈ కార్యక్రమంలో  అంబికా కృష్ణా మాట్లాడుతూ …విష్ణు బొప్పన 2014 నుండి సినిమా రంగానికి సంబందించిన పలు కార్యక్రమాలు చేస్తూన్నాడు. టివి అవార్డులతో పాటు సినిమా రంగానికి అవార్డులు అందించే కార్యక్రమం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. తప్పకుండా విష్ణు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు. 
 
మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ .. విష్ణు బొప్పన సినిమా తరాలకు సంబందించిన వివరాలతో ప్రతి ఏడాది డైరీ వేస్తున్నాడు. నిజంగా కొత్త నటీనటులకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. దాంతో పాటు ప్రతి ఏడాది టివి రంగానికి అవార్డులు అందిస్తున్న విష్ణు ఇకపై సినిమా రంగానికి కూడా అవార్డులు అందించడం అభినందిస్తున్నాను. ఇకపై విష్ణు ప్రతి ఏడాదిలాగే ఈ డైరీ తో పాటు సినీ, టివి రంగాలకు చెందిన అవార్డులు అందించాలని కోరుకుంటున్నాను అన్నారు. 
 
విబి ఎంటర్ టైన్మెంట్ అధినేత  విష్ణు బొప్పన మాట్లాడుతూ …ఈ కార్యక్రమానికి  వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇప్పటి వరకు సినిమా టివి డైరెక్టరీని 2014 నుండి ప్రచురిస్తున్నాం. అలాగే 2014 నుండి బుల్లితెర అవార్డులు అందిస్తూ వస్తున్నాం. ఈ రోజు 2019 ఫిల్మ్ అండ్ టివి డైరెక్టరీ ని విడుదల చేసాం.  గత ఏడాది నుండి 
 వెండితెర అవార్డులను అందిస్తున్నాం ఈ ఏడాది ఆగస్టు లో ఇచ్చే అవార్డ్స్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా లాంచ్ చేసి నందుకు . నాకు సపోర్ట్ అందిస్తున్న స్పాన్సర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. వారు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి నేను ఈ కార్యక్రమాలను చేస్తున్నాను అన్నారు.