Marshal Movie Teaser Launch

Marshal Movie Teaser Launch

Marshal Movie Teaser Launch

మార్ష‌ల్ టీజ‌ర్ లాంచ్‌

ఎవిఎల్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై అభ‌య్ నిర్మించిన చిత్రం మార్ష‌ల్‌.
శ్రీ‌కాంత్‌, మేఘాచౌద‌రి, అభ‌య్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి
జైరాజాసింఘ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మంత్రి త‌ల‌సాని
శ్రీ‌నివాస్‌యాద‌వ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. మెడిక‌ల్‌,
యాక్ష‌న్‌సైంటిఫిక్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం టీజ‌ర్‌ను ఆదివారం
రామానాయుడు స్టూడియోస్‌లో లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల
స‌మావేశంలో…

త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ…హీరో మ‌రియు నూత‌న
ప్రొడ్యూస‌ర్ అభ‌య్‌కి, నూత‌న ద‌ర్శ‌కుడు జ‌య్‌కి ఈ చిత్ర యూనిట్
అంద‌రికీ ముందుగా కృత‌జ్ఞ‌త‌లు. ఎంతమంది కొత్త‌వారు వ‌స్తే అంత కొత్త
క‌థ‌లు వ‌స్తాయి. కొత్త‌వారు ఇండ‌స్ర్టీకి ఎంతో అవ‌స‌ర‌ము. ఇండ‌స్ర్టీ
కూడా కొత్త‌వారిని ఆద‌రించాలి. వారి టాలెంట్‌ని నిరూపించుకునే అవ‌కాశం
ఇవ్వాలి. అభ‌య్ తీసిన మొద‌టి చిత్రంలా లేదు. ఎంతో అనుభ‌వం ఉన్న
వ్య‌క్తిలా ఉన్నారు. డైరెక్ట‌ర్ ఎంత అద్భుత‌మైన సినిమా తీశారు అన్న‌ది
టీజ‌ర్ చూస్తే తెలిసింది. జెర్సీని కూడా కొత్త ద‌ర్శ‌కుడు తీశారు చాలా
బావుంది. కొత్త‌వాళ్ళు ఇండ‌స్ర్టీకి ఎంతో అవ‌స‌రం. ఇండ‌స్ర్టీ కూడా
ప్రాంతాల విభేదం లేకుండా ప్ర‌తిఒక్క‌రిని ఆద‌రించాలి. సినిమా ఇండ‌స్ర్టీ
అనేది ల‌క్ష‌లాదివాళ్ళ‌కి ఉపాది క‌లిగిస్తుంది. చిన్న సినిమాల‌కు
ప్ర‌మోష‌న్ ఎంతో అవ‌స‌రం అంద‌రం చిన్న సినిమాల‌ను ఆద‌రించాలి. మార్ష‌ల్
చిత్రం మంచి హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

అభ‌య్ మాట్లాడుతూ… ఒక యాక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్‌గా నేను చేసే ఈ
ప్ర‌య‌త్న వెనుక ముందునుంచి నా వెన్నంటే ఉన్న త‌ల‌సానిగారికి ప్ర‌త్యేక
కృత‌జ్ఞ‌త‌లు. శ్రీ‌కాంత్ అన్న కూడా ఈ సినిమా కోసం నా వెనకే ఉండి మంచి
బూస్ట‌ప్ ఇచ్చి చాలా క‌ష్ట‌ప‌డ్డారు. మీరు లేక‌పోతే సినిమానే లేదు అన్న
అని అన్నారు. జ‌య్‌రాజ్ త‌ను కేవ‌లం డైరెక్ట‌ర్‌గా కాకుండా త‌న సొంత
సినిమాలాగా చేశారు. ఇక హీరోయిన్ విష‌యానికి వ‌స్తే మేఘాచౌద‌రి చాలా
స్వీట్ గ‌ర్ల్‌. వెరీ హార్డ్ వ‌ర్క‌ర్ హీరోయిన్ మా యూనిట్ అంద‌రికీ
కృత‌జ్ఞ‌త‌లు. సినిమా విష‌యానికి వ‌స్తే ఇది ఒక మెడిక‌ల్ యాక్ష‌న్ మూవీ.
స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుంది. ఈ చిత్రంలో మీరు చాలా కొత్త శ్రీ‌కాంత్
గారిని చూస్తారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా క‌మ‌ర్షియ‌ల్ వాల్యూస్
ఉన్న చిత్ర‌మిది. ఎల్‌విఎల్ అనే బ్యాన‌ర్‌లో ఇక‌ముందు రాబోయే ప్ర‌తీ
చిత్రం మంచి స్ర్టాంగ్ కంటెంట్‌తో వ‌స్తాయి.  ఈ సినిమా కోసం నాకు
ఫైనాన్స్ హెల్ప్ చేసిన మా మామ‌య్య‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌లు అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ… ఒక మ‌నిషి ఇంత ఈజీగా బ్ర‌తుకుతున్నాడంటే
దానికి కార‌ణం ఒక సైంటిస్ట్‌. ఇందులోంచి వ‌చ్చిన క‌థే మార్ష‌ల్‌. న‌న్ను
న‌మ్మిన అభ‌య్‌కి థ్యాంక్స్‌. అభ‌య్ లేక‌పోతే సినిమా లేదు. అంద‌రికీ నా
కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

శ్రీ‌కాంత్ మాట్లాడుతూ… త‌ల‌సానిగారు ఎప్పుడూ ఇండ‌స్ర్టీని స‌పోర్ట్
చేస్తూనే ఉన్నారు. ముందుగా ఈ స్టోరీ నాకు అభ‌య్‌, జ‌య్ వ‌చ్చి చెప్పారు.
నేను క‌థ విన్నాక రెండురోజులు టైం అడిగాను. ఎందుకంటే ఇది చాలా
క‌మ‌ర్షియ‌ల్ మూవీ వీళ్ళు తియ్య‌గ‌ల‌రా లేదా అని అడిగాను.  కాని అభ‌య్
వ‌చ్చి నేనే ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్ కూడా అన్నారు. అప్పుడు
ఒప్పుకున్నాను. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశారు. నేను కూడా కొత్త
ద‌ర్శ‌కుడుకి అవ‌కాశం ఇవ్వాలి అనుకున్నా. నాకు చెప్పిన దానికంటే ఈ
సినిమాకోసం చాలానే ఖ‌ర్చుపెట్టారు. సినిమా చూశాక త‌ప్ప‌కుండా అంద‌రూ
మెచ్చుకుంటారు. అభ‌య్ ప్రొడ్యూస‌ర్‌, హీరోగా స‌క్సెస్ అవ్వాల‌ని
కోరుకుంటున్నాను అలాగే జ‌య్‌కి కూడా మంచి హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను
అన్నారు.

హీరోయిన్ మాట్లాడుతూ… ఈ చిత్రంతో నేను చాలా నేర్చుకున్నాను. ఇది నాకొక
మంచి ఎక్స్‌పీరియ‌న్స్ అనే చెప్పాలి. నాకు లాంగ్వేజ్ ప్రాబ్ల‌మ్
ఉన్నాకూడా మా యూనిట్‌లో ప్ర‌తిఒక్క‌రు నాకు చాలా హెల్ప్ చేశారు. అంద‌రికీ
నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ మాట్లాడుతూ… నేను మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా చాలా
సినిమాల‌కు ప‌ని చేశారు. కాని ఇంత పెద్ద సినిమాకి ఎప్పుడూ చెయ్య‌లేదు.
నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చిన మా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు నా ప్ర‌త్యేక
కృత‌జ్ఞ‌త‌లు. మా యూనిట్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

అభ‌య్‌, శ్రీ‌కాంత్‌, మేఘాచౌద‌రి, రేష్మిసింఘ్‌, సుమ‌న్‌, పృధ్విరాజ్‌,
వినోద్‌కుమార్‌, సుద‌ర్శ‌న్‌, ర‌విప్ర‌కాష్‌, ప్రియ‌ద‌ర్శినిరామ్‌,
ప్ర‌గ‌తి, శ‌ర‌ణ్య‌, క‌ల్ప‌వ‌ల్లీ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి
సంగీతంఃయాద‌గిరివ‌రికుప్ప‌ల‌, ఆర్ట్‌డైరెక్ట‌ర్ఃర‌ఘుకుల‌క‌ర్ణి,
రైట‌ర్ఃప్ర‌వీణ్‌కుమార్‌బొట్లా, కొరియోగ్రాఫ‌ర్ఃగ‌ణేష్‌,
స్టంట్స్ఃన‌బామ‌రియు సుబ్బు,
బ్యాక్‌గ్రౌండ్‌స్కోర్ఃకె.జి.ఎఫ్‌.ర‌విబాసుర్‌, ఎగ్జిక్యూటివ్
ప్రొడక్ష‌న్ః చిన్నారావ్‌దావ‌ల‌,
కాస్ట్యూమ్స్‌డిజైన‌ర్ఃసుబోధ్‌శ్రీ‌వాస్త‌వ్‌, మేక‌ప్
ఆర్టిస్ట్ఃజ‌య్‌వంత్‌థాక్రే, స్టిల్స్ః స్టీఫెన్‌,
ఎడిట‌ర్ఃచోటాకె.ప్ర‌సాద్‌, కెమెరామ్యాన్ఃస్వామీ ఆర్‌.ఎం.,  డైరెక్ట‌ర్ః
జైరాజాసింఘ్‌, ప్రొడ్యూస‌ర్ః అభ‌య్ ఆడక