సందీప్ కిష‌న్ 25వ చిత్రం `ఏ1 ఎక్స్‌ప్రెస్` ట్రైల‌ర్ విడుద‌ల‌…ఫిబ్ర‌వ‌రి 26న గ్రాండ్ రిలీజ్‌ !!

సందీప్ కిష‌న్ 25వ చిత్రం `ఏ1 ఎక్స్‌ప్రెస్` ట్రైల‌ర్ విడుద‌ల‌…ఫిబ్ర‌వ‌రి 26న గ్రాండ్ రిలీజ్‌ !!

సందీప్ కిష‌న్ 25వ చిత్రం `ఏ1 ఎక్స్‌ప్రెస్` ట్రైల‌ర్ విడుద‌ల‌…ఫిబ్ర‌వ‌రి 26న గ్రాండ్ రిలీజ్‌!!

టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 25వ చిత్రం `ఏ1 ఎక్స్‌ప్రెస్`. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ హీరో సందీప్ కిష‌న్‌కి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.

డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది.  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌ర్‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు.

`ఏ1 ఎక్స్‌ప్రెస్` ట్రైల‌ర్‌ను ఈరోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్ ఈ ట్రైల‌ర్‌లో.. భారతదేశం తరఫున ఆడాలని కలలు కనే యువ‌ హాకీ ఆటగాడిగా సందీప్ కిషన్ క‌నిపిస్తున్నారు. అత‌డి ప్రేమికురాలిగా లావణ్య త్రిపాఠి కూడా హాకీ ప్లేయ‌ర్ కావ‌డం విశేషం. ఆన్ స్క్రీన్ మీద ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది.

ట్రైలర్‌లో త‌న హాకీ స్కిల్స్‌తో సందీప్ కిష‌న్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌చ‌కితుల్ని చేశారు. ఈ సినిమా కోసం బ‌రువు త‌గ్గి సిక్స్ ప్యాక్ బాడీని సాధించాడు. ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్‌తో ఉన్న ఈ ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది.
హిప్ హాప్ తమిళ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైల‌ర్‌ని మంచి ఎలివేష‌న్ ఇచ్చింది. కెవిన్ రాజ్ విజువ‌ల్స్ ఫ్రెష్‌గా ఉండ‌డంతో పాటు ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 26న విడుద‌ల‌చేస్తున్న‌ట్లు తెలిపారు మేక‌ర్స్‌.

తారాగ‌ణం:
సందీప్ కిష‌న్‌, లావ‌ణ్యా త్రిపాఠి, రావు ర‌మేష్‌, మురళీ శ‌ర్మ‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్రియ‌ద‌ర్శి, స‌త్యా, రాహుల్ రామ‌కృష్ణ‌, మ‌హేష్ విట్టా, ర‌ఘుబాబు, అభిజిత్‌, భూపాల్‌, ఖ‌య్యుమ్‌, సుద‌ర్శ‌న్‌, శ్రీ‌రంజ‌ని, ద‌యా గురుస్వామి

సాంకేతిక బృందం:
ద‌ర్శ‌కుడు: డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను
నిర్మాత‌లు: టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం
స‌హ నిర్మాత‌: వివేక్ కూచిభొట్ల‌
మ్యూజిక్‌:  హిప్ హాప్ త‌మిళ‌
సినిమాటోగ్ర‌ఫీ: కెవిన్ రాజ్‌
ఎడిటింగ్‌: చోటా కె. ప్ర‌సాద్‌
సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి, సామ్రాట్‌
ఆర్ట్‌: అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: మ‌యాంక్ సింఘానియా, దివ్య విజ‌య్, శివ చెర్రీ, సీతారామ్‌,
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్

 
Sundeep Kishan’s 25th Film A1 Express Trailer Released, Film Releasing On February 26th

Talented hero Sundeep Kishan’s 25th film “A1 Express” is a new-age sports entertainer which is first Hockey-based film in Telugu cinema and the most ambitious project of the actor.

Lavanya Tripati is the leading lady in the film directed by debutant Dennis Jeevan Kanukolanu. TG Vishwa Prasad, Abhishek Aggarwal, Sundeep Kishan and Daya Pannem are jointly producing it under People Media Factory, Abhishek Agarwal Arts, Venkatadri Talkies banners.

A1 Express theatrical trailer has been released today and it shows Sundeep Kishan as a promising young hockey player who dreams to play for India. He has a girlfriend played by Lavanya Tripathi who too is a hockey player. The pairing looks fresh on screen.

Sundeep Kishan has mastered the sport which is observed in the trailer. He lost weight for the film and attained six pack abs. He is seen flaunting his well-shaped body in the trailer which has good action as well.

Hip Hop Tamizha’s background score sets the right mood all through. Cinematography by Kavin Raj is brilliant and production values are high in standard.

The makers have announced to release the film on February 26th.

Cast: Sundeep Kishan, Lavanya Tripati, Rao Ramesh, Murali Sharma, Posani Krishna Murali, Priyadarshi, Satya, Mahesh Vitta, Parvateesham, Abhijith,Bhupal, Khayyum, Sudharshan, Sri Ranjani, Daya Guru Swamy etc.

Technical Crew:
Director: Dennis Jeevan Kanukolanu
Producers: TG Vishwa Prasad, Abhishek Agarwal, Sundeep Kishan & Daya Pannem
Co-Producer – Vivek Kuchibhotla  
Music Director: Hip Hop Tamizha
Cinematography: Kavin Raj
Editor: Chota K Prasad
Lyrics: Ramajogayya Shastry, Samrat
Art Director: Ali
Executive Producers: Mayank Singhaniya, Divya Vijay, Siva Cherry and Seetharam
PRO: Vamsi Shekar