“నేనెవరు” అంటున్న కోలా బాలకృష్ణ!!

“నేనెవరు” అంటున్న కోలా బాలకృష్ణ!!

 

“నేనెవరు” అంటున్న కోలా బాలకృష్ణ!!

     తెలుగు-తమిళ భాషల్లో సుప్రసిద్ధులైన ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ నటిస్తున్న విభిన్న కథా చిత్రం “నేనెవరు”. కౌశల్ క్రియేషన్స్ పతాకంపై.. యువ ప్రతిభాశాలి నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు.
     కోలా బాలకృష్ణకు జంటగా సాక్షి చౌదరి నటిస్తున్న ఈ చిత్రంలో తనిష్క్ రాజన్-గీత్ షా సహాయ పాత్రలు పోషిస్తుండగా… బాహుబలి ప్రభాకర్ విలన్. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
      లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
     దర్శకనిర్మాతలు మాట్లాడుతూ…”కోలా భాస్కర్ ఎడిటింగ్ చేసిన చివరి చిత్రమిది. త్వరలో టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
     “ఆదిత్య మ్యూజిక్” ఆడియో హక్కులు సొంతం చేసుకున్న ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, ఫైట్స్: రియల్ సతీష్, పి.ఆర్.ఓ: ధీరజ్ అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: వాల్స్ అండ్ ట్రెండ్స్, పోస్ట్ ప్రొడక్షన్: ప్రసాద్ లాబ్స్, ఎడిటింగ్: కోలా భాస్కర్, సంగీతం: ఆర్.జి.సారధి,
సహనిర్మాతలు: పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి, నిర్మాతలు: భీమినేని శివప్రసాద్- తన్నీరు రాంబాబు, దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి!!