ఆయ‌న భ‌లే స‌ర‌దా మ‌నిషి.. త‌నుశ్రీ ద‌త్తా

బాలీవుడ్ మోడ‌ల్, న‌టి త‌నుశ్రీ ద‌త్తా హీరో బాల‌కృష్ణ ఎంతో స‌ర‌దా మ‌నిషి అని.. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ గురించి ఎన్నో గొప్ప విష‌యాలు చెప్పేవార‌ని అన్నారు. హీరో బాల‌కృష్ణ‌తో వీర‌భ‌ద్ర సిమాలో ఆమె న‌టించారు. వీర‌భ‌ద్ర సినిమా షూటింగ్ స‌మ‌యంలో బాల‌కృష్ణ‌గారిని మొద‌టిసారి చూసాని, ఈ సినిమా స‌మ‌యంలో 5 కిలోల వ‌ర‌కు బ‌రువు పెరిగాన‌ని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో నేను చాలా స‌న్న‌గా ఉండేదాన్ని, నా కోసం చిత్ర బృందంలో ఎవ‌రో ఒక‌రు చికెన్‌, స్వీట్లు, ఆంధ్ర భోజ‌నం తీసుకువ‌చ్చేవార‌ని దీంతో బ‌రువు పెరిగిన‌ట్లు ఆమె తెలిపారు.