Sensational Director VV Vinayak Launched “Thangedu Puvvu” Song From “Radha krishna” Movie !!

Sensational Director VV Vinayak Launched “Thangedu Puvvu” Song From “Radha krishna” Movie !!

సంగీత ద‌ర్శ‌కురాలు ఎమ్‌.ఎమ్ శ్రీ‌లేఖ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా..

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ రిలీజ్ చేసిన `రాధాకృష్ణ` చిత్రంలోని `తంగేడు పువ్వు` లిరిక‌ల్ వీడియో సాంగ్‌.

“తంగేడు పువ్వులాంటి నా బుగ్గ‌మీద నా సిందూరం పూసిండే సిల‌కో… గుళ్ళోన గంట‌లాంటి నా గొంతు మీద‌నా మౌనాలు చ‌ల్లిండే మొల‌కో..నీలాల క‌న్నుల్లో మెరుపున్నోడే మేఘాలపై నుంచి ఉరికొచ్చిండే..“అంటూ సాగే `రాధాకృష్ణ` చిత్రంలోని ఈ ఆహ్లాద‌క‌ర‌మైన పాటని సంగీత ద‌ర్శ‌కురాలు ఎమ్.ఎమ్ శ్రీ‌లేఖ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా..

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ – “ నా స్నేహితుడు శ్రీ‌నివాస‌రెడ్డి గారి నేతృత్వంలో తెర‌కెక్కుతోన్న మూవీ `రాధాకృష్ణ`. తెలంగాణలో నిర్మ‌ల్ ప్రాంతం బొమ్మ‌ల‌కు చాలా ఫేమ‌స్‌, అక్క‌డి నిర్మ‌ల్ బొమ్మ నేప‌థ్యంలో ఒక మంచి ల‌వ్ స్టోరీని అళ్లి తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు ప్ర‌సాద్ వ‌ర్మ‌. ప్ర‌సాద్ వ‌ర్మ‌కి శ్రీ‌నివాస‌రెడ్డి గారి ద‌గ్గ‌ర ప‌నిచేసిన అనుభ‌వం ఉంది. నిర్మ‌ల్ ప‌రిస‌ర ప్రాంతాలు, కుంటాల లాంటి అంద‌మైన లొకేష‌న్స్ లో అద్భుతంగా పిక్చ‌రైజ్ చేశారు. ప్రొడ్యూస‌ర్‌గా పుప్పాల సాగ‌రిక గారు మంచి అభిరుచితో సినిమా తీశారు. నిర్మాణ సార‌థి కృష్ణ‌కుమార్ చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా ప్లాన్ చేశారు. ‌`తంగేడు పువ్వులాంటి` సాంగ్ వింటుంటే ఈ క‌థ‌లో బొమ్మ‌ల‌కు ఎలాంటి సంగీతం ఉండాలో అలా మ‌న‌సులోంచి వ‌చ్చిన సాంగ్ లా అనిపించింది. హీరో అనురాగ్ కి ఈ సినిమాతో మంచి పేరు రావాలి. వాళ్ల నాన్నగారు చాలా ఆనందించాలి, మంచి భ‌విష్య‌త్ ఉండాల‌ని కోరుకుంటున్నాను. శ్రీ‌నివాస‌రెడ్డి గారు సెంటిమెంట్‌గా అన్నీ నాతోనే చేయిస్తుంటారు. వారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌స్తోన్న ఈ మూవీ పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను. అలాగే మా ఎమ్‌.ఎమ్ శ్రీ‌లేఖ‌గారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర స‌మ‌ర్ప‌కులు శ్రీనివాస‌రెడ్డి, సంగీత ద‌ర్శ‌కురాలు ఎమ్. ఎమ్ శ్రీ‌లేఖ‌, చిత్ర నిర్మాణ సార‌థి పుప్పాల కృష్ణ‌కుమార్, హీరో అనురాగ్‌, ద‌ర్శ‌కుడు టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ‌, రాథోడ్ రాం నాయ‌క్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
నిర్మాణ సార‌థి కృష్ణ కుమార్ మాట్లాడుతూ – “ముందుగా మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎమ్. ఎమ్ శ్రీ‌లేఖ గారికి మా టీమ్ అంద‌రి త‌ర‌పున పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. అలాగే `తంగేడు పువ్వులాంటి` సాంగ్ ని విడుద‌ల చేసిన సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వి.వి. వినాయ‌క్ గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఇప్ప‌టికే విడుద‌లైన కొట్టు కొట్టు సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇప్పుడు ఈ పాట‌కు మ‌రింత మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. ఇంత మంచి సాహిత్యాన్ని అందించిన అనంత్ శ్రీ‌రామ్ గారికి, అంతే అందంగా పాడిన ఎమ్. ఎల్ శృతిగారికి నా ద‌న్య‌వాదాలు.“ అన్నారు.
ప్ర‌ముఖ ద‌ర్శకుడు `ఢ‌మ‌రుకం` ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌వుతున్నాయి.

అనురాగ్‌, ముస్కాన్ సేథీ(పైసా వ‌సూల్ ఫేమ్‌), అలీ, కృష్ణ భ‌గ‌వాన్‌, అన్న‌పూర్ణ‌మ్మ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ: సురేంద‌ర్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ‌, ఎడిటింగ్‌: డి.వెంక‌ట‌ప్ర‌భు, ఆర్ట్: వి. ఎన్ సాయిమ‌ణి, స‌మ‌ర్ప‌ణ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: శ్రీనివాస రెడ్డి, నిర్మాణ సార‌థ్యం: కృష్ణ కుమార్‌, నిర్మాత‌: పుప్పాల సాగ‌రిక‌, కృష్ణకుమార్, ద‌ర్శ‌క‌త్వం: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ‌.

Here It Is! A Beautiful Melody #TangeduPuvvu Lyrical Video From #RadhaKrishna Out Now

►https://t.co/P7laRo7zY2

Music by @mmsreelekha
Lyrics by #AnantaSriram
Sung by #MLSruthi

#Anurag #MusskanSethi
#PuppalaSagarika #PrasadVarma #SreenivassRedde @baraju_SuperHit @adityamusic