`అరుంధ‌తి-2` లో పాయ‌ల్ రాజ్ పుత్!!

`అరుంధ‌తి-2` లో పాయ‌ల్ రాజ్ పుత్!!

`అరుంధ‌తి-2` లో పాయ‌ల్ రాజ్ పుత్!!

 
 
 శ్రీ శంఖుచ‌క్ర ఫిలింస్ ప‌తాకంపై  పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌ధాన పాత్ర‌లో  కోటి తూముల నిర్మిస్తోన్న చిత్రం `అరుంధ‌తి-2`.  చారిత్రాత్మ‌క నేప‌థ్యంతో కూడిన క‌థాంశంతో  భారీ బ‌డ్జెట్ తో , భారీ  గ్రాఫిక‌ల్ చిత్రంగా  ప్ర‌ముఖ  నిర్మాణ సంస్థ‌ల సంయుక్త భాగ‌స్వామ్యంలో ఈ చిత్రం  రూపొందుతోంది.  ఈ సంద‌ర్బంగా   చిత్రం గురించి నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ…“ చారిత్రాత్మ‌క ,యూనివ‌ర్శల్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్ పుత్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన  ప్ర‌ముఖ తార‌లు న‌టిస్తున్నారు. పాన్ ఇండియా  చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ విజువైలైజేష‌న్ గ్రాఫిక‌ల్ వ‌ర్క్స్ హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్నాయి. క‌థాంశంలో భాగంగా హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్ , గుర్ర‌పుస్వారీ, క‌త్తి సాముల‌కు సంబంధించిన శిక్ష‌ణ హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ వ‌ద్ద‌ తీసుకుంటోంది.  అతి త్వ‌ర‌లో షూటింగ్ ప్రారంభించ‌బోయే ఈ చిత్రానికి సంబంధించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు అధికారికంగా వెల్ల‌డిస్తాం“ అన్నారు