రవితేజ, సుధీర్ వర్మ, అభిషేక్ నామా ‘రావణాసుర’ రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం !!

రవితేజ, సుధీర్ వర్మ, అభిషేక్ నామా ‘రావణాసుర’ రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం !!

రవితేజ, సుధీర్ వర్మ, అభిషేక్ నామా ‘రావణాసుర’ రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభం !!

మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న `రావణాసుర` సినిమాను సంక్రాంతి ప‌ర్వ‌దినం రోజున మెగాస్టార్ చిరంజీవి మ‌రియు ఇతర అతిథుల‌ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక నుండి `రావణాసుర`పాలన ఆరంభం కానుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ప్రస్తుతం కీల‌క తారాగ‌ణంపై  నైట్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు.

రవితేజ ఈ చిత్రంలో న్యాయవాదిగా కనిపించబోతోన్నారు. రామ్ పాత్రలో సుశాంత్ ముఖ్యమైన రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఐదు పాత్రల‌కు కూడా మంచి ప్రాముఖ్యత ఉండ‌నుంది.

రచయితగా శ్రీకాంత్ విస్సా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు. ఆయనే ఈ సినిమాకు కథను అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు. పోస్టర్‌ను బట్టే మనకు ఆ విషయం అర్థమవుతోంది.

ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

నటీనటులు : రవితేజ, సుశాంత్, అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్,  మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహత (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు

సాంకేతిక బృందం

డైరెక్టర్: సుధీర్ వర్మ
నిర్మాత: అభిషేక్ నామా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్:  శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్: హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్
డీఓపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: శ్రీకాంత్
ప్రొడక్షన్ డిజైనర్: డీఆర్‌కే కిరణ్
సీఈఓ:  పోతిని వాసు
మేకప్ చీఫ్:  ఐ శ్రీనివాస్ రాజు
పీఆర్వో : వంశీ-శేఖర్

Ravi Teja, Sudheer Varma, Abhishek Nama’s Ravanasura Rule Begins On Sets

Mass Maharaja Ravi Teja and Creative director Sudheer Varma’s unique action thriller Ravanasura was launched grandly on Sankranthi with megastar Chiranjeevi attending it as a chief guest. The Ravanasura rule begins, as the team begun its regular shoot. Night sequences are currently being shot.

Ravanasura is being mounted on a massive scale by Abhishek Nama under Abhishek Pictures and RT Teamworks. The makers recently announced to release Ravanasura on September 30th, 2022.

Ravi Teja plays a lawyer, while Sushanth will be seen a crucial role as Ram in the film. Ravanasura will star a total of five heroines- Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar and Poojitha Ponnada. All the heroines will have equal importance in the movie.

Srikanth Vissa who’s associated with few exciting projects as a writer has penned a powerful and a first of its kind story for the movie. Known for his stylish and exceptional taking expertise, Sudheer Varma will be presenting Ravi Teja in a never seen before role in the movie.

Some prominent actors and noted craftsmen are part of the project. Harshavardhan Rameswar and Bheems together provide music for the film, while Vijay Kartik Kannan handles the cinematography and Srikanth is the editor.

Cast: Ravi Teja, Sushanth, Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar, Poojitha Ponnada, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Nitin Mehta (Akhanda fame), Satya, Jaya Prakash and others.

Technical Crew:
Director: Sudheer Varma
Producer: Abhishek Nama
Banner: Abhishek Pictures, RT Teamworks
Story, Screenplay & Dialogues: Srikanth Vissa
Music: Harshavardhan Rameswar, Bheems
DOP: Vijay Kartik Kannan
Editor: Srikanth
Production Designer: DRK Kiran
CEO: Potini Vasu
Makeup Chief: I Srinivas Raju
PRO: Vamsi-Shekar