‘నితిన్, కీర్తి సురేష్‘ ల ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల !!

‘నితిన్, కీర్తి సురేష్‘ ల ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల !!

    విడుదలకు రంగులద్దుకుంటున్న ‘రంగ్ దే’
    యూత్ స్టార్ ‘నితిన్, కీర్తి సురేష్‘ ల ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల 
  ‘రంగ్ దే’ ప్రచార సంబరాలు షురూ…!
 
యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ’ సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రంగ్ దే’. ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. గత నాలుగు రోజులుగా చిత్రంలోని ఓ గీతానికి  సంభందించిన దృశ్యాలు చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తి చేసుకున్నది ఈ చిత్రం.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి  2021 మార్చి 26న ధియేటర్ లలో ‘ రంగ్ దే’ సంబరాలు షురూ అవుతాయని తెలిపారు. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు ‘వెంకీ అట్లూరి’.యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుంది. ఇటీవల ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన దృశ్యాలతో కూడిన వీడియో, అలాగే ఓ గీతం బహుళ ప్రేక్షకాదరణ పొందిన విషయం విదితమే. 
 ‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రం ఈ  ‘రంగ్ దే’. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా  ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 
 
నితిన్,కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి  డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:  ఎస్.వెంకటరత్నం(వెంకట్)
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశీ
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి
 
Rang De prepares itself for a colourful release. 
 Youth star ‘Nithin’, Keerthy Suresh starrer Rang De is all set to release on 26th March.
 The promotion festivities for Rang De have been kicked off.
 
‘Rang De’ is the first movie with the combination of Youth Star ‘Nithin’and  ‘Mahanati’ Keerthy Suresh which is being bankrolled  by Sithara Entertainments.
 
In the past 4 days,  Rang De team have completed the shoot of a song in the movie. Currently the post production process is underway.
 
The producer of the movie, Surya Devara Naga Vamshi has announced that the audience can celebrate ‘Rang De’ in theaters from March 26th 2021. The director Venky Atluri has conveyed that this movie can be enjoyed thoroughly with the whole family. He also expressed that the chemistry of the lead couple Nithiin and Keerthy Suresh would mesmerize everyone. It is also worthy of note that the recently released lyrical video of the song along with a few pictures from the movie have received immense popularity within a very short span.
 
After expertly crafting the love genre with ‘Tholi Prema’ and ‘Mr.Majnu’, highly skillful and  young Director, Venky Atluri, has been entrusted with the role of directing this movie by producer ‘Suryadevara Nagavamsi’.
 
Apart from the lead pair of Nithin and Keerthy Suresh, prominent actor Naresh,  Kousalya, Rohini,Bramhaji, Vennela Kishore,Vineeth, Gayithri raghuram,  Satyam Rajesh, Abhinav Gomatam and  Suhas play pivotal characters in the movie.
Dop- P.C Sreeram
Music- Devi Sri Prasad
Editing- Naveen Nooli
Art- Avinash Kolla
Additional Screenplay- Satish Chandra Pasam
Executive Producer – S. Venkatarathnam (Venkat)
PRO: LakshmiVenugopal 
Presented by PDV Prasad
Produced by Suryadevara Nagavasmi
Written and Directed by Venky Atluri.