‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ హీరో రమణ్‌ రెండో ప్రాజెక్ట్!!

‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ హీరో రమణ్‌ రెండో ప్రాజెక్ట్!!

‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ హీరో రమణ్‌ రెండో ప్రాజెక్ట్!!
 
‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ అనే టైటిల్‌తోనే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్న హీరో రమణ్‌. తొలి సినిమా రిలీజ్‌కి ముందే రెండో సినిమాను అనౌన్స్ చేశారు. రమణ్‌ హీరోగా భవిష్య విహార్‌ చిత్రాలు సంస్థ తమ డెబ్యూ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనుంది. ఈ చిత్రాన్ని రామకృష్ణ వట్టికూటి సమర్పిస్తున్నారు. అరుణ్‌ చందర్‌ వట్టికూటి నిర్మిస్తున్నారు. వర్ష విశ్వనాథ్‌ నాయికగా నటిస్తున్నారు. రమణ్‌, వర్ష విశ్వనాథ్‌ కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇది. రామచంద్ర వట్టికూటి స్టోరీ, స్క్రీన్‌ప్లే రాసి డైరక్షన్‌ చేస్తున్నారు.
ఈ చిత్రం గురించి నిర్మాత అరుణ్‌ చందర్‌ వట్టికూటి మాట్లాడుతూ ”ప్రీ ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే షూటింగ్‌కి వెళ్తున్నాం. త్వరలోనే టైటిల్‌ని కూడా అనౌన్స్ చేస్తాం” అని అన్నారు.
దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ ”తొలి సినిమా టైటిల్‌తోనే క్రేజ్‌ సంపాదించుకున్న హీరో రమణ్‌. ఆయనకు సూట్‌ అయ్యే కథతో, యూత్‌ఫుల్‌ నెరేషన్‌తో అట్రాక్టివ్‌ ప్యాక్డ్ మూవీని ప్లాన్‌ చేస్తాం. త్వరలోనే కలర్‌ఫుల్‌ డీటైల్స్ ని రివీల్‌ చేస్తాం” అని చెప్పారు.

నటీనటులు
హీరో రమణ్‌, హీరోయిన్‌ వర్ష విశ్వనాథ్‌,  జెమిని సురేష్‌, జబర్దస్త్ త్రినాథ్‌, చరణ్‌, కిరణ్మయి, గోవింద్‌ రాజు తదితరులు

సాంకేతిక నిపుణులు
కెమెరా: భరద్వాజ్‌
ఎడిటింగ్‌: లోకేష్‌ కుమార్‌ కడలి
ఆర్ట్: ఫణి శివమునుభర్తి
పీఆర్వో: మోహన్‌ తుమ్మల
కో డైరక్టర్‌:  గోపాల్‌
పర్యవేక్షణ: ఎల్లారెడ్డి
స్టోరీ – స్క్రీన్‌ప్లే- డైరక్షన్‌: రామచంద్ర వట్టికూటి