Rajdooth hero Megansha interview

Rajdooth hero Megansha interview

Rajdooth hero Megansha interview

శ్రీహరి చిన్నకొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం “రాజ్ దూత్”. అర్జున్, కార్తీక్ అనే ఇద్దరు దర్శకుల సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సత్తిబాబు నిర్మిస్తున్నారు. మేఘాంశ్ సరసన నక్షత్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీ కోసం.

 

హీరోగా మీ మొదటి సినిమా “రాజ్ దూత్” విశేషాలు చెప్పండి?
అవును, హీరోగా ఇది నా మొదటి సినిమా, ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. మండుటెండల్లో చిత్రీకరణ చేశాం. నిర్మాత కూడా ఈ చిత్ర నిర్మాణం కొరకు చాలా కష్టపడ్డారు.

 

చిత్రాన్ని చాలా రహస్యంగా చిత్రీకరించారు కారణం?
కేవలం ఒత్తిడి తగ్గించడానికే సినిమా షూటింగ్ ఎటువంటి ప్రచారం లేకుండా రహస్యంగా చిత్రీకరించడం జరిగింది.

 

సినిమాపై ప్యాషన్ తోనే హీరో అయ్యారా?
చిత్ర పరిశ్రమకు చెందిన కుటుంబంలో పుట్టి పెరిగినవాడిగా, సినిమాపై ఫ్యాషన్ ఉంది. అలాగే నాన్న కూడా ఓ సందర్భంలో చిన్నవాడిని యాక్టర్ ని,పెద్దవాడిని డైరెక్టర్ ని చేస్తాను అన్నారు. దానితో ఆయన కోరిక మేరకు కూడా హీరో అయ్యాను.

 

రాజ్ దూత్ టైటిల్ గురించి ఏమైనా చెవుతారా?
చాలా మంది అడుగుతున్న ప్రశ్నఇది. ఈ మూవీలో హీరో తనకిష్టమైన రాజ్ దూత్ బైక్ కోసం, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ పై అన్వేషిస్తూ ఉంటాడు.

 

రాజ్ దూత్ రోడ్ జర్నీ లో సాగే థ్రిల్లర్ మూవీ నా?
సినిమాలో కొంత భాగం రోడ్ జర్నీలో సాగుతుంది, ఐతే ఇది థ్రిల్లర్ మూవీ కాదు, రెండు మూడు,విభిన్న జోనర్స్ లో సాగే ఓ వైవిధ్యమైన కమర్షియల్ చిత్రం అని చెప్పవచ్చు.

 

మీరు హీరో అవుతున్నారంటే మీ అమ్మ గారు ఎలా స్పందించారు?
అమ్మ చాలా సంతోషించారు, అలాగే సినిమా ఎలా వస్తుందో అని కొంచెం కంగారుకూడా పడ్డారు. ఐతే నేను సినిమాను అమ్మకు చూపించాను,ఆమెకు చాలా బాగా నచ్చింది.

 

మీ నాన్న గారి నటనలో మీకు నచ్చిన కోణం ఏమిటి?
ఆయన నటనలో ప్రతి కోణం నాకు నచ్చుతుంది, ఎమోషనల్ అయినా,యాంగ్రీ సన్నివేశాలలోనైనా ఆయన నటన చాలా బాగుంటుంది.

 

నటనలో శిక్షణ తీసుకున్నారా?
సినిమాకి ముందు కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నాను. అలాగే స్కూల్ ఏజ్ నుండి ధియేటర్ డ్రామాలలో నటించిన అనుభవం కూడా ఉంది.

 

కెమెరా ముందు మొదటి అనుభవం ఎలా అనిపించింది?
మొదట్లో కొంత కంగారుపడ్డాను, తరువాత మెల్లగా అలవాటు పడ్డాను.

 

ఇండస్ట్రీ నుండి మీకు అందిన సపోర్ట్ గురించి చెబుతారా?
ఇండస్ట్రీ మాపై చాలా అభిమానం, ప్రేమా చూపించింది. ధరమ్ తేజ్ అన్న, అలాగే మంచు మనోజ్ అన్న కాల్ చేసి మరి అభినందించారు.

 

నాన్నగారి సినిమాలలో మీకు నచ్చిన చిత్రం?
చాలా ఉన్నాయి. భద్రాచలం,ఢీ, నువ్వులేక నేను లేను సినిమాలంటే చాలా ఇష్టం.

 

ఈ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పండి?
అర్జున్,కార్తీక్ డైరెక్టర్ సుధీర్ వర్మ దగ్గర పనిచేశారు. వీళ్లద్దరి మధ్య వర్క్ కో ఆర్డినేషన్ బాగుంటుంది. వీళ్ళ మధ్య విబేధాలు వచ్చి సినిమా ఎక్కడ ఆగిపోతుందో అని భయం వేసింది. అలా ఏం కాకుండా ఇద్దరు చిత్రాన్ని పూర్తి చేశారు.(నవ్వుతూ)

 

మూవీలో జర్నీ ప్రధానంగా సాగుతుందా?
ఈ చిత్రంలో కామెడీ,ఎమోషన్స్ లవ్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. జర్నీ కేవలం చిత్రంలో ఒక భాగం మాత్రమే.