ఘనంగా “వకీల్ సాబ్” ‘మగువా ఇది నీ విజయం’ కార్యక్రమం

ఘనంగా “వకీల్ సాబ్” ‘మగువా ఇది నీ విజయం’ కార్యక్రమం

ఘనంగా “వకీల్ సాబ్” ‘మగువా ఇది నీ విజయం’ కార్యక్రమం

‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ లెటెస్ట్ బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్”. శ్రీ
వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మాతలుగా
శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “వకీల్ సాబ్” తెరకెక్కింది. శృతి హాసన్,
నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.
ఏప్రిల్ 9న తెరపైకి వచ్చి బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తోంది “వకీల్
సాబ్” మూవీ. మహిళలు మెచ్చిన ఈ సినిమా విజయోత్సవాన్ని ‘మగువా ఇది నీ విజయం
పేరుతో హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు
వివిధ రంగాల్లో పేరు పొందిన మహిళలు పాల్గొన్నారు. న్యాయమూర్తి ఉదయ గౌరి,
దర్శకురాలు నందినీ రెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు.

న్యాయమూర్తి ఉదయ గౌరి మాట్లాడుతూ….30 ఏళ్లుగా న్యాయమూర్తిగా పని
చేస్తున్నాను. ఎన్నో కేసులను చూశాను. ప్రతి కేసూ ప్రత్యేకమైన నేపథ్యం
కలిగి ఉండేది. నేను ఉస్మానియాలో చదువుకున్నాను. అప్పుడు చాలా అల్లరి చేసే
అమ్మాయిని. నేను న్యాయశాఖలోకి వచ్చినప్పుడు మా ప్రొఫెసర్స్ ఈ అమ్మాయి
ఒక్కచోట కుదురుగా కూర్చోగలదా అని సందేహించారు. ఆ తర్వాత నేను జడ్జిగా
స్థిరపడిన తర్వాత మా యూనివర్సిటీ విద్యార్థులను ఫీల్డ్ విజిట్ కోసం నా
కోర్ట్ కు తీసుకొచ్చారు. మహిళలకు మనలో ఉన్న శక్తి మనకు తెలియదు. కానీ
చేయాలనుకుంటే ఎంతటి కష్టమైన పని అయినా మనం చేయగలం. నేను జడ్జ్ గా బెంచ్
లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు, లాయర్స్ అంతా భయపడేవారు. అమ్మాయిలు మీకు
నచ్చిందే చేయాలి, ఎవరి ఒత్తిడికి ప్రలోభాలకు లొంగకూడదు. ఎవరైనా మీ పట్ల
తప్పు చేశారని అనిపిస్తే ధైర్యంగా నిలదీయాలని చెప్పే చిత్రమే వకీల్ సాబ్.
ఇలాంటి సినిమా తెరపైకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అన్నారు.

దర్శకురాలు నందినీ రెడ్డి మాట్లాడుతూ…శ్రీరామ్ వేణు, నిర్మాత దిల్ రాజు
అండ్ ఎంటైర్ టీమ్ కు వకీల్ సాబ్ సూపర్ హిట్ అయినందుకు కంగ్రాట్స్. వకీల్
సాబ్ సినిమాను నేను ఇక్కడ పొగడాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా
వస్తుందంటే ఫ్యాన్స్ విపరీతంగా ప్రచారం చేసుకుంటారు. ఒకరు మరో పది మందికి
చెబుతారు. నేను పవన్ గారిని ఒకేసారి కలిశాను. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్
ను. అలా మొదలైంది రిలీజ్ అయ్యాక, పవన్ గారిని విదేశాల్లో ఉన్నప్పుడు
ఒకసారి అనుకోకుండా కలిశాను. ఒక కామన్ ఫ్రెండ్ పవన్ గారు ఇక్కడే ఉన్నారని
చెబితే భయ భయంగా వెళ్లి కలిశాను. ఆయన ఎంత మర్యాదగా మాట్లాడరంటే అది
మర్చిపోలేను. నేను ఒక సినిమా చేసిన దర్శకురాలిని మాత్రమే. కానీ ఎంతో
గౌరవం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తప్పితే మిగతా వారంతా పవన్ కళ్యాణ్
గారిలా ప్రవర్తిస్తుంటారని నేను ఫ్రెండ్స్ తో చెబుతుంటాను. ఆయన ఎంత
సాదాసీదాగా ఉంటారో చూస్తే తెలుస్తుంది. ఆయన గ్రేట్ హ్యూమన్ బీయింగ్.
వకీల్ సాబ్ సినిమా పవన్ గారు  చేస్తున్నారంటే చాలా సంతోషించాను. ఇలాంటి
సినిమా పెద్ద స్టార్ చేస్తే ఎంత రీచ్ అవుతుందో తెలుసు. వేణు డైరెక్ట్
చేస్తున్నాడంటే ఇంకా ఆనందించాను. ఆయనే కరెక్ట్ ఈ కథను డైరెక్ట్ చేయడానికి
అనుకున్నా. వేణు కూడా మహిళలను చాలా గౌరవిస్తాడు. చాలా మందిని ఇన్ స్ఫైర్
చేసే కథ ఇది. ఇలాంటి కథాంశం దొరకడం అరుదు. సినిమా చూస్తున్నంత సేపూ
ప్రేక్షకులు స్ఫూర్తి పొందారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అద్భుతంగా
తెరకెక్కించారు. కథ ఎక్కడా దారి తప్పకుండా కమర్షియల్ అంశాలు చేర్చుతూ
శ్రీరామ్ వేణు సూపర్బ్ గా చూపించారు. వేణు లాంటి దర్శకుడికి కమర్షియల్
హిట్ రావాలి. థమన్ ఇంటర్వ్వూలు చూశాను. నేను చేసిన మ్యూజిక్ సరిపోలేదు
అని ఆయన చెప్పడం సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో చెబుతుంది. ఉగాది పండగ టైమ్
ఇది. థియేటర్లోనూ పండగ వాతావరణ నెలకొంది. వకీల్ సాబ్ చిత్రాన్ని మరింత
పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

నాయిక అనన్య మాట్లాడుతూ….ప్రతిసారీ ఈ మూవీలో పనిచేసినట్లు మాట్లాడాను.
కానీ ఈ కార్యక్రమంలో మాత్రం ఒక మహిళగా మాట్లాడాలి అనుకుంటున్నాను. ఆ రోజు
ఆ అమ్మాయి ధైర్యం చేయకుంటే మరో నిర్భయలా, దిశలా అయి ఉండేదని ఈ సినిమాలో
ఒక డైలాగ్ ఉంటుంది. వకీల్ సాబ్ సినిమా చూసి ఏ ఒక్క అమ్మాయినై  ధైర్యంగా
తనకు ఎదురైన సమస్యపై పోరాడేందుకు ముందుకు వస్తే, ఏ ఒక్క అబ్బాయి అయినా
తనకు అమ్మాయిల పట్ల ఉన్న చెడు ఆలోచనలు మార్చుకుంటే సినిమా చేసిన పర్పస్
నెరవేరినట్లే. పవన్  గారు, రాజు గారు, వేణు గారు చేసిన ప్రయత్నం సఫలం
అయినట్లే. అన్నారు.

నాయిక అంజలి మాట్లాడుతూ….వకీల్ సాబ్ సినిమా గురించి చాలా మాట్లాడాం.
మేము చెప్పిన దానికంటే ఇంకా సినిమాలో ఎక్కువే ఉందని ఇప్పుడు
ప్రశంసిస్తున్నారు. వకీల్ సాబ్ లో మేము చెప్పిన అంశాలు చాలా అవసరం. పవన్
కళ్యాణ్ గారు ఈ సినిమా చేయడం వల్ల లక్షలు, కోట్ల మందికి కథలోని మెసేజ్
వెళ్లింది. దర్శకుడు శ్రీరామ్ వేణు గారు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్
చేశారు. దిల్ రాజు గారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్. ఆయనకు ముందే తెలుసు ఈ
సినిమా ఆడుతుందని. వకీల్ సాబ్ సక్సెస్ టీమ్ వర్క్. అందరికీ పేరు పేరునా
థాంక్స్. ప్రతి ఒక్కరికీ అప్రిషియేట్ చేస్తున్న ఆడియెన్స్ కు థాంక్స్.
అన్నారు.

దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ…మగువా ఇది నీ విజయం అని వకీల్ సాబ్
సక్సెస్ మీట్ కు పేరు పెట్టాం. ప్రతి సినిమా కష్టపడే చేస్తాం. అది ఎవరికి
రీచ్ అవ్వాలో వాళ్లకు అయినప్పుడు మంచి విజయంతో పాటు సంతృప్తి లభిస్తుంది.
వకీల్ సాబ్ సక్సెస్ మహిళలు అందించింది. అందుకే వారి పేరు మీద సక్సెస్
మీట్ జరుపుతున్నాం. ఈ చిత్రంలో చెప్పిన మంచిని మీరు నిజ జీవితంలోకి
స్వీకరిస్తే చాలా సంతోషిస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ
థాంక్స్. అన్నారు.