ఉగాది కానుక‌గా విక్టరి వెంకటేష్ `నార‌ప్ప` చిత్రం నుండి ఫ్యామిలి పోస్ట‌ర్ విడుద‌ల‌

ఉగాది కానుక‌గా విక్టరి వెంకటేష్ `నార‌ప్ప` చిత్రం నుండి ఫ్యామిలి పోస్ట‌ర్ విడుద‌ల‌

ఉగాది కానుక‌గా విక్టరి వెంకటేష్ `నార‌ప్ప` చిత్రం నుండి ఫ్యామిలి పోస్ట‌ర్ విడుద‌ల‌

విక్టరి ఇంటి పేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా,మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ ప‌తాకాల‌పై  స్టార్ ప్రొడ్యూసర్స్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య `సుందరమ్మ`గా తెలుగు వారికి  చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌ గ్లిమ్స్‌, పోస్టర్స్‌తో పాటు ‌విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు  ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కాగా ఈ రోజు (ఏప్రిల్ 13) తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది పండుగ‌ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని నార‌ప్ప ఫ్యామిలీతో కూడిన స్పెష‌ల్ ఫ్యామిలి పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. తెలుగు వారి సాంప్రదాయ వస్త్రధారణ పంచెక‌ట్టులో విక్ట‌రి వెంక‌టేష్ న‌డిచివ‌స్తోన్న ఈ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

విక్టరి వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు,
సంగీతం: మణిశర్మ,
ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌,
ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌,
కథ: వెట్రిమారన్‌,
స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్,
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌,
లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం,
ఫైనాన్స్‌ కంట్రోలర్‌: జి.రమేష్‌రెడ్డి,
ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రామబాలాజి డి.,
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏపీ పాల్ పండీ,
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్ డొంకాడ,
కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్‌
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

 
Traditional Family Poster From Victory Venkatesh’s ‘Narappa’ Is Released On The Auspicious Day Of Ugadi

Suresh Productions Pvt Ltd and V Creations banners joint Production is ‘Narappa’ starring Venkatesh who has made ‘Victory’ as his household name in Sreekanth Addala’s Direction who is known for making Heart touching feel good films. Star Producer Suresh Babu and Kalaippuli S Thanu are jointly Producing this big budgeted film. National Award Winning Actress who always choose different roles, Priyamani is playing the role of  Sundaramma, wife of Narappa in this film. Her role will be remembered for a longtime by Telugu audience. First Glimpse and Posters released so far have garnered terrific buzz about the film. Teaser which was released on the occasion of Victory Venkatesh’s Birthday received rave response from all corners. The film has completed its shooting part already and is currently undergoing it’s post-production works.

The Makers released a special poster on the auspicious day of Ugadi today (April 13). The poster features Narappa and Family showcasing the affection the family shares with each other. Venkatesh is seen in traditional Telugu attire as a head of the family accompanied by his wife Sundaramma played by Priyamani and Son played by Karthik Ratnam. The poster is getting very good response.

Victory Venkatesh starrer ‘Naarappa’ has Priyamani, Karthik Ratnam, Rao Ramesh, Rajeev Kanakala as principal cast

Cinematography: Syam K Naidu, Music: Mani Sharma, Editor: Marthand K Venkatesh, Art: Gandhi Nadikudikar, Story: Vettrimaran, Script Consultant: Satyanand, Fights: Peter Heins, Vijay, Lyrics: Sirivennela Seetharama Sastry, Suddala Ashok Teja, Anantha Sreeram, Krishnakanth, Kasarla Shyam, Finance Controller: G. Ramesh Reddy, Production Controller: Ramabalaji D, Production Executive: AP Paul Pandi, Executive Producer: Vijay Shankar Donkada, Co-Producer: Devi Sridevi Satish,
Produced by D. Suresh Babu, Kalaippuli S. Thanu
Directed by Sreekanth Addala