గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో నిఖిల్ !!

గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌క‌త్వంలో  హీరో నిఖిల్ !!

నిఖిల్ హీరోగా  గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌క‌త్వంలో రెడ్ సినిమాస్ ప‌తాకంపై యాక్షన్ స్పై సినిమా ప్రారంభం !!

యంగ్ హీరో నిఖిల్ కెరీర్‌లో 19వ చిత్రాన్ని గ్యారీ బీహెచ్ (గూఢచారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్) దర్శకత్వంలో రాబోతోంది. రెడ్ సినిమాస్ ప‌తాకంపై కే రాజశేఖర్ రెడ్డి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
చరణ్ తేజ్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  ఈ రోజు (అక్టోబ‌రు 8) ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

ప్ర‌ముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందించారు. సినిమా సక్సెస్ అవ్వాలని చిత్రయూనిట్‌కు విషెస్ అందజేశారు.

ముహుర్తం షాట్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా నిర్మాత రాజశేఖర్ రెడ్డి క్లాప్ కొట్టారు. నిర్మాత కూతురు మ‌రియు కొడుకు ఈశన్వి, ధృవ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించేందుకు మేకర్స్ సిద్దమయ్యారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఫిక్స్ కాలేదు. విభిన్న పాత్రల్లో నటిస్తూ వస్తోన్న నిఖిల్ మొదటిసారిగా గూఢాచారి (స్పై) పాత్రలో నటిస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నారు.

అక్టోబర్ 8 నుంచి హైద్రాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. డైరెక్టర్ గ్యారీ బీహెచ్ స్వతాహాగా ఎడిటర్‌ కావడంతో ఈ సినిమాకు కూడా ఎడిటింగ్ బాధ్యతలను తీసుకున్నారు. మనోజ్ రెడ్డి కెమెరామెన్‌గా, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు.

అనిరుధ్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి రచయిత. అర్జున్ సురిశెట్టి ఆర్ట్ డైరెక్టర్‌గా, రవి ఆంటోని ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు : నిఖిల్ సిద్దార్థ, ఐశ్వర్యా మీనన్

సాంకేతిక బృందం

దర్శకుడు, ఎడిటర్ : గ్యారీ బీహెచ్
నిర్మాత : కే రాజశేఖర్ రెడ్డి
స‌హ‌- నిర్మాత‌ : చరణ్ తేజ్
సమర్పణ : రెడ్ సినిమాస్
రచయిత : అనిరుధ్ కృష్ణమూర్తి
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్ : అర్జున్ సురిశెట్టి
ప్రొడక్షన్ డిజైనర్ : రవి ఆంటోని
పీఆర్వో : వంశీ-శేఖర్

Nikhil, Garry BH, Red Cinema’s Action Spy Film Launched

Young and promising hero Nikhil Siddhartha’s 19th film to be directed by Pacy editor Garry BH of Goodachari, Evaru and HIT fame and produced by K Raja Shekhar Reddy on Red Cinemas with Charan Tej as CEO has been launched today with pooja ceremony.

Producer Sharrath Marar, director Srikanth Addala and producer Gemini Kiran who graced the occasion have handed over the film’s script to the makers and wished them all the success.

Producer Raja Shekhar Reddy sounded the clapboard, while his kids Eshanvi and Dhruv switched on the camera for the muhurtham shot directed by Garry BH.

Iswarya Menon is roped in as the leading lady opposite Nikhil in this yet to be titled flick billed to be a complete action-packed entertainer to be made on a large scale. Nikhil who is doing different genre films is all excited to play a spy for the first time.

The film’s regular shoot also commences from today in Hyderabad.

A top-notch technical team will be working for this high budget entertainer. Director Garry BH will also take care of editing, while Manojh Reddy is the cinematographer. Sricharan Pakala renders soundtracks for the film.

Anirudh Krishnamurthy is the writer. Arjun Surisetty handles art department, while Ravi Anthony is the production designer.

Cast: Nikhil Siddhartha, Iswarya Menon

Technical Crew:
Director & Editor: Garry BH
Producer: K Raja Shekhar Reddy
CEO: Charan Tej
Presents: Red Cinemas
Writer: Anirudh Krishnamurthy
Music Director: Sricharan Pakala
DOP: Manojh Reddy
Art Director: Arjun Surisetty
Production Designer: Ravi Anthony
PRO: Vamsi-Shekar