బ్రాండ్ న్యూ పోస్ట‌ర్‌తో నితిన్‌, మేర్ల‌పాక గాంధీ,శ్రేష్ఠ్ మూవీస్ ల‌`మాస్ట్రో` !!

బ్రాండ్ న్యూ పోస్ట‌ర్‌తో నితిన్‌, మేర్ల‌పాక గాంధీ,శ్రేష్ఠ్ మూవీస్ ల‌`మాస్ట్రో` !!

బ్రాండ్ న్యూ పోస్ట‌ర్‌తో శ్రీ‌రామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు తెలిపిన నితిన్‌, మేర్ల‌పాక గాంధీ,శ్రేష్ఠ్ మూవీస్ ల‌`మాస్ట్రో`.

హీరో నితిన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా ‌మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న నితిన్ 30వ చిత్రం `మాస్ట్రో`. రీసెంట్ గా విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌, ఫ‌స్ట్ గ్లిమ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా శ్రీ‌రామ న‌వ‌మి శుభాకాంక్ష‌ల‌తో మాస్ట్రో మూవీ నుండి స‌రికొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.   నభా నటేష్ స్కూటీ నడుపుతూ ఉండగా.. నితిన్ ఆమె వెనక కూర్చుని  కలర్ ఫుల్‌గా ఉన్న ఈ రొమాంటిక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

త‌మ‌న్నా భాటియా కీల‌క‌ పాత్రలో న‌టిస్తోన్న `మాస్ట్రో`  2021లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్టులలో ఒక‌టి. ఇటీవ‌ల రంగ్‌దే సినిమాతో విజ‌యం సాధించారు హీరో నితిన్‌. ఈ చిత్రంలో ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ త‌మ‌న్నా భాటియా, న‌భా న‌టేష్ భాగ‌మ‌వుతున్నారు.  

‘భీష్మ’ మూవీకి సూప‌ర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ చిత్రానికీ సుమ‌ధుర బాణీల‌ను స‌మ‌కూరుస్తున్నారు.

రాజ్‌కుమార్ ఆకెళ్ల స‌మ‌ర్ప‌ణ‌లో శ్రేష్ఠ్ మూవీస్ ప‌తాకంపై  ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ చివరి ద‌శ‌లో ఉంది.

తారాగ‌ణం:
నితిన్‌, త‌మ‌న్నా భాటియా, న‌భా న‌టేష్‌, న‌రేష్‌, జిషుసేన్ గుప్తా, శ్రీ‌ముఖి, అన‌న్య‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, ర‌చ్చ ర‌వి, మంగ్లీ, శ్రీ‌నివాస్ రెడ్డి.

సాంకేతిక బృందం:
మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: మేర్ల‌పాక గాంధీ
నిర్మాత‌లు: ఎన్‌. సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి
బ్యాన‌ర్‌: శ్రేష్ఠ్ మూవీస్‌
స‌మ‌ర్ప‌ణ‌: రాజ్‌కుమార్ ఆకెళ్ల‌
మ్యూజిక్‌: మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: జె. యువ‌రాజ్‌
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌. శేఖ‌ర్‌
ఆర్ట్‌: సాహి సురేష్‌
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్‌.

 
Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Wishes Sri Rama Navami With Brand New Poster

Hero Nithiin’s milestone 30th film Maestro is directed by Merlapaka Gandhi. The film’s first look poster and first glimpse got rave reviews. The makers on the propitious occasion of Sri Rama Navami have released a brand-new poster. Featuring the lead pair, the poster where Nithiin and Nabha Natesh are seen on a bike ride looks romantic.

Tamannaah Bhatia plays a crucial role in the film which is one of the craziest projects in 2021, given the actor’s recent outing Rang De turned out to be a hit and two crazy heroines Tamannaah Bhatia and Nabha Natesh are being part of it.

Mahati Swara Sagar who gave chartbuster album for Bheeshma is working for the second time with Nithiin.

N Sudhakar Reddy and Nikitha Reddy are producing the film under Shreshth Movies Banner, while Rajkumar Akella is presenting it. The film has cinematography by J Yuvraj.

Maestro is currently in last leg of shooting.

Cast: Nithin, Nabha Natesh, Tamannaah, Naresh, Jishhusen Gupta, Sreemukhi, Ananya, Harshavardhan, Rachha Ravi, Mangli, Srinivas Reddy

Technical Crew:

Dialogues, Direction: Merlapaka Gandhi
Producers: N Sudhakar Reddy, Nikitha Reddy
Banner: Sreshth Movies
Presents: Rajkumar Akella
Music Director: Mahati Swara Sagar
DOP: J Yuvraj
Editor: SR Shekhar
Art Director: Sahi Suresh
PRO: Vamsi-Shekar