నాలో నిన్ను దాచానే మూవీ రివ్యూ!!

నాలో నిన్ను దాచానే మూవీ రివ్యూ!!

 

నాలో నిన్ను దాచానే మూవీ రివ్యూ!!

న‌టీన‌టులుః ఆనంద్‌, వినీష‌, రెడ్డి ఎస్వీ, దుర్గారావు, ఏడుకొండ‌లు, విద్య‌, కేవీఆర్ రెడ్డి
సాంకేతిక నిపుణులుః
స్టోరి – స్క్రీన్ ప్లే ఏడుకొండ‌లు, శ్రీనాథ్‌
డీఓపీః శ్రీకాంత్ మ‌ర్క‌
ఎడిట‌ర్ః సాయి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః క‌ళ్యాణి
సంగీతంః ఎమ్ ఎల్ రాజు
ఫైట్స్ః విక్కీ మాస్ట‌ర్
డాన్స్ః బాబీ మాస్ట‌ర్ ఎంట్ టీమ్‌
నిర్మాతః ఎస్ వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ రెడ్డి
డైర‌క్ట‌ర్ః క‌ర్రి రామ రెడ్డి
రేటింగ్ః 3/5

ఇటీవ‌ల కాలంటో కంటెంట్ బావుంటే ..కొత్త‌, పాత అని చూడ‌కుండా సినిమాలు స‌క్సెస్ చేస్తున్నారు ప్రేక్ష‌కులు. అలా కంటెంట్ ని న‌మ్ముకుని వ‌చ్చిన చిత్రం ` నాలో నిన్ను దాచానే`. చ‌క్కటి టైటిల్ తో వ‌చ్చిన ఈ చిత్రం ఈ నెల 22న విడుద‌లైంది. టీజ‌ర్, పోస్ట‌ర్స్, ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకున్న ఈ చిత్రం థియేట‌ర్స్ లో ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం…

స్టోరిః
శ్రీవ‌ల్లి ఒక ప‌ల్లెటూరి అమ్మాయి. త‌నకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి. అలానే త‌న జీవితాన్ని గ‌డ‌పాల‌నుకుంటుంది. ఈ క్ర‌మంలో త‌నను ఎంత‌గానో ప్రేమించే త‌న మాజీ ల‌వ‌ర్, త‌న భ‌ర్త‌, తన తండ్రి ఆమెకు కొన్ని నిబంధ‌న‌లు పెడ‌తారు. కానీ అవేమీ ఆమె పట్టించుకోదు. ఈ క్ర‌మంలో వీరి మ‌ధ్య ఎలాంటి సంఘ‌ర్ష‌ణ రేగింది. చివ‌రకు త‌న జీవితాన్ని ఎలా నిల‌బెట్టుకుంది. డ‌బ్బు, ప్రేమ‌, ఫిజిక‌ల్ ఎట్రాక్ష‌న్ కి ఉండే తేడాల ప‌ట్ల ఆమె చివ‌ర‌కు రియ‌లైజ్ అయిందా లేదా అన్నమి మిగ‌తా క‌థాంశం.

న‌టీన‌టులు హావ‌భావాలుః
శ్రీవ‌ల్లి అంద‌మైన ప‌ల్లెటూరి అమ్మాయిగా అద్భుతంగా న‌టించింది. ల‌వ‌ర్, హ‌జ్బండ్, తండ్రి వీరి ముగ్గురి మ‌ధ్య ఎలా న‌లిగిపోయే స‌న్నివేశాలు ఎంతో స‌హ‌జంగా న‌టించింది. అలాగే ఆనంద్ కూడా ఎక్క‌డా కొత్త హీరో అనే భావ‌న రానీయ‌కుండా ఎంతో అనుభ‌వం ఉన్న హీరోలా న‌టించాడు. హీరోగా త‌న‌కిది మంచి ఎంట్రీ అవుంతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. హీరోయిన్ ఫాద‌ర్ గా న‌టించిన ఎస్వీ రెడ్డి కూడా న‌టుడుగా మంచి మార్కులు కొట్టేశాడు. మిగ‌తా వారంతా త‌మ త‌మ పాత్ర‌ల‌కు జీవం పోశారు.

సాంకేతి నిపుణుల పనితీరుః
ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ద‌ర్శ‌కుడు క‌ర్రి రామ రెడ్డి గురించి చెప్పాలి. ఫ‌స్ట్ షాట్ ద‌గ్గ‌ర నుంచి ఎండ్ షాట్ వ‌ర‌కు ఎక్క‌డా బోర్ కొట్టించ‌కుండా ఆద్యంతం ఎంతో ఆహ్లాద‌క‌రంగా సినిమాను తీర్చిదిద్దిన విధానం బావుంది. ద‌ర్శ‌కుడుగా ఈ సినిమా త‌న‌కు మంచి ప్రారంభం అని చెప్పొచ్చు. ప్ర‌తి ఆర్టిస్ట్ నుంచి టెక్నీషియ‌న్ నుంచి మంచి వ‌ర్క్ రాబ‌ట్టుకున్నారు. ఎమ్ ఎల్ రాజు సంగీతం సినిమాకు ప్రానం పోసింది. అలాగే శ్రీకాంత్ సినిమాటోగ్ర‌ఫీ వ‌ల్ల ప్ర‌తి సీను అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా అనిపిస్తుంది. ఎడిటట‌ర్ ఇంకాస్త షార్ప్ గా క‌ట్ చేసి ఉంటే సినిమా ఇంకా సూప‌ర్ ఫాస్ట్ గా అనిపించేది. నిర్మాత క‌థ కు ఎంత ఖ‌ర్చు పెట్టాలో అంత ఖ‌ర్చు పెట్టారు. ఏడు కొండ‌లు, శ్రీనాథ్ సంభాష‌ణలు ఆలోచింప‌జేసే విధంగా ఉన్నాయి. కొంచెం కామెడీ లోపించిన‌ట్టు అనిపించింది.

ఫైన‌ల్ గా…
అచ్ఛ‌మైన స్వ‌చ్ఛ‌మైన టైటిల్ తో వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ లో క‌చ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది. కొత్త వారైనా అంద‌రూ సిన్సియ‌ర్ గా వ‌ర్క్ చేశారు. డిఫ‌రెంట్ స్టోరీస్ న‌చ్చే వారికి ఈ సినిమా క‌చ్చితంగా న‌చ్చుతుంది. హ్యాపీగా ఫ్యామిలీ అంతా క‌లిసి చూడాల్సిన క్లీన్ ఎంట‌ర్ టైన‌ర్ చిత్ర‌మిది. సో డోంట్ మిస్ …గో అండ్ వాచ్.