సూపర్ స్టార్ రజినీకాంత్, శివ, ఏసియన్ ఇన్‌ఫ్రా ఎస్టేట్ ఎల్ఎల్‌పి చిత్రం ‘పెద్దన్న’ !!

సూపర్ స్టార్ రజినీకాంత్, శివ, ఏసియన్ ఇన్‌ఫ్రా ఎస్టేట్ ఎల్ఎల్‌పి చిత్రం ‘పెద్దన్న’ !!

సూపర్ స్టార్ రజినీకాంత్, శివ, ఏసియన్ ఇన్‌ఫ్రా ఎస్టేట్ ఎల్ఎల్‌పి చిత్రం ‘పెద్దన్న’ !!

తమిళంలో ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తె అంటూ మాస్ యాక్షన్‌ను చూపించేందుకు రెడీ అయ్యారు. టాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ అన్నాత్తె డబ్బింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతోన్నారు.

దసరా సందర్భంగా తెలుగు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి తెలుగులో పెద్దన్న అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం అన్నాచెల్లెళ్ల సంబంధం మీద తెరకెక్కుతుండటంతో పెద్దన్న అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలతో సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకు మీద కత్తి పట్టుకుని రజనీకాంత్ తన మాస్ అవతరాన్ని చూపించారు. ఇందులో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నట్టు కనిపిస్తోంది. రజినీ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

నిన్న విడుదల చేసిన తమిళ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోయింది. ఇక తెలుగు టీజర్ అతి త్వరలో రాబోతోంది.

రజనీకాంత్ సరసన నయన తార హీరోయిన్ గా నటిస్తోంది. మీనా, కుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు. ఇమ్మాన్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. వెట్రి సినిమాటోగ్రఫర్‌గా, రూబెన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

నవంబర్ 4న దీపావళి కానుకగా తమిళ, తెలుగు భాషల్లో పెద్దన్న రిలీజ్ కాబోతోంది.

Superstar Rajinikanth, Siva, Asian Infra Estates LLP’s Film Titled Peddanna !!

Superstar Rajinikanth is coming up with a high intense action drama titled Annaatthe in Tamil. Tollywood’s leading distribution house- Asian Infra Estates LLP has obtained Telugu and Tamil rights of the movie for Andhra Pradesh and Telangana. Narayandas Narang and Suresh Babu are bringing the film to Telugu and Tamil audience in Telugu states.

The makers ahead of Dussehra have unveiled Telugu title of the movie with a brand-new poster. Peddanna is the title of the movie. Since the film is loaded with brother-sister sentiment, the makers have opted to this title of Peddanna.

Rajinikanth appears fierce in the poster as he drives Royal Enfield bike and holds a sword in another hand. This is from a high voltage action sequence in the film. Rajini wears a khadi shirt and white panche here.

The film’s Tamil teaser is out now, while Telugu teaser will be dropped soon.

Nayanthara is the leading lady opposite Rajinikanth, while Meena, Khushbu, Keethy Suresh, Jagapathi Babu and Prakash Raj will be seen important roles. The film, which has its music by Imman, has Vetri as its cinematographer and Ruben as editor.

Peddanna will hit the screens for this Diwali on November 4th in Telugu and Tamil.