మెస్మ‌రైజింగ్  `హ‌ర్లా ఫర్లా` సాంగ్‌తో ఆక‌ట్టుకుంటోన్న యాక్ష‌న్ హీరో విశాల్ `చ‌క్ర`‌

మెస్మ‌రైజింగ్  `హ‌ర్లా ఫర్లా` సాంగ్‌తో ఆక‌ట్టుకుంటోన్న యాక్ష‌న్ హీరో విశాల్ `చ‌క్ర`‌

 

మెస్మ‌రైజింగ్  `హ‌ర్లా ఫర్లా` సాంగ్‌తో ఆక‌ట్టుకుంటోన్న యాక్ష‌న్ హీరో విశాల్ `చ‌క్ర`‌

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `చ‌క్ర‌`.  శ్రద్దా శ్రీనాథ్  హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో హీరోయిన్‌ రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక  ప్రమాణాలతో రూపొందుతోన్నఈ చిత్రాన్ని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్నారు.  ఇప్పటికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌తో ‌ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచింది. ఈ మూవీ యాక్ష‌న్ హీరో విశాల్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్‌రాజా కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న 10వ చిత్రం కావ‌డం విశేషం.  తాజాగా ఈ చిత్రం నుండి యువ‌న్ సంగీత సారథ్యం వ‌హించిన `హ‌ర్లా ఫర్లా` సాంగ్‌`ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

`నీ చూపుల్లోనే నాటీ గ్రాఫిటీ.. రైసైందే ల‌బ్‌డ‌బ్ హార్టుల్లోని గ్రావిటీ..తాకేనా ఆ మేఘాల్ని..నా వ‌ల‌న నీ న‌వ్వుల్నే..కొట్టి కొట్టి క‌న్ను చంప‌మాక‌లా..కిక్కు రేపుతున్న మ‌త్తు మాట‌లా..కొత్త కొత్త‌గున్న బుట్ట‌బొమ్మ‌లా హ‌ర్లా..ఫ‌ర్లా` అంటూ జోష్‌ఫుల్‌గా సాగే ఈ పాట‌కి డా. చ‌ల్లా భాగ్య‌ల‌క్ష్మి నేటి ట్రెండ్‌కి త‌గ్గ‌ట్లు సాహిత్యం అందించ‌గా రంజిత్‌, సంజ‌న క‌ల్‌మంజి ఫుల్ ఎన‌ర్జీతో ఆల‌పించారు. ప్ర‌స్తుతం ఈ పాట సోష‌ల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ బ్యాంక్ రాబ‌రీ, హ్యాకింగ్‌ నేప‌థ్యంలో సరికొత్త క‌థాక‌థనాల‌తో  ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల‌లో ఈ మూవీ విడుద‌ల‌కానుంది.

యాక్ష‌న్ హీరో విశాల్‌,  శ్ర‌ద్దా శ్రీ‌నాథ్, రెజీనా క‌సాండ్ర, మ‌నోబాలా, రోబో శంక‌ర్‌, కెఆర్ విజ‌య్, సృష్టిడాంగే త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫి : బాల‌సుబ్ర‌మ‌నియం‌, సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా, నిర్మాత: విశాల్‌,ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్ ఆనంద‌న్.

 
Mesmerising Breezy Romantic Track From Vishal’s Chakra Is Out

Action Hero Vishal’s latest is titled ‘Chakra’ in MS Anandan’s direction. Vishal is producing this film with high technical values under his Vishal Film Factory banner. Shraddha Srinath is playing as heroine while Regina Cassandra is doing a key role. Yuvan Shankar Raja is scoring the music. Manobalan, Robi Shankar, KR Vijay, Srushti Dange will be seen in other important roles. Intriguing Trailer with powerful dialogues raises curiosity about the film and garners thumping response. The team has released a romantic song ‘Harla Farla’ composed by Yuvan Shankar Raja. ‘Chakra’ marks 10th film in the successful combination of Vishal and Yuvan Shankar Raja.Harla Farla’ is a joshful song with lyrics..
‘Nee chupullone naughty graffiti.. raise ayinde lubdub heartloni gravity.. taakenaa aa meghaalni.. Naa Calabar nee navvulne..’, Dr Challa Bhagyalakshmi penned trendy lyrics while Ranjith, Sanjana Kalmanji filled the song with their energetic voices. This breezy Romantic number is getting very good response from the listeners.

‘Chakra’ is an intriguing tale involving digital crimes, hacking, and bank robberies with high technical values and an engaging plot. The film will release in Telugu, Tamil, Malayalam and Kannada languages.

Action Hero Vishal, Shraddha Srinath, Regina Cassandra, Manobalan, Robo Shankar, KR Vijay, Srushti Dange

Cinematography: Balasubramaniam, Music: Yuvan Shankar Raja, Produced by Vishal, Written & Directed by MS Anandan