‘గతం’ మూవీకి అరుదైన అవకాశం

‘గతం’ మూవీకి అరుదైన అవకాశం

‘గతం’ మూవీకి అరుదైన అవకాశం

గతం’ మూవీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్
ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో(IFFI)లోని ఇండియన్ పనోరమా కేటగిరీలో ప్రదర్శితం
కానున్న ఏకైక తెలుగు సినిమాగా నిలిచింది. నవంబర్ 6న ప్రముఖ ఓటీటీ
ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలై సూపర్ సక్సెస్ అయింది.
థ్రిల్లర్ కథాంశంతో కిరణ్ కొండమడుగుల దీనిని తెరకెక్కించారు.

భార్గవ పోలుదాసు, రాకేష్ గాలేభే, పూజిత కురపర్తి ఈ సినిమాలో కీలక
పాత్రలలో నటించగా.. భార్గవ పోలుదాసు, సృజన్ యర్రబోలు, హర్ష వర్ధన్
ప్రతాప్‌లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇక శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు
మ్యూజిక్ అందించగా.. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు. సస్పెన్స్,
ట్విస్టులతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో
ఇప్పుడు జనవరి 17న గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్
ఇండియా ఫంక్షన్‌లో పనోరమా కేటగిరీలో ప్రదర్శితమయ్యే సినిమాగా స్థానాన్ని
సంపాదించుకుంది.

ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా ఒక ప్రధాన
భాగం. బెస్ట్ ఇండియన్ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తూ ఉంటారు. ఉత్తమ
భారతీయ సినిమాలను ప్రోత్సహించేందుకు గాను 1978లో దీనిని ప్రవేశపెట్టారు.
ప్రతి సంవత్సరం ఉత్తమ భారతీయ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఇప్పుడు
ఒక కొత్త సినిమా అయిన గతంకు అవకాశం దక్కడం గొప్ప అని చెప్పుకోవచ్చు.

‘Gatham’ movie has been picked for screening at International Film Festival of India (IFFI)

‘Gatham’ only Telugu film makes  it to IFFI.Among the OTT releases in
the last three months, ‘Gatham’ was a sensational thriller. The film
made by newcomers, was completely shot in the USA. The reviews for
this film were very positive too and audiences gave their thumps up.

Now the film has been picked for screening at International Film
Festival of India (IFFI). This is the only Telugu movie to get
selected for this film festival and it happened under Indian Panorama
category.

The IFFI will be held from January 16th to 21, 2021 and will see
participation of 26 feature films and 21 non-feature films. Due to the
ongoing pandemic, the festival will be broadcasted online, for greater
public participation.

‘Gatham’ was directed by Kiran Reddy Kondamadugula and produced by
Bhargava Poludasu, Srujan Yarabolu and Harsha Pratap. The film had
Bhargava Poludasu, Rakesh Galebhe and  Poojitha Kuraparthi in the lead
roles.

Telugu Films screened at IFFI

2020 – Gatham
2019 – F2
2018 – Mahanati
2017 – Bahubali: The Conclusion
2016 – Bahubali: The Beginning