సేవలోనే ఆరోగ్యం.. సేవలోనే ఆనందం”  అంటున్న డాక్టర్ కమ్ డైరెక్టర్  -ఆనంద్ కుమార్ ఇస్లావత్

సేవలోనే ఆరోగ్యం.. సేవలోనే ఆనందం”  అంటున్న డాక్టర్ కమ్ డైరెక్టర్  -ఆనంద్ కుమార్ ఇస్లావత్

 

   

 

“సేవలోనే ఆరోగ్యం.. సేవలోనే ఆనందం” 
అంటున్న డాక్టర్ కమ్ డైరెక్టర్ 
*ఆనంద్ కుమార్ ఇస్లావత్*
 
     ఇచ్చుటలో ఉన్న హాయి… వేరెచ్చటనూ లేనే లేదని” మనసు కవి ఆత్రేయ ఏనాడో చెప్పారు.
దాన్ని అక్షరాలా ఆచరిస్తూ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు డాక్టర్ కమ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ఇస్లావత్.  కేంద్ర ప్రభుత్వ పరిధిలోని “ఆయుష్ శాఖ”లో ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ అయిన ఆనంద్.. ఎదుటి వారి సంతోషంలో తన ఆనందాన్ని వెతుక్కుంటారు. 
    అందుకే తన మిత్రులతో కలిసి దేశవ్యాప్తంగా వైద్య సేవా శిబిరాలు నిర్వహిస్తుండడమే కాకుండా… కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్న అన్నార్తుల కోసం వైద్యపరంగానే కాకుండా… వస్తురూపంలోనూ సాయమందిస్తూ… ‘దైవం మానుష రూపేణా’ అన్న ఆర్యోక్తికి అద్దం పడుతుంటారు. 
     నల్గొండ జిల్లా-మిర్యాలగూడ వాస్తవ్యుడైన ఆనంద్… ‘బంజారా మహిళ’ పేరుతో 2015 నుంచి ఎంతో ఆదర్శప్రాయంగా ఓ స్వచ్చంద సంస్థను నిర్వహిస్తున్నారు.  ఈ కోవిడ్ కష్టకాలంలో అనాథ పిల్లలు, వృద్ధాశ్రమాలు, వలస కూలీలతో పాటు సినీ కార్మికుల కోసం తన వంతుగా సహాయ శిబిరాలను కూడా డా.ఆనంద్ ఏర్పాటు చేసారు. సినిమాల పట్ల చిన్నప్పటినుంచి అమితమైన ఆసక్తి, అత్యంత మక్కువ కలిగిన ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ‘హార్మోన్స్’ అతని ప్రతిభను ఘనంగా పరిచయం చేసి.. సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పొందింది. యన్.యస్.నాయక్, ఆనంద్, హరి కాసుల “హార్మోన్స్” చిత్రాన్ని నిర్మించారు.
     కొవిడ్ క్యాంప్స్ నిర్వహణతోపాటు… పి.హెచ్.డి చేయడం లాంగ్ లీవ్ లో ఉన్న ఆనంద్ కుమార్… తన తదుపరి చిత్రం కోసం ఒక యునీక్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. ఆనంద్ చేసే సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తారు అతని జీవిత భాగస్వామి పూర్ణిమ. ఆమె కూడా “ఆయుష్ శాఖ”లోనే డాక్టర్. తమిద్దరికీ జీవితాన్నిచ్చిన “ఆయుష్ శాఖ” పట్ల కృతజ్ఞతతో… తమ కుమారుడికి “ఆయుష్” అనే పేరు పెట్టుకున్నారు ఆనంద్-పూర్ణిమ దంపతులు. కుమార్తె పేరు అంజన. 
     ‘ప్రజాహక్కు, అంటు’రానితనం, చిరుతేజ్ సింగ్’ వంటి లఘు చిత్రాలతోనూ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణా ఐ.టి.శాఖామంత్రి కె.టి.ఆర్ ల అభినందనలు దండిగా అందుకున్న ఆనంద్..
డాక్టర్ గా శరీరానికి, డైరెక్టర్ గా మనసుకు వైద్యం చేయడమే తన లక్ష్యమని చెబుతారు!!