విశ్వజీత్ హీరోగా నటించిన ‘కౌశిక వర్మ దమయంతి’ టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌, ట్రైలర్‌ లాంచ్‌

విశ్వజీత్ హీరోగా నటించిన ‘కౌశిక వర్మ దమయంతి’ టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌, ట్రైలర్‌ లాంచ్‌

విశ్వజీత్ హీరోగా నటించిన ‘కౌశిక వర్మ దమయంతి’ టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌, ట్రైలర్‌ లాంచ్‌ !!

విశ్వజీత్, అర్చ‌న‌, ఊర్వశి రాయ్ హీరో హీరోయిన్లుగా అంగారిక దియాన్‌ సమర్పణలో గురుదత్తా క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై సుధీర్‌ లాక్స్‌ విల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సోషియో ఫాంటసీ చిత్రం ‘కౌశికవర్మ దమయంతి`. గీతా కౌశిక్ నిర్మాత‌. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌, మోషన్‌ పోస్టర్‌, టైటిల్‌ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సుచర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, నిర్మాతలు రాజ్ కందుకూరి, తుమ్మలప్లలి రామ సత్యనారాయణ, లయన్ సాయి వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

`సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో సినిమా చేయ‌డం సుల‌భ‌మైన విష‌యం కాదు. చాలా ఇబ్బందులుంటాయి. అలాంటి స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి సినిమా చేసిన హీరో విశ్వ‌జీత్‌కు అభినంద‌నలు. ద‌ర్శ‌కుడు సుధీర్ లాక్స్ విల్ డైరెక్ష‌న్ చాలా బావుంది. ముఖ్యంగా సౌండ్, విజువ‌ల్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. హీరోయిన్స్ అర్చ‌న‌, ఊర్వ‌శి రాయ్‌ల‌కు ఈ సినిమాతో మంచి బ్రేక్ రావాల‌ని కోరుకుంటున్నాం. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి.. యూనిట్‌కు మంచి గుర్తింపు, నిర్మాత గీతా కౌశిక్ గారికి లాభాల‌ను తెచ్చిపెట్టాల‌ని కోరుకుంటున్నాం“ అన్నారు ముఖ్య అతిథులు సుచర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్, నిర్మాతలు రాజ్ కందుకూరి, తుమ్మలప్లలి రామ సత్యనారాయణ, లయన్ సాయి వెంకట్.

చిత్ర దర్శకుడు సుధీర్‌ లాక్స్ విల్‌ మాట్లాడుతూ – “లాక్స్‌ విల్‌ స్టూడియో ద్వారా ఎన్నో ప్రచార చిత్రాలకు పనిచేసిన అనుభవంతో ‘కౌశికవర్మ దమయంతి’ సినిమాను తెరకెక్కించాను. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం” అన్నారు.

చిత్ర నిర్మాత గీతాకౌశిక్‌ మాట్లాడుతూ – “సినిమా రంగంపై ఉన్న ప్యాషన్‌తో ఎలాంటి అనుభవం లేకపోయినా అడుగుపెట్టాం. మేకింగ్‌ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాం. ట్రైలర్‌ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాం. తప్పకుండా సినిమా నచ్చుతుంది” అన్నారు.

హీరో విశ్వజీత్‌ మాట్లాడుతూ – “యూకే ఉన్నత విద్యాభ్యాసం చేశాను. మంచి ఉద్యోగాలు వచ్చినా.. సినిమా రంగంపై ఉన్న ప్రేమతో ఇటుగా అడుగులు వేశాను. మా బ్యానర్‌ నుంచి వస్తున్న రెండో సినిమా ఇది. సోషియో ఫాంటసీ బ్యానర్‌లో సినిమా చేయడం ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌. తప్పకుండా ప్రేక్షకులను మెప్పించే కథతో రూపొందుతోన్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అన్నారు.

సినిమాలో డిఫరెంట్‌ రోల్స్‌ చేశామని, అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌ చెప్పారు హీరోయిన్స్‌ అర్చన, ఊర్వశి రాయ్‌. ఇంకా ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్‌ కె.వి.వరం, మ్యూజిక్‌ డైరెక్టర్ష్‌ ఏలేందర్ మహావీర్‌, ఎస్‌.ఎస్‌.ఆత్రేయ, డైలాగ్‌, పాటల రచయిత ప్రవీన్‌ మాచవరం, అసోసియేట్ డైరెక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ఉదురుకోట‌, లిరిక్‌ రైటర్‌ దీప్తి, నందకుమార్‌, కోకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.