సినిమా మేకింగ్‌ అంటే పాటను కంపోజ్‌ చేసినట్టేనని మణిరత్నం సార్‌ చెప్పారు – ఎ.ఆర్‌.రెహమాన్‌

సినిమా మేకింగ్‌ అంటే పాటను కంపోజ్‌ చేసినట్టేనని మణిరత్నం సార్‌ చెప్పారు – ఎ.ఆర్‌.రెహమాన్‌

సినిమా మేకింగ్‌ అంటే పాటను కంపోజ్‌ చేసినట్టేనని మణిరత్నం సార్‌ చెప్పారు – ఎ.ఆర్‌.రెహమాన్‌
 
జంట ఆస్కార్‌లను అందుకున్న ఎ.ఆర్‌.రెహమాన్‌ తనకు సినిమా ప్రొడక్షన్‌ అనేది పక్కదారి పట్టడంలాంటిదని అనుకున్నారట. కానీ, ఓ పాటను ఎలా కంపోజ్‌ చేస్తారో, సినిమా మేకింగ్‌ కూడా అంతే శ్రద్ధగా చేయాల్సిన పని అని, అచ్చం అలాంటిదేనని ఆయనకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం చెప్పారట. ఆ ప్రోత్సాహంతోనే రెహమాన్‌ తన 99 సాంగ్స్ కి స్క్రిప్ట్ సమకూర్చుకున్నారట. దీని గురించి ఎ.ఆర్‌.రెహమాన్‌ మాట్లాడుతూ ”సినిమా తీయడం అనేది పాటను కంపోజ్‌ చేయడం లాంటిదని ఒకసారి నాతో మణిసార్‌ అన్నారు. మామూలుగా పాటలో ఓ ఇంట్రడక్షన్‌ ఉంటుంది. పాటకో థీమ్‌ ఉంటుంది. ట్యూన్‌ చేస్తాం. ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌ మిక్సింగ్‌ చేస్తాం. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్‌ జరిగి అందమైన పాటగా రూపాంతరం చెందుతుంది.. దానికి సాహిత్యం సమకూరుస్తాం.. పాట పుట్టుక ఇలా ఉంటుందన్నమాట” అని అన్నారు. ఇహాన్‌ భట్‌, ఎడిల్సి వర్గస్‌, మ్యూజిషియన్‌ – డైరక్టర్‌ విశ్వేష్‌ కృష్ణమూర్తితో కలిసి ఆయన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. 99 సాంగ్స్ ని ప్రొడ్యూస్‌ చేశారు రెహమాన్‌. ”ప్రజల మనసులోని భావాలను కథ ఎంత వరకు ప్రతిబింబించిందనే దాన్ని బట్టే సక్సెస్‌ ఉంటుంది. సౌండ్‌, విజువల్స్ వారిలో మంచి అనుభూతిని మిగులుస్తాయి” అని చెప్పారు రెహమాన్‌. 99 సాంగ్స్ ని హిందీ, తమిళ్‌, తెలుగులో ఈ నెల 16న విడుదల చేయనున్నారు. జియో స్టూడియోస్‌ సమర్పిస్తోంది ఈ చిత్రాన్ని. ఎ.ఆర్‌.రెహమాన్‌ ప్రొడక్షన్‌ కంపెనీ వైయం మూవీస్‌ నిర్మిస్తోంది. ఐడియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సహ నిర్మాణ సంస్థ.
 
Mani Ratnam sir said making a movie is like composing a song” – says AR Rahman
 
Movie production can seem like a sharp detour for two-time Academy Award-winning music composer AR Rahman. But look closely, and you realise that filmmaking isn’t really different from composing a melody. This was the lesson Rahman’s long-time collaborator Mani Ratnam taught him, egging him on to develop the script for 99 Songs.
“Mani sir once said to me that making a movie is like composing a song. You have the introduction, the song’s theme, the tune and then you do the background mixing. Then comes the antara, and with it, you have a journey that comes to an end beautifully. That’s when it struck me how [fulfilling] it is to create another art form in your own language,” says Rahman, crediting the auteur for pushing him towards filmmaking.
His debut production features debutant Ehan Bhat and Edilsy Vargas with musician-director Vishwesh Krishnamoorthy at the helm. The composer-producer knows that the Jio Studios endeavour — a passionate love story with music at its core — is far removed from mainstream offerings. “People’s experience of a movie truly depends on whether the story resonates with them or not. After the pandemic, our sensibilities have changed. 99 Songs is more of an experiential movie. The sound and visuals are an experience unto themselves.” 
99 Songs will release in Hindi, Tamil and Telugu on 16th April, 2021.  Presented by Jio Studios, the film is produced by A.R. Rahman’s production company YM Movies and co-produced by Ideal Entertainment.