“మాచర్ల నియోజకవర్గం“ చిత్రం షూటింగ్ భారీ షెడ్యూల్‌ పూర్తి !!

“మాచర్ల నియోజకవర్గం“  చిత్రం షూటింగ్ భారీ షెడ్యూల్‌  పూర్తి !!

నితిన్ హీరోగా ఎం ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా శ్రేష్ఠ్ మూవీస్ నిర్మిస్తున్న మాచర్ల నియోజకవర్గం భారీ షెడ్యూల్‌ పూర్తి !!

ప్రస్తుతం హీరో నితిన్ రాబోయే చిత్రం మాచర్ల నియోజకవర్గం షూటింగ్‌ లో బిజీగా ఉన్నారు.

ప్రముఖ ఎడిటర్ MS రాజ శేఖర్ రెడ్డి దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను

ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ భారీ షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది.

అనల్ అరసు మాస్టర్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను రూపొందించారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మాస్ డ్యాన్స్ పూర్తయింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయి.

నితిన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ,

అనల్ అరసు మాస్టర్ కంపోజ్ చేసిన అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. జానీ మాస్టర్ సాంగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయి. అన్నారు.

ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. నితిన్‌ తో ఇద్దరు కథానాయికల కలయిక ఇదే తొలిసారి.

పొలిటికల్ ఎలిమెంట్స్‌ తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు.

 ఈ చిత్రంలో భారీ తారాగణం కూడా ఉంది. అనుభవం గల సాంకేతిక సిబ్బంది పని చేస్తున్నారు.

భీష్మ, మాస్ట్రో తర్వాత మహతి స్వర సాగర్  మూడవసారి నితిన్‌ తో కలిసి పనిచేస్తున్నారు.

 ప్రసాద్ మూరెళ్ల కెమెరా, మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.

నటీనటులు: నితిన్, కేథరిన్ థెరిస్సా, కృతి శెట్టి తదితరులు

సాంకేతిక సిబ్బంది:

రచన & దర్శకత్వం: MS రాజ శేఖర్ రెడ్డి

నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి

బ్యానర్: శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్

సంగీతం: మహతి స్వర సాగర్

DOP: ప్రసాద్ మూరెళ్ల

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

లైన్ ప్రొడ్యూసర్: జి హరి

సంభాషణలు: మామిడాల తిరుపతి

ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

PRO: వంశీ-శేఖర్

Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam Completes A Lengthy Schedule

Versatile actor Nithiin is presently busy shooting for his upcoming film Macherla Niyojakavargam that marks directorial debut of noted editor MS Raja Shekhar Reddy. The film being produced by Sudhakar Reddy and Nikitha Reddy on Sreshth Movies in association with Aditya Movies & Entertainments finished shooting a lengthy shooting schedule.

A heavy octane action episode under the supervision of Anal Arasu master was canned, followed by a mass dance number choreographed by Jani master. The film’s first look and teaser updates are coming up soon.

“Finished shooting for an exciting action episode composed by #Analarasu master  followed by a super mass dance number choreographed by @AlwaysJani #MacherlaNiyojakavargam 1st look and teaser updates coming up real soon @SreshthMovies @SrSekkhar ,” tweeted Nithiin.

Krithi Shetty and Catherine Tresa are the heroines opposite Nithiin in the movie. This is the first time association for both the heroines with Nithiin.

Nithiin is presented in a never seen before action role in the film billed to be a pucca mass and commercial entertainer with political elements. The movie also boasts of stellar cast and will have leading craftsmen working for it.

Mahati Swara Sagar collaborates with Nithiin for the third time, after Bheeshma and Maestro. Prasad Murella cranks the camera, while Mamidala Thirupathi provides dialogues and Sahi Suresh is the art director. Kotagiri Venkateswara Rao is the editor.

Cast: Nithiin, Catherine Tresa, Krithi Shetty and others

Technical Crew:
Written & Directed by: MS Raja Shekhar Reddy
Producers: Sudhakar Reddy, Nikitha Reddy
Banner: Sreshth Movies, Aditya Movies & Entertainments
Music: Mahati Swara Sagar
DOP: Prasad Murella
Editor: Kotagiri Venkateswara Rao
Line Producer: G Hari
Dialogues: Mamidala Thirupathi
Art Director: Sahi Suresh
PRO: Vamsi-Shekar