తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో ఏప్రిల్ 9న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ‘లెవన్త్ అవర్’

తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో  ఏప్రిల్ 9న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ‘లెవన్త్ అవర్’

ఉగాది కానుక‌గా తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో  ఏప్రిల్ 9న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ‘లెవన్త్ అవర్’
 
తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోన్న తెలుగు ఓటీటీ ఆహా తెలుగు ప్రేక్ష‌కుల కోసం తెలుగు సంవ‌త్స‌రాది వేడుక‌ల‌ను ముందుగానే అందించ‌డానికి సిద్ధ‌మైంది. అందులో భాగంగా ఏప్రిల్ 9న ఆహాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా తొలిసారి న‌టించిన ఒరిజిన‌ల్  ‘లెవన్త్ అవర్’ ప్ర‌సారం కానుంది. 
 
స‌మంత‌తో సామ్‌జామ్‌, రానా ద‌గ్గుబాటితో నెం.1 యారి వంటి టాక్ షోస్‌తో, ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ క్రాక్‌, అల్ల‌రి నరేష్ నాంది వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ఆహా ఇప్పుడు త‌మ‌న్నా‘లెవన్త్ అవర్’  ఒరిజిన‌ల్‌ను అందిస్తూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌పంచంలో త‌న‌దైన స్థానాన్ని క్రియేట్ చేసుకుంది ఆహా. 
 
పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకోవ‌డానికి అర‌త్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింద‌నేదే ప్ర‌ధానాంశమ‌ని త‌మ‌న్నా తెలిపారు. డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళ‌వింపుగా ఈ ‘లెవన్త్ అవర్’ 8 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్‌గా రూపొందింది. 
 
మ‌ల్టీ బిలియ‌న్ డాల‌ర్స్ కంపెనీ ఆదిత్య గ్రూప్ కంపెనీకి అర‌త్రికా రెడ్డి సీఈఓ. ఈ కంపెనీ అనుకోకుండా ఆర్థిక స‌మ‌స్యల వ‌ల‌యంలో చిక్కుకుంటుంది. ఆమె స్నేహితులే శ‌త్రువులుగా మారుతారు. ఎగ్జ‌యిట్‌మెంట్‌తో కూడిన ఈ ఈ గంద‌ర‌గోళం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి అర‌త్రికా రెడ్డి ఎలా పోరాడింది. ఆ జీవ‌న పోరాటంలో ఆమె  విజ‌యం సాధించిందా? అనే ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో ‘లెవన్త్ అవర్’  రూపొందింది. 
 
ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 9న ప్ర‌సారం కానున్న ఈ వెబ్ సిరీస్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌సార‌మైన‌ తెలుగు వెబ్ సిరీస్‌లో అతి పెద్ద వెబ్ సిరీస్‌. ఉపేంద్ర నంబూరి ర‌చించిన పుస్త‌కం 8 అవ‌ర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి ఈ సిరీస్‌కు రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు ఇన్‌ట్రౌప్ బ్యాన‌ర్‌పై  ఈ ఒరిజిన‌ల్ రూపొందించారు కూడా. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించారు. 
 
ఆహాలో ఈ వారం జాంబి రెడ్డి, అర్థ శ‌తాబ్దం వంటి ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. క్లాసిక్ చిత్రాలు, ఒరిజిన‌ల్స్‌తో ఆహా అతి త‌క్కువ వ్య‌వ‌థిలోనే తెలుగు వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకుంది. 
 
న‌టీన‌టులు:
త‌మ‌న్నా, అరుణ్ అదిత్‌, వంశీ కృష్‌ణ‌, రోషిణి ప్ర‌కాష్‌, అభిజీత్ పూండ్ల‌, శ‌త్రు, మ‌ధుసూద‌న్ రావు, జ‌య‌ప్ర‌కాష్‌, ప‌విత్రా లోకేష్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనిరుద్ బాలాజీ త‌దిత‌రులు
 
సాంకేతిక వ‌ర్గం:
నిర్మాత‌:  ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి
ద‌ర్శ‌క‌త్వం:  ప్ర‌వీణ్ స‌త్తారు
ఎడిట‌ర్‌:  ధ‌ర్మేంద్ర కాక‌రాల
సినిమాటోగ్ర‌ఫీ:  ముఖేష్.జి
సంగీతం:  భ‌ర‌త్, సౌర‌భ్‌
 
aha announces the release date of Tamannaah’s 11th Hour

Subtitle: aha’s upcoming original, which marks the digital debut of star actress Tamannaah, is all set to hit the home screens from April 9th as an Ugadi treat for the Telugu audiences.

Ringing in the new year celebrations a tad bit early with its much anticipated web series – 11th Hour, Ugadi with aha is going to be one full of entertainment. The aha original web series is all set to premiere on April 9 and marks the digital debut of prolific star and accomplished actress Tamannaah Bhatia.

 

Bringing some of the biggest stars on board with shows and digital premieres like Samantha’s Sam Jam, Rana Daggubati’s No 1 Yaari, Ravi Teja’s Krack, Allari Naresh’s Naandhi and now Tamannaah’s 11th Hour, aha is constantly proving itself to be a trailblazer in the Telugu entertainment space.

 

Speaking about the series, Tamannaah said that 11th Hour is a story of how a woman, Aratrika Reddy fights her way in a man’s world to achieve what she strives for.

 

The right mix of thrills and drama, the 8-episode web series begins on a fateful note when Aratrika, the CEO of Aditya group a multi-billion-dollar conglomerate, finds her company in financial ruin. With 20 nail biting minute episodes where friends turn foes, the viewers will find themselves on edge wondering if Aratrika will ever be able to outsmart her way out of this mess and win the biggest fight of her life?

An Ugadi extravaganza, the show is all set to air on April 9 and is the biggest Telugu web series till date. Inspired from Upendra Namburi’s book 8 Hours, the series has been written and produced by Pradeep Uppalapati under Introupe Films banner. The project is helmed by well-know and acclaimed director Praveen Sattaru.

With an exciting line up of films like Zombie Reddy, Ardha Shatabdham for Ugadi, aha is constantly giving its viewers a lot to look forward to with a release almost every single week. With a huge library of classics and original web series, in a short span of time, aha has become a household name with the best in Telugu entertainment.

Cast: Tamannaah, Arun Adith, Vamsi Krishna, Roshni Prakash, Abhijeeth Poondla, Shatru, Madhusudhan Rao, Jayaprakash, Pavithra Lokesh, Srikanth Iyengar, Anirudh Balaji

Crew:
Producer: Pradeep Uppalapati
Director: Praveen Sattaru
Mukesh G
Dharmendra Kakarala
Bharatt – Saurabh