‘Kothi Kommachi’ kickstarts shoot in Amalapuram

‘Kothi Kommachi’ kickstarts shoot in Amalapuram

 

అమలాపురంలో ‘కోతి కొమ్మచ్చి’ ఆట మొదలు !

మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరో హీరోయిన్స్ గా జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం  ‘కోతి కొమ్మచ్చి’ . లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ “మా కోతి కొమ్మచ్చి చిత్రం ఈరోజు నుండి నిర్విరామంగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నేటి నుండి రెండు వారాల పాటు అమలాపురం పరిసర ప్రాంతాల్లో హీరోలు , హీరోయిన్లలతో పాటు రాజేంద్ర ప్రసాద్ , నరేష్ మిగతా తారాగణంపై కొన్ని కీలక సన్నివేషాలు చిత్రీకరించబోతున్నాం. ఆ తర్వాత వైజాగ్ లో మిగతా సన్నివేశాలు తీయనున్నాము. యూత్ ఫుల్ ఫన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను.”అన్నారు.

చిత్ర నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ” ఈరోజు నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకోనున్న మా సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.  సతీష్ గారు  యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించేలా మంచి కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథకు తగ్గట్టుగా మంచి నిర్మాణ విలువలతో క్వాలిటీ సినిమాగా ‘కోతి కొమ్మచ్చి’ ప్రేక్షకుల ముందుకు రానుంది” అన్నారు.

హీరో -హీరోయిన్స్ : మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి.

మిగతా నటీ నటులు : రాజేంద్ర ప్రసాద్ , వి.కే. నరేష్, సిజ్జు , అన్నపూర్ణమ్మ, రాజ శ్రీ నాయర్,  మణి చందన , ప్రవీణ్, సుదర్శన్, శివన్నారాయణ తదితరులు

సంగీతం : అనూప్ రుబెన్స్

ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి

సాహిత్యం : శ్రీమణి

ఆర్ట్ : రామంజనేయులు

ఎడిటింగ్ : మధు

పి.ఆర్.ఓ : రాజేష్ మన్నె

నిర్మాత : ఎం.ఎల్.వి.సత్యనారాయణ

రచన -దర్శకత్వం : వేగేశ్న సతీష్

 
 
‘Kothi Kommachi’ kickstarts shoot in Amalapuram

Kothi Kommachi, the youthful entertainer, directed by Sathish Vegesna, who had earlier helmed the national award-winning film Shatamanam Bhavati, commenced its shoot in Amalapuram on Monday. Meghamsh Srihari, Sameer Vegesna, Riddhi Kumar, Megha Chowdhury play the lead roles in the film being produced by M L V Sathyanarayana (Satthibabu) under Lakshya Productions.

“We’ve begun the shoot of ‘Kothi Kommachi’ earlier today. Several sequences featuring the lead actors, veteran actors Rajendra Prasad, Naresh will be shot in the vicinity of Amalapuram for a couple of weeks We’ll proceed to Vizag to shoot the remaining portions after this. I’m confident of entertaining the audiences with this fun-filled entertainer,” Vegesna Satish said.

“We’re sure of coming up with a film that will be liked by youngsters and family audiences alike. Vegesna Sathish  has penned a very good story with a strong emotional hook and we’re leaving no stone unturned to mount it on a lavish scale. The film will be a visual treat for crowds,” the producer M L V Sathyanarayana exuded confidence.

Lead actors: Meghamsh Srihari, Sameer Vegesna, Riddhi Kumar, Megha Chowdhury

Supporting cast: Rajendra Prasad, V K Naresh, Sijju, Annapurnamma, Rajasri Nair, Manichandana, Praveen, Sudarshan, Sivannarayana

Music: Anup Rubens

Cinematography: Sameer Reddy

Lyrics: Sri Mani

Art director: Ramanjaneyulu

Editing: Madhu

PRO: Rajesh Manne

Producer: M L V Sathyanarayana

Writer-Director: Vegesna Satish