Harsh Kanumilli, Simran Choudary’s Sehari Launched Today

Harsh Kanumilli, Simran Choudary’s Sehari Launched Today

ఘ‌నంగా ప్రారంభ‌మైన వ‌ర్గో పిక్చ‌ర్స్  ప్రొడ‌క్ష‌న్ నెం.1 `సెహ‌రి`.

వ‌ర్గో పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌద‌రి ప్ర‌ధాన పాత్రల‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం `సెహ‌రి`. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. జ్ఞానసాగ‌ర్ ద్వార‌క ద‌ర్శ‌క‌త్వంలో అద్వ‌య జిష్ణు రెడ్డి, శిల్పా చౌద‌రి నిర్మిస్తోన్నఈ చిత్రం సంస్థ కార్యాల‌యంలో ఈ రోజు పూజా కార్య‌క్ర‌మాతో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు క్లాప్ నివ్వ‌గా, అల్లు బాబీ కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాత భ‌ర‌త్ నారంగ్ స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు జ్ఞాన సాగ‌ర్ కు అంద‌జేశారు. అనంత‌రం ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో..

చిత్ర నిర్మాత అద్వ‌య జిష్ణు రెడ్డి మాట్లాడుతూ –  ముందుగా మా టీమ్ అంద‌రినీ ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన దిల్‌రాజు, అల్లు బాబీ, భ‌ర‌త్ నారంగ్ గారికి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. సెహ‌రి ఒక న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరి. ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరింది. మీ అంద‌రి స‌పోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

నిర్మాత శిల్పా చౌద‌‌రి మాట్లాడుతూ – “ప‌క్కాగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ చేసుకుని షూటింగ్ కి రెడీ అయ్యాము. కోటి గారు త‌ప్ప మిగ‌తా టీమ్ అంద‌రూ దాదాపు కొత్త‌వారే.. మంచి టీమ్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌బోతున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది` అన్నారు.

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి మాట్లాడుతూ – “సంగీత ద‌ర్శకుడిగా 500ల‌కు పైగా చిత్రాలు చేసిన నేను ద‌ర్శ‌కుడు  జ్ఞానసాగ‌ర్ చెప్పిన క‌థ న‌చ్చి ఈ సినిమాలో హీరో తండ్రిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. ఒక ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఈ చిత్రం. సెహ‌రి  అంటే సెల‌బ్రేష‌న్ అని అర్ధం. ఈ సినిమా ప్రారంభోత్స‌వం మా టీమ్ అంద‌రికీ ఒక సెల‌బ్రేష‌న్. వండ‌ర్‌ఫుల్ టీమ్ కుదిరింది. త‌ప్ప‌కుండా ఆర్టిస్టుగా నాకు మంచి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుంద‌ని న‌మ్ముతున్నాను“ అన్నారు.

హీరో హ‌ర్ష్ క‌నుమిల్లి మాట్లాడుతూ – “ముందుగా మా సినిమాలో ఒక మంచి పాత్ర‌లో న‌టిస్తోన్న సంగీత ద‌ర్శ‌కులు కోటి గారికి కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమాలో లీడ్‌రోల్‌లో న‌టించ‌డంతో పాటు మా ఫ్రెండ్స్ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌నల ఆధారంగా క‌థ ‌కూడా నేనే రాయ‌డం జ‌రిగింది. న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరిగా ఈ మూవీ త‌ప్ప‌కుండా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది.  అభిన‌వ్ గొమటం క్యారెక్ట‌ర్ ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. టీమ్ అంద‌రూ మంచి స‌హ‌కారం అందిస్తున్నారు.  మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ ఆర్ విహారి గారు ఇప్ప‌టికే  రెండు పాట‌లను అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు అద్వ‌య జిష్ణు రెడ్డి, శిల్పా చౌద‌రి గారికి థాంక్స్‌.  మీ అంద‌రి బ్లెసింగ్స్ కావాలి“ అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు జ్ఞానసాగ‌ర్ ద్వార‌క మాట్లాడుతూ – “ నెక్ట్స్ వీక్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతుంది. కోటి గారు కేవ‌లం 20 నిమిషాలు న‌రేష‌న్ విని ఈ సినిమాలో క్యారెక్ట‌ర్ చేయ‌డానికి ఒప్పుకున్నారు. హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌద‌రి పాత్ర‌లు విభిన్నంగా ఉండి త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తాయి.  ప్ర‌శాంత్ ఆర్ విహారి సంగీతం, సురేష్ సారంగం సినిమాటోగ్ర‌ఫి త‌ప్ప‌కుండా మా సినిమాకు ప్ల‌స్ అవుతాయి. మా టీమ్‌ని ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు` అన్నారు.

హీరోయిన్ సిమ్రాన్ చౌద‌రి మాట్లాడుతూ – “ఈ సినిమా త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్టైన్ చేస్తుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కి ధ‌న్య‌వాదాలు` అన్నారు.

హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌద‌రి, కోటి, బాల‌కృష్ణ‌, అభిన‌వ్ గోమ‌టం, ప్ర‌నీత్ క‌ళ్లెం, అనీషా రెడ్డి, అక్షి‌త శెట్టి, రాజేశ్వ‌రి, శ్రిస్తి, అనీల్ కుమార్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి

సాంకేతిక వ‌ర్గం.
బ్యాన‌ర్: వ‌ర్గో పిక్చ‌ర్స్
ద‌ర్శ‌క‌త్వం: జ్ఞానసాగ‌ర్ ద్వార‌క
నిర్మాత‌లు: అద్వ‌య జిష్ణు రెడ్డి, శిల్పా చౌద‌రి
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: మేఘ‌న క‌నుమిల్లి
సినిమాటోగ్ర‌ఫి: సురేష్ సారంగం
సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్ విహారి
ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజ‌ల‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: సాహి సురేష్‌,
క‌థ‌: హ‌రీష్ కొనిమిల్లి
పిఆర్ఒ: వ‌ంశీ – శేఖ‌ర్‌

Harsh Kanumilli, Simran Choudary’s Sehari Launched Today

Harsh Kanumilli and Simran Choudary starrer new film Sehari title poster is dropped today. Advaya Jishnu Reddy in partnership with Shilpa Chowdary will be making this new age rom-com entertainer that marks directorial debut of ad filmmaker Gangasagar Dwaraka who directed numerous ad films.

The production No 1 of Virgo Pictures has been launched today with formal pooja ceremony in Hyderabad and regular shoot also commences today.

For the muhurtham shot, Allu Bobby switched on the camera, while Dil Raju sounded the clapboard. Asian Cinemas Bharath Narang handed over the script to the makers.

Prashanth R Vihari will score music, while Suresh Sarangam handle the cinematography. Raviteja Girijala is the editor and Sahi Suresh is the art director.

Music director Koti plays a key role in the movie.

Cast: Harsh Kanumilli, Simran Choudary, Abhinav Gomatam, Praneeth Reddy, Anisha Alla, Akshitha Harish, Koti, Balakrishna and others.

Technical Crew:
Director: Gnanasagar Dwaraka
Producer: Advaya Jishnu Reddy, Shilpa Chowdary
D.O.P: Suresh Sarangam
Music Director: Prashanth R Vihari
Editor: Raviteja Girijala
Art Director: Sahi Suresh